Webdunia - Bharat's app for daily news and videos

Install App

IPL2024 : లక్నో సూపర్ జెయింట్స్‌ను చిత్తు చేసిన రాజస్థాన్

వరుణ్
ఆదివారం, 24 మార్చి 2024 (19:37 IST)
జైపూర్ వేదికగా ఆదివారం జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్‌ను రాజస్థాన్ రాయల్స్ జట్టు చిత్తు చేసింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్ఆర్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 9.65 రన్ రేట్‌తో నాలుగు వికెట్ల నష్టానికి 193 పరుగులు చేసింది. ఆ తర్వాత 194 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన లక్నో సూపర్ జెయింట్స్ 173 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో 20 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఎల్.ఎస్.జే జట్టులో ఓపెనర్ డీకాక్ 4, కేఎల్ రాహుల్ 58, పడిక్కల్ 0, బదోని 1, హూడా 26, పూరణ్ 64, స్టాయిన్స్ 3, కృనాల్ పాండ్య 3 చొప్పున పరుగులు చేశారు. కెప్టెన్ కేఎల్ రాహుల్, నికోలస్ పూరణ్‌, హుడాలు మాత్రమే రెండు అంకెల స్కోరు చేశారు. మిగిలిన ఆటగాళ్లంతా ఇటొచ్చి అటెళ్లిపోయారు. 
 
అంతకుముందు.. రాజ‌స్థాన్ రాయ‌ల్ తన తొలి మ్యాచ్‌లో ల‌క్నో సూప‌ర్ జెయింట్స్‌‌పై 193 పరుగులు చేసింది. ఆ జట్టులో జైశ్వాల్ 24, బట్లర్ 11, శాంసన్ 82 (నాటౌట్), పరగ్ 42, హెట్మెయిర్ 5, జురెల్ 20, చొప్పున పరుగులు చేయగా, అదనపు రన్స్ రూపంలో 8 వచ్చాయి. అయితే, డాషింగ్ ఆటగాడు సంజూ శాంసన్ అర్ధ శ‌త‌కంతో చెల‌రేగాడు. త‌ద్వారా వ‌రుస‌గా ఐదు సీజ‌న్ల తొలి మ్యాచ్‌లో సంజూ యాభైకి త‌గ్గ‌కుండా స్కోర్ చేసిన ఆట‌గాడిగా రికార్డు నెల‌కొల్పాడు. 
 
సిక్స‌ర్ల వీరుడిగా పేరొందిన శాంస‌న్ ఐపీఎల్ 2020 ఎడిష‌న్ నుంచి ఫ‌స్ట్ మ్యాచ్‌లో క‌నీసం హాఫ్ సెంచ‌రీ బాదేస్తున్నాడు. 2020లో చెన్నై సూపర్ కింగ్స్‌పై సంజూ 34 బంతుల్లోనే 74 ర‌న్స్ కొట్టాడు. 2021లో పంజాబ్ కింగ్స్‌పై ఏకంగా సెంచ‌రీతో క‌దం తొక్కాడు. ఆ మ్యాచ్‌లో సిక్స‌ర్ల వ‌ర్షం కురిపించిన ఈ ప‌వ‌ర్ హిట్ట‌ర్ 63 బంతుల్లోనే 119 ర‌న్స్ కొట్టేశాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అదానీ ఇచ్చిన రూ. 100 కోట్లు విరాళం నిరాకరిస్తున్నాం: సీఎం రేవంత్ రెడ్డి

ఆక్సిజన్ కొరత.. కవలపిల్లలు అంబులెన్స్‌లోనే చనిపోయారా?

అల్పపీడనం: నవంబర్ 26 నుంచి 29 వరకు ఏపీలో భారీ వర్షాలు (video)

జ్వరంతో విద్యార్థిని మృతి.. టీచర్లపై కేసు నమోదు.. ఎందుకని?

జైలుకు వెళ్లినలారంతా సీఎం అయ్యారనీ.. ఆ లెక్కన కేటీఆర్‌కు ఆ ఛాన్స్ రాదు : సీఎం రేవంత్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విజయ్ దేవరకొండ రౌడీ వేర్ బ్రాండ్ కు ఔట్ లుక్ ఇండియా బిజినెస్ అవార్డ్

వికటకవి చూసి గర్వంగా అనిపించింది.. నిర్మాత రామ్ తాళ్లూరి

రామ్ పోతినేని సినిమాకు తమిళ సంగీత ద్వయం వివేక్ - మెర్విన్

ఉజ్జయిని మహాకాళేశ్వర్ టెంపుల్ సాక్షిగా కన్నప్ప రిలీజ్ డేట్ ప్రకటన

వెన్నెల కిషోర్ నటించిన శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ రిలీజ్ డేట్ ఫిక్స్

తర్వాతి కథనం
Show comments