Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఐపీఎల్‌లో చరిత్ర సృష్టించిన ముంబై ఇండియన్స్

Advertiesment
mumbai indians
, గురువారం, 4 మే 2023 (12:55 IST)
స్వదేశంలో జరుగుతున్న ఐపీఎల్ 2023 సీజన్‌ మ్యాచ్‌లలో ముంబై ఇండియన్స్ జట్టు చరిత్ర సృష్టించింది. వరుసగా రెండు ఓటములతో టోర్నీని ఆరంభించిన ఈ జట్టు ఆ తర్వాత పటిష్టమైన రాజస్థాన్‌ రాయల్స్, పంజాబ్ కింగ్స్‌ జట్లను మట్టి కరిపించి ప్లేఆఫ్స్ అవకాశాలను మెరుగుపర్చుకుంది. ఈ క్రమంలో అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. వరుసగా రెండు మ్యాచుల్లోనూ 200కిపైగా టార్గెట్‌ను ఛేదించిన ఏకైక జట్టుగా రికార్డు సృష్టించింది. దీంతో పాయింట్ల పట్టికలో ముంబై (10) ఏకంగా ఆరో స్థానానికి చేరుకుంది. మిగిలిన ఐదు మ్యాచుల్లోనూ విజయం సాధిస్తే ప్లేఆఫ్స్‌కు చేరుకోవడం ఖాయం. 
 
కాగా, ముంబై వేదికగా ఏప్రిల్ 22వ తేదీన పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో 215 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన రోహిత్ సేన 13 పరుగుల తేడాతో ఓడిపోయింది. దీంతో మొహాలీ వేదికగా బుధవారం జరిగిన మ్యాచ్‌లో మాత్రం 215 టార్గెట్‌ను ముంబై నాలుగు వికెట్లు మాత్రమే కోల్పోయి 18.5 ఓవర్లలోనే అవలీలగా ఛేదించింది. దీంతో అప్పటి ఓటమికి ఇప్పుడు ప్రతీకారం తీర్చుకున్నట్లు అయిందంటూ సోషల్‌ మీడియాలో పోస్టులు వైరల్‌గా మారాయి.
 
పంజాబ్‌తో మ్యాచ్‌కు ముందు వాంఖడే స్టేడియం వేదికగా రాజస్థాన్‌ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ ముంబై ఇండియన్స్‌ 213 పరుగులను ఛేదించి విజయం సాధించింది. ఐపీఎల్‌లో వాంఖడే వేదికగా ఇదే అత్యధిక ఛేదన కావడం విశేషం. అయితే, చివరి నాలుగు ఓవర్లకు 57  పరుగులు చేయాల్సిన తరుణంలో టిమ్‌ డేవిడ్ కేవలం 14 బంతుల్లోనే ఏకంగా 45 పరుగులు జోడించి ముంబైని గెలిపించాడు. ఈ మ్యాచ్‌లోనూ సూర్యకుమార్‌ (55) అర్థశతకం బాదాడు. తొలుత రాజస్థాన్‌ ఓపెనర్ యశస్వి జైస్వాల్ (124) భారీ శతకం సాధించాడు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మహిళలతో వివాహేతర సంబంధం.. షమీపై మాజీ భార్య ఫిర్యాదు