ఐపీఎల్ షెడ్యూల్ రిలీజ్ : మార్చి 26 నుంచి మెగా లీక్ ప్రారంభం

Webdunia
ఆదివారం, 6 మార్చి 2022 (21:34 IST)
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 15వ సీజన్ పోటీలకు సంబంధించిన షెడ్యూల్‌ను భారత క్రికెట్ కంట్రోలో బోర్డు ఆదివారం రిలీజ్ చేసింది. ఈ మెగా లీగ్ టోర్నీ ఈ నెల 26వ తేదీన ప్రారంభంకానుంది.
 
కరోనా పరిస్థితుల కారణంగా ఈ టోర్నీలో జరిగే అన్ని మ్యాచ్‌లను రెండు వేదికల్లోనే నిర్వహించనున్నారు. మహారాష్ట్రలోని ముంబైలోని మూడు, పూణెలోని ఓ స్టేడియంతో కలుపుకుని మొత్తం నాలుగు స్టేడియాల్లో నిర్వహిస్తారు. 
 
ఐపీఎల్ 15వ సీజన్‌లో మొత్తం 70 లీగ్ మ్యాచ్‌లు నాలుగు ప్లే ఆఫ్ మ్యాచ్‌లు ఉంటాయి మొత్తం 65 రోజుల పాటు ఈ మ్యాచ్‌లు నిర్వహించేలా ఏర్పాట్లు చేశారు.
 
తొలి మ్యాచ్ డిఫెండింగ్ చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ జట్ల మధ్య జరుగుతుంది. ఇది వాంఖడే స్టేడియంలో జరుగుతుంది. చివరి లీగ్ మ్యాచ్ సన్ రైజర్స్ హైదరాబాద్, పంజాబ్ కింగ్స్ జట్ల మధ్య జరుగనుంది. 
 
ముంబై వాంఖడే స్టేడియంలో 20 మ్యాచ్‌లు డీవై పాటిల్ స్టేడయంలో 20, బ్రాబౌర్న్ స్టేడియంలో 15, పూణేలోని ఎంసీఏ మైదానంలో 15 మ్యాచ్‍‌ల చొప్పున నిర్వహిస్తారు.
 
అలాగే, ఈ దఫా కూడా డబుల్ హైడర్లు (ఒకే రోజు రెండు మ్యాచ్‌లు) నిర్వహిస్తారు. తొలి మ్యాచ్ మధ్యాహ్నం 3.30 గంటలకు ప్రారంభమైతే రెండో మ్యాచ్ రాత్రి 7.30 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ టోర్నీ ఫైనల్ మ్యాచ్ మే 29వ తేదీన నిర్వహిస్తారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Couple on a bike: నడి రోడ్డుపై బైకుపై రెచ్చిపోయిన ప్రేమ జంట (video)

మొంథా తుఫాను సమయంలో రిలయన్స్ ఫౌండేషన్ చేసిన కృషికి ఏపీ సీఎం చంద్రబాబు ప్రశంసలు

శ్రీకాకుళంలో తొక్కిసలాట- మృతులకు 15 లక్షల రూపాయల ఎక్స్‌గ్రేషియా : నారా లోకేష్ (video)

కాశీబుగ్గ తొక్కిసలాట.. అసలేం జరిగింది.. తొక్కిసలాటకు కారణం ఏంటి?

మొంథా తుఫాను ప్రభావం తగ్గకముందే.. ఏపీ, తెలంగాణకు భారీ వర్ష సూచన.. మళ్లీ?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sudheer: సుడిగాలి సుధీర్, దివ్యభారతి జంటగా G.O.A.T షూటింగ్ పూర్తి

ఆకాష్ జగన్నాథ్ ఆవిష్కరించిన వసుదేవసుతం టైటిల్ సాంగ్

Roshan: రోషన్ హీరోగా పీరియాడిక్ స్పోర్ట్స్ డ్రామాగా ఛాంపియన్

Janhvi Kapoor: రూటెడ్ మాస్ పాత్రలో అచ్చియమ్మ గా జాన్వీ కపూర్

The Girlfriend: ది గర్ల్ ఫ్రెండ్ ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అవుతుంది - ధీరజ్ మొగిలినేని, విద్య కొప్పినీడి

తర్వాతి కథనం
Show comments