Webdunia - Bharat's app for daily news and videos

Install App

విశాఖ టెస్టు: వరుసగా పెవిలియన్ క్యూ కట్టిన బ్యాట్స్‌మెన్లు.. 204 పరుగులకే భారత్ ఆలౌట్..

విశాఖ టెస్టు మ్యాచ్‌ రెండో ఇన్నింగ్స్‌లో భారత్ వికెట్లు వెంట వెంటనే నేలకూలాయి. ఫలితంగా 204 పరుగులకే భారత్ ఆలౌటైంది. దీంతో మొత్తం 404 పరుగుల లీడ్ సాధించింది. నాలుగో రోజు 98/3 ఓవర్ నైట్ స్కోర్‌తో ఆటను క

Webdunia
ఆదివారం, 20 నవంబరు 2016 (13:58 IST)
విశాఖ టెస్టు మ్యాచ్‌ రెండో ఇన్నింగ్స్‌లో భారత్ వికెట్లు వెంట వెంటనే నేలకూలాయి. ఫలితంగా 204 పరుగులకే భారత్ ఆలౌటైంది. దీంతో మొత్తం 404 పరుగుల లీడ్ సాధించింది. నాలుగో రోజు 98/3 ఓవర్ నైట్ స్కోర్‌తో ఆటను కొనసాగించిన టీమిండియా మరో 106 పరుగులు జోడించింది. తొలి సెషన్ ఆరంభంలోనే వరుసగా మూడు వికెట్లను కోల్పోయింది. 
 
ఓవర్ నైట్ ఆటగాడు అజింక్యా రహానే(26) నాల్గో వికెట్‌గా పెవిలియన్ చేరుకున్నాడు. ఆపై భారత బ్యాట్స్‌మెన్లు పెవిలియన్ క్యూ కట్టారు. రహానేకు తర్వాత పది పరుగుల వ్యవధిలో రవి చంద్రన్ అశ్విన్(7)అవుటయ్యాడు. మరికొద్దిసేపటికే వృద్థిమాన్ సాహా(2) పెవిలియన్ చేరారు. 130/6 తో కష్టాల్లో టీమిండియాను ఆదుకునే ప్రయత్నం చేశాడు కెప్టెన్ కోహ్లీ(81). అయినా ఫలితం లేకుండా పోయింది. 
 
రషీద్ బౌలింగ్‌లో ఏడో వికెట్ గా పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత వచ్చిన జడేజా, యూటీ యాదవ్ వెంట వెంటనే ఔటయ్యారు. దీంతో 204 పరుగులకే టీమిండియా అన్నీ వికెట్లను కోల్పోయింది. ఇంగ్లండ్ బౌలర్లలో బ్రాడ్, రషీద్ చెరో నాలుగు వికెట్లు, అండర్సన్, అలీ చెరో వికెట్ తీసుకున్నారు. కాగా తొలి ఇన్నింగ్స్‌లో 455 పరుగులు సాధించిన భారత్.. రెండో ఇన్నింగ్స్‌లో 204 పరుగులకే పరిమితం అయ్యింది. ఇక ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 255 పరుగులు సాధించింది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

భార్య కళ్ళలో కారం చల్లాడు.. పెట్రోల్ పోసి సజీవ దహనం చేశాడు.. జీవితఖైదు

Maharashtra: ఫోన్ చూసుకుంటున్న తండ్రి, నాలుగేళ్ల బాలుడిపై ఎక్కి దిగిన కారు.. ఎక్కడ? (video)

195 ఎర్రచందనం దుంగల స్వాధీనం.. పోలీసులను అభినందించిన డిప్యూటీ సీఎం పవన్

తిరుమల నందకం అతిథి గృహంలో దంపతుల ఆత్మహత్య.. చీరతో ఉరేసుకుని?

ఫిబ్రవరి 24న ప్రారంభం కానున్న ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చాలా కాలంగా మిస్ అయ్యాను, తండేల్ తో మళ్ళీ నాకు తిరిగివచ్చింది : అక్కినేని నాగచైతన్య

చిరంజీవి పేరు చెప్పడానికి కూడా ఇష్టపడని అల్లు అరవింద్

మాస్ ఎంటర్‌టైనర్‌ గా సందీప్ కిషన్ మజాకా డేట్ ఫిక్స్

బొమ్మరిల్లు బాస్కర్, సిద్ధు జొన్నలగడ్డ కాంబోలో వినోదాత్మకంగా జాక్ టీజర్

తెలంగాణ దర్శకుడు తనయుడు దినేష్‌మహీంద్ర దర్శకత్వంలో లవ్‌స్టోరీ

తర్వాతి కథనం
Show comments