Webdunia - Bharat's app for daily news and videos

Install App

అజిత్‌ వాడేకర్‌ కన్నుమూత.. ప్రధాని సంతాపం

భారత మాజీ టెస్ట్‌ కెప్టెన్‌, చీఫ్‌ సెలక్టర్‌ అజిత్‌ వాడేకర్‌ (77) తుదిశ్వాస విడిచారు. దీర్ఘకాలిక అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన దక్షిణ ముంబైలోని జస్లోక్ దవాఖానాలో చికిత్స పొందుతూ మరణించారు. ఈ విషయాన్ని ఆ

Webdunia
గురువారం, 16 ఆగస్టు 2018 (12:50 IST)
భారత మాజీ టెస్ట్‌ కెప్టెన్‌, చీఫ్‌ సెలక్టర్‌ అజిత్‌ వాడేకర్‌ (77) తుదిశ్వాస విడిచారు. దీర్ఘకాలిక అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన దక్షిణ ముంబైలోని జస్లోక్ దవాఖానాలో చికిత్స పొందుతూ మరణించారు. ఈ విషయాన్ని ఆస్పత్రి వైద్యులు వెల్లడించారు.


ఎడమ చేతివాటం బ్యాట్స్‌మన్‌ అయిన వాడేకర్‌ మూడో స్థానంలో మైదానంలోకి దిగేవారు. స్లిప్‌లో చురుకైన ఫీల్డర్‌ అయిన వాడేకర్ భారత్‌ తొలి వన్డే జట్టులోనూ వాడేకర్‌ సభ్యుడు కావడం విశేషం. ఇంకా భారత జట్టుకు ఆయన కోచ్‌గానూ సేవలు అందించారు. 
 
భారత జట్టు తరఫున ఆయన 37 టెస్ట్ మ్యాచ్‌లు, 2 వన్డే మ్యాచ్‌లు ఆడారు. 1941లో ముంబైలో జన్మించిన వాడేకర్.. భారత అత్యుత్తమ క్రికెటర్లలో ఒకరు. 1974లో ఇంగ్లండ్‌తో జరిగిన తొలి వన్డే మ్యాచ్‌లో భారత జట్టుకు వాడేకర్ సారథ్యం వహించారు.

అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ తీసుకున్న తర్వాత 1990లలో జట్టు కోచ్‌గా, మేనేజర్‌గా సేవలందించారు. వాడేకర్ మృతి పట్ల క్రికెట్ సెలెబ్రిటీలు, ఫ్యాన్స్ దిగ్భ్రాంతి చెందారు. అలాగే దేశ ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు నితిన్ గడ్కారీ, సురేష్ ప్రభుతో పాటు పలువురు రాజకీయ, క్రీడా ప్రముఖలు ప్రగాఢ సంతాపం తెలిపారు.
 
1990ల్లో అజహరుద్దీన్‌ కెప్టెన్సీలోని భారత జట్టుకు మేనేజర్‌ కమ్‌ కోచ్‌గా వ్యవహరించారు. సీకే నాయుడు జీవిత సాఫల్యపురస్కారం కూడా అజిత్‌వాడేకర్‌ అందుకున్నారు. 1998-99 మధ్యకాలంలో సెలక్షన్‌ కమిటీ చైర్మన్‌గా పనిచేశారు. లాలా అమర్‌నాథ్, చందూ బోర్డె తర్వాత ఆటగాడిగా, సారథిగా, కోచ్‌గా, సెలక్షన్‌ కమిటీ చైర్మన్‌గా చేసిన మూడో వ్యక్తిగా రికార్డుల కెక్కారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఉత్తరాఖండ్‌లో జలప్రళయం... 10 సైనికుల మిస్సింగ్

అప్పులు బాధ భరించలేక - ముగ్గురు కుమార్తెలను గొంతుకోసి హత్య.. తండ్రి ఆత్మహత్య

ప్రేమ వివాహాలపై నిషేధం విధించిన పంజాబ్‌ గ్రామం!!

ఎవరికాళ్లో మొక్కి మంత్రి పదవి తెచ్చుకోవాలనుకోవట్లేదు : కె.రాజగోపాల్ రెడ్డి

24 గంటల్లో భారత్‌కు మరో షాకిస్తాం : డోనాల్డ్ ట్రంప్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అనుపమ పరమేశ్వరన్ చిత్రం పరదా నుంచి మెలోడీ సాంగ్ విడుదలైంది

'కింగ్డమ్‌'కు తమిళనాట నిరసనలు - చిత్ర ప్రదర్శన నిలిపివేయాలంటూ డిమాండ్

అడివి శేష్ పాన్ ఇండియా స్పై యాక్షన్ థ్రిల్లర్ G2 డేట్ ఫిక్స్

త్రిబాణధారి బార్బరిక్ ప్రమోషన్ లో చిరంజీవి కంప్లీట్ యాక్టర్.. నసత్య రాజ్ కితాబు

ఓలే ఓలే.. అంటూ మాస్ జాతర సాంగ్ తో ఆకట్టుకున్న రవితేజ, శ్రీలీల జోడి

తర్వాతి కథనం
Show comments