Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐపీఎల్ 2022 - మళ్లీ ఓడిన ముంబై... బుమ్రా శ్రమ వృథా

Webdunia
మంగళవారం, 10 మే 2022 (07:23 IST)
ఐపీఎల్ 15వ సీజన్‌లో అత్యంత దారుణమైన ప్రదర్శన కనబరుస్తున్న జట్లలో ముంబై ఇండియన్స్ ఒకటి. ఈ సీజన్‌లో ఈ జట్టు ఆడిన అన్ని మ్యాచ్‌‍లలో దారుణంగా ఓడిపోయింది. సోమవారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో కూడా ఆ జట్టు చిత్తుగా ఓడిపోయింది. కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు తన ముందు ఉంచిన స్వల్ప విజయలక్ష్యాన్ని కూడా ఛేదించలేక చతికిలపడింది. ఫలితంగా ఆ జట్టు ఆల్‌రౌండర్ బుమ్రా శ్రమ వృథా అయింది. 166 పరుగుల ఓ మోస్తారు లక్ష్యాన్ని ఛేదించలేక కేవలం 113 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో 52 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఈ ఓటమితో ముంబై ఇండియన్స్ పరాజయాల సంఖ్య 9కి చేరింది. 
 
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన కోల్‌కతా జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 165 పరుగులు చేసింది. వెంకటేష్ అయ్యర్ (43), నితీశ్ రాణా (43) రాణించడంతో తొమ్మిది వికెట్ల నష్టానికి ఆ మాత్రం పరుగులు చేయగలిగింది. ఈ జట్టులో ఏడుగురు ఆటగాళ్లు సింగిలి డిజిట్‌కే ఔట్ ఖాగా, మరో నలుగురు ఆటగాళ్ళు డకౌట్ అయ్యారు. 
 
నిజానికి ఆరంభంలో భారీ స్కోరు చేస్తున్నట్టు కోల్‌కతా జట్టు కనిపించింది. కానీ, ముంబై ఇండియన్స్ జట్టు బౌలర్ బుమ్రా కట్టడి చేశారు. 4 ఓవర్లు వేసి పది పరుగులు ఇచ్చి ఐదు వికెట్లు తీశాడు. దీంతో కోల్‌కతా ఇన్నింగ్స్ పేకమేడలా కుప్పకూలిపోయింది. తాను వేసిన 18వ ఓవర్‌లో రసెల్ (9), నితీశ్ రాణా (43), జాక్సన్ (5), కమిన్స్ (0), నరైన్ (0) వికెట్లు పడగొట్టాడు. దీంతో కోల్‌కతా జట్టు 165 పరుగులకే పరిమితమైంది. 
 
ఆ తర్వాత 166 పరుగుల తేడాతో బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్ జట్టు 17.3 ఓవర్లలో 113 పరుగులకే కుప్పకూలింది. రోహిత్ శర్మ (2) మరోమారు విఫలం కాగా, కీరన్ పొలార్డ్ 15, ఇషాన్ కిషన్ 51 చొప్పున పరుగులు చేశారు. వీరిద్దరు చేసిన పరుగులే అత్యధికం కావడం గమనార్హం. 
 
అద్భుతమైన బౌలింగ్ చేసిన బుమ్రాకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. ఈ ఓటమితో ముంబై ఇండియన్స్ జట్టు ఓటముల సంఖ్య 9కి చేరింది. అలాగే, ఈ విజయంతో విజయాల సంఖ్యను వెంచుకున్న కోల్‌కతా జట్టు ప్లే ఆఫ్స్ అవకాశాలు మిణుకుమిణుకు మంటున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Covid Panic: బెంగళూరులో పెరుగుతున్న కోవిడ్-19 కేసులు- మార్గదర్శకాలను పాటించాల్సిందే

COVID: హైదరాబాద్‌లో కోవిడ్-19 కేసు- డాక్టర్‌కు కరోనా.. ఇప్పుడెలా వున్నారంటే?

కేసీఆర్ చుట్టూత కొన్ని దెయ్యాలు ఉన్నాయ్ : ఎమ్మెల్సీ కవిత

Kavitha: తెలంగాణలో మరో షర్మిలగా మారనున్న కల్వకుంట్ల కవిత? (video)

43 సంవత్సరాల జైలు శిక్ష-104 ఏళ్ల వృద్ధుడు- చివరికి నిర్దోషిగా విడుదల.. ఎక్కడ?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అడివి శేష్, మృణాల్ ఠాకూర్ చిత్రం డకాయిట్ - ఏక్ ప్రేమ్ కథ

RGV: సెన్సార్ బోర్డు కాలం చెల్లిపోయింది.. అసభ్యత వుండకూడదా? రామ్ గోపాల్ వర్మ

మనమంతా కలిసి తెలుగు సినిమాను కాపాడుకోవాలి - నిర్మాత ఎస్ కేఎన్

ఫోక్ యాంథమ్ తో ఆకట్టుకున్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అదితి శంకర్

తమ్మారెడ్డి భరద్వాజ ఆవిష్కరించిన థాంక్యూ డియర్ లుక్

తర్వాతి కథనం
Show comments