Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఘనంగా 69వ గణతంత్ర దినోత్సవ వేడుకలు- అదిరిన సైనిక పరేడ్..

దేశ 69వ గణతంత్ర దినోత్సవ వేడుకలు అట్టహాసంగా జరుగుతున్నాయి. మునుపెన్నడూ లేని విధంగా పది ఆసియా దేశాలకు చెందిన అధినేతలు ఢిల్లీలో జరుగుతున్న గణతంత్ర దినోత్సవ వేడుకల్లో హాజరయ్యారు. ఢిల్లీ రాజ్ పథ్‌లో నిర్వ

ఘనంగా 69వ గణతంత్ర దినోత్సవ వేడుకలు- అదిరిన సైనిక పరేడ్..
, శుక్రవారం, 26 జనవరి 2018 (10:58 IST)
దేశ 69వ గణతంత్ర దినోత్సవ వేడుకలు అట్టహాసంగా జరుగుతున్నాయి. మునుపెన్నడూ లేని విధంగా పది ఆసియా దేశాలకు చెందిన అధినేతలు ఢిల్లీలో జరుగుతున్న గణతంత్ర దినోత్సవ వేడుకల్లో హాజరయ్యారు. ఢిల్లీ రాజ్ పథ్‌లో నిర్వహించిన సైనిక పరేడ్ అందరినీ ఆకట్టుకుంది. బైకులపై జవాన్లు చేసిన విన్యాసాలు కూడా ఆకర్షించాయి. 
 
వంద అడుగుల భారీ వేదికపై ఆసీనులైన పదిదేశాల అధినేతలకు ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా ఆహ్వానం పలికారు. ఆపై రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్, త్రివిధ దళాధిపతులు వారికి షేక్ హ్యాండ్ ఇచ్చారు. అమర వీరుల స్థూపం వద్ద నివాళులు అర్పించిన రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, రాజ్ పథ్‌కు రావడంతో గణతంత్ర వేడుకలు అధికారికంగా మొదలయ్యాయి.
 
ఈ వేడుకల్లో భారత సార్వభౌమత్వాన్ని ప్రదర్శిస్తూ, వివిధ రకాల అత్యాధునిక క్షిపణులు, సైనికుల విన్యాసాలతో సాగిన పరేడ్‌ను ప్రజలతో పాటు పది దేశాల అధినేతలు కన్నార్పకుండా తిలకించారు. అతిథుల భద్రత నిమిత్తం 60 వేల మంది సిబ్బందిని కేంద్రం ఏర్పాటు చేసింది. ఢిల్లీ పోలీసులతో పాటు బీఎస్ఎఫ్, సీఐఎస్ఎఫ్, ఆర్ఏఎఫ్ సహా వివిధ విభాగాలు భాగస్వామ్యమయ్యాయి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

యాంకర్‌కు వేధింపులు- పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి.. చివరికి?