Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐపీఎల్ ఎలిమినేటర్ : నేడు హైదరాబాద్‌-కోల్‌కతా పోరు

Webdunia
బుధవారం, 25 మే 2016 (10:31 IST)
ఐపీఎల్‌-9లో చావోరేవో తేల్చుకోవడానికి సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌, కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్లు సిద్ధమయ్యాయి. లీగ్‌ దశలో అద్భుత పోరాట నైపుణ్యం ప్రదర్శించిన వార్నర్‌ సేన నాకౌట్‌ సమరానికి సిద్ధమైంది. ఫిరోజ్‌ షా కోట్లా మైదానం వేదికగా బుధవారం జరిగే ఎలిమినేటర్‌లో రెండుసార్లు టోర్నీ చాంపియన్‌ కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో సన్‌రైజర్స్‌ అమీతుమీ తేల్చుకోనుంది. 
 
ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు ఫైనల్‌ బెర్త్‌ కోసం క్వాలిఫయర్‌-1 పరాజితతో పోటీపడాల్సి ఉంటుంది. ఓడిన జట్టు మాత్రం ఇంటిదారి పట్టాల్సిందే. బ్యాటింగ్‌, బౌలింగ్‌లో ఇరు జట్లూ సమవుజ్జీలుగా ఉన్నాయి. అయితే లీగ్‌ దశలో కోల్‌కతాతో ఆడిన రెండు మ్యాచ్‌ల్లో హైదరాబాద్‌ ఓడటం ఆందోళన కలిగించే అంశం. 
 
ఇరు జట్లు (అంచనా)
కోల్‌కతా నైట్‌రైడర్స్‌: ఊతప్ప, గంభీర్‌ (కెప్టెన్‌), మన్రో, మనీష్‌ పాండే, యూసుఫ్‌ పఠాన్‌, హోల్డర్‌, షకీబల్‌, సూర్యకుమార్‌, రాజ్‌పుత, నరైన్‌, కుల్దీప్‌ యాదవ్‌.
సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌: ధవన్‌, వార్నర్‌ (కెప్టెన్‌), నమన్‌ ఓఝా, యువరాజ్‌, విలియమ్సన్‌, దీపక్‌ హుడా, హెన్రిక్స్‌, కర్ణ్‌శర్మ, భువనేశ్వర్‌, బరీందర్‌ స్రాన్‌, ముస్తాఫిజుర్‌. 

పార్లమెంట్‌లో బీజేపీ ఉన్నంతవరకు రిజర్వేషన్లు చెక్కు చెదరవు : అమిత్ షా

తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన... 24 నాటికి వాయుగుండం...

పిఠాపురం నుంచి అప్పుడే పనులు మొదలెట్టిన పవన్

మహిళపై పగబట్టిన పాము, ఆరేళ్లుగా అదను చూసి కాటు

కిడ్నీల దానం పేరు మనుషుల అక్రమ రవాణా.. కేరళ వాసి అరెస్టు!!

బంగారు దుస్తులతో ఆధునిక రావణుడిగా కేజీఎఫ్ హీరో

సినిమాలోకి రావాలనే యువకుల కథతో ఓసి చిత్రం సిద్ధం

సుధీర్ బాబు నటించిన పీరియాడికల్ ఫిల్మ్.హరోం హర విడుదల వాయిదా

టాలీవుడ్ మారాలంటున్న కాజల్ అగర్వాల్ !

పుష్ప.. పుష్ప.. సాంగ్ లో నటించింది మీనానేనా?

తర్వాతి కథనం
Show comments