Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Thursday, 3 April 2025
webdunia

మీరట్‌లో లైవ్ మర్డర్ (వీడియో)

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో అధికార మార్పిడి జరిగినా శాంతిభద్రతలు మాత్రం ఏమాత్రం అదుపులోకి రాలేదని చెప్పొచ్చు. ఈ రాష్ట్రంలోని మీరట్‌లో కొందరు దుండగులు ఓ వృద్ధురాలిని, ఆమె కుమారుడిని నిలువునా కాల్చి చంపారు.

Advertiesment
Live Murder
, గురువారం, 25 జనవరి 2018 (16:24 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో అధికార మార్పిడి జరిగినా శాంతిభద్రతలు మాత్రం ఏమాత్రం అదుపులోకి రాలేదని చెప్పొచ్చు. ఈ రాష్ట్రంలోని మీరట్‌లో కొందరు దుండగులు ఓ వృద్ధురాలిని, ఆమె కుమారుడిని నిలువునా కాల్చి చంపారు. ఈ జంట హత్యలు స్థానికంగా కలకలం రేపాయి. ఈ హత్యా దృశ్యాలు సీసీ టీవీ కెమెరాల్లో నమోదైంది. ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
మీరట్ ప్రాంతానికి చెందిన నిచేత్తర్‌ కౌర్‌ అనే 60 ఏళ్ల వృద్ధురాలు మరో మహిళలతో కలిసి మంచంపై కూర్చుని మాట్లాడుతోంది. ఇంతలో ముగ్గురు దుండగులు తుపాకులు చేతధరించి వచ్చి నిచేత్తర్‌పై విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. అయినప్పటికీ ఆమె ప్రతిఘటించినప్పటికీ.. అతి సమీపం నుంచి కాల్పులు జరపడంతో ప్రాణాలు విడిచింది. 
 
దాంతో ఆమె అక్కడికక్కడే మృతిచెందింది. దుండగులు అంతటితో ఆగకుండా ఆమె కుమారుడిని కూడా హత్య చేసి మృతదేహాన్ని ఊరి చివరిలోని ఓ కారులో దాచారు. మృతురాలి పక్కనే ఉన్న మహిళను మాత్రం పారిపోయింది. ఈ దారుణమంతా అక్కడే ఉన్న సీసీటీవీలో రికార్డు కావడంతో విషయం వెలుగులోకి వచ్చింది. 
 
నిచేత్తర్ కౌర్ భర్త కూడా ఇదే విధంగా హత్యకు గురయ్యాడు. ఈ కేసు విషయంలో సాక్ష్యం చెప్పడానికి గురువారం నిచేత్తర్‌, కుమారుడు బల్వీందర్‌ న్యాయస్థానంలో హాజరుకావాల్సి ఉంది. కోర్టుకు హాజరవడానికి ఒక్కరోజు ముందు ఇద్దరూ హత్యకు గురికావడంతో ప్రత్యర్థులే ఈ దారుణానికి పాల్పడి ఉంటారని అనుమానిస్తున్నారు. ఈ మేరకు పోలీసులు కొందరిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. సీసీటీవీ ఫుటేజ్‌ ఆధారంగా మిగతా నిందితుల కోసం గాలింపులు చేపడుతున్నారు. 

 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రాజ్యాంగ ప్రతులెన్ని వున్నాయి? 26నే ఎందుకు జరుపుకోవాలి?