Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైస్ కెప్టెన్సీ నుంచి కేఎల్ రాహుల్‌కు ఉద్వాసన

Webdunia
సోమవారం, 20 ఫిబ్రవరి 2023 (10:05 IST)
భారత యువ క్రికెటర్ కేఎల్ రాహుల్‌కు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) తేరుకోలోని షాకిచ్చింది. జట్టు వైస్ కెప్టెన్సీ నుంచి తొలగించింది. ప్రస్తుతం స్వదేశంలో భారత క్రికెట్ జట్టు పర్యాటక ఆస్ట్రేలియాతో గవాస్కర్ - బోర్డర్ టెస్ట్ సిరీస్‌ను ఆడుతోంది. ఇప్పటివరకు జరిగిన తొలి రెండు టెస్టుల్లో భారత్ విజయభేరీ మోగించింది. మరో రెండు టెస్టులు ఉన్నాయి. ఈ రెండు టెస్టుల కోసం బీసీసీఐ జాతీయ సెలెక్టర్లు తాజాగా జట్టును ప్రకటించారు. 
 
ఈ జట్టుకు వైస్ కెప్టెన్సీ లేకుండానే ఆటగాళ్ల పేర్లను ప్రకటించారు. అయితే, కేఎల్ రాహుల్‌ను వైస్ కెప్టెన్సీ నుంచి తప్పించినప్పటికీ ఆయనకు జట్టులో చోటు కల్పించింది. ఎంతో మంది ప్రతిభావంతులైన ఆటగాళ్ళు అందుబాటులో ఉన్నప్పటికీ కేఎల్ రాహుల్‌కు జట్టు యాజమాన్యం పలు అవకాశాలు కల్పిస్తుంది. కానీ, రాహుల్ మాత్రం సరిగా నిలదొక్కుకోలేక పోతున్నారు. 
 
దీంతో వైస్ కెప్టెన్సీ భారాన్ని అతనిపై నుంచి తొలగించింది. అదేసమయంలో ఆస్ట్రేలియాతో జరుగనున్న చివరి రెండు టెస్ట్ మ్యాచ్‌లకు ప్రకటించిన జట్టుకు ఉపసారథి లేకుండా ప్రకటించడం ఇపుడు చర్చనీయాంశంగా మారింది. బంగ్లాదేశ్ పర్యటనలో ఛటేశ్వర్ పుజారా వైస్ కెప్టెన్‌గా వ్యవహరించారు. ఇపుడు అతని పేరును కూడా బీసీసీఐ సెలెక్టర్లు పరిగణనలోకి తీసుకోకపోవడం గమనార్హం. 

సంబంధిత వార్తలు

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

తర్వాతి కథనం
Show comments