Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

IPL2024 : జైపూర్ వేదికగా రాజస్థాన్ రాయల్స్ - లక్నో సూపర్ జెయింట్స్

Advertiesment
rr vs lsg

వరుణ్

, ఆదివారం, 24 మార్చి 2024 (15:36 IST)
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024 సీజన్ పోటీల్లో భాగంగా ఆదివారం రెండు కీలక మ్యాచ్‌లు జరుగనున్నాయి. జైపూర్ వేదికగా రాజస్థాన్ రాయల్స్, లక్నో సూపర్ జెయింట్స్ జట్ల మధ్య కీలక మ్యాచ్ జరుగనుంది. రెండో మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ జట్లు తలపడతాయి. అయితే, తొలి మ్యాచ్‌లో రాజస్థాన్ జట్టు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ ఆదివారం మధ్యాహ్నం 3.30 గంటలకు ప్రారంభమైంది. రెండో మ్యాచ్ రాత్రి 7.30 గంటలకు మొదలవుతుంది. 
 
తొలి మ్యాచ్ జైపూర్‌లోని సవాయ్ మాన్ సింగ్ స్టేడియం వేదికగా నిలవనుంది. టాస్ గెలిచిన రాజస్థాన్ జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ జట్టులో యశస్వి జైశ్వాల్, జోస్ బట్లర్, హెట్మెయిర్, కెప్టెన్ సంజు శాంసన వంటి హార్డ్ హిట్టర్లు ఉన్నారు. పేస్ బౌలింగ్‌లో ట్రెంట్ బౌల్ట్, అవేష్ ఖాన్, స్పిన్‌లో అశ్విన్, చహల్‌లతో రాజస్థాన్ బౌలింగ్ వనరులు మెరుగ్గా ఉన్నాయి. అలాగే, లక్నో జట్టులో ప్రధానంగా కెప్టెన్ కేఎల్ రాహుల్, క్వింటన్ డికాక్, నికోలాస్ పూరన్‌ల ఫామ్‌పై ఆధారపడివుంది. దేవదత్ పడిక్కల్, ఆయుష్ బదోనివంటి దేశవాళీ ఆటగాళ్లు కూడా రాణించాలని లక్నో శిబిరం కోరుకుంటుంది.  

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

స్ఫూర్తిదాయకమైన సినినాలు చూశాం.. కానీ నిజజీవిత కథకు అవేమీ దగ్గరగా లేవు... : సూర్య కుమార్