సరికొత్త రికార్డును నెలకొల్పిన డ్వేన్ బ్రావో

Webdunia
శుక్రవారం, 1 ఏప్రియల్ 2022 (09:50 IST)
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 15వ సీజన్ పోటీలు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ పోటీల్లో వివిధ దేశాలకు చెందిన క్రికెటర్లు తమ సత్తా మేరకు రాణిస్తున్నారు. ఇలాంటి వారిలో వెస్టిండీస్ క్రికెటర్ డ్వేన్ బ్రావో సరికొత్త రికార్డును నెలకొల్పారు. ఐపీఎల్‌లో అత్యధిక వికెట్లు సాధించిన క్రికెటర్‌గా రికార్డు సృష్టించాడు. ఇప్పటివరకు ఈ రికార్డు శ్రీలంక క్రికెటర్ లసిత్ మలింగా పేరుతో ఉండేది. దీన్ని ఇపుడు ఆయన తన పేరుమీద లిఖించుకున్నాడు. 
 
ప్రస్తుంత చెన్నై సూపర్ కింగ్స్ జట్టు తరపున ప్రాతినిథ్యం వహిస్తున్న బ్రావో ఐపీఎల్‌లో 171 వికెట్లు తీశాడు. లసిత్ మలింగా మొత్తం 122 మ్యాచ్‌లలో 170 వికెట్లు పడగొట్టగా డ్వేన్ బ్రావో మాత్రం 153 మ్యాచ్‌లలో 171 వికెట్లు సాధించాడు. ఆ తర్వాతి స్థానాల్లో అమిత్ మిశ్రా 154 మ్యాచ్‌లలో 166 వికెట్లు, పియూష్ చావ్లా 165 మ్యాచ్‌లలో 157 వికెట్లు, హర్భజన్ సింగ్ 160 మ్యాచ్‌లలో 150 వికెట్లు చొప్పున పడగొట్టారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వామ్మో... యువతి ప్యాంటు జేబులో పేలిన ఫోను, మంటలు (video)

తొక్కిసలాటపై విజయ్, అజిత్, ధనుష్ బాధపడుతున్నారు: నటి అంబిక

తిరుమలలో 3 గంటల పాటు భారీ వర్షం.. ఇబ్బందులకు గురైన భక్తులు

Jagan Anakapalle Tour: జగన్ రోడ్ టూర్‌కు అనుమతి నిరాకరణ

ప్రియురాలితో రాత్రంతా గడిపి హత్య చేసి ఇంట్లోనే సమాధి చేసిన కర్కోటకుడు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Baahubali 3: బాహుబలి-3 రాబోతోందా? రాజమౌళి ప్లాన్ ఏంటి?

హీరో విజయ్ ఓ జోకర్... శృతిహాసన్

రాజీవ్ క‌న‌కాల‌, ఉద‌య భాను జంటగా డాట‌రాఫ్ ప్ర‌సాద్ రావు: క‌న‌ప‌డుట లేదు

Silambarasan TR : సిలంబరసన్ TR, వెట్రిమారన్ కాంబినేషన్ లో అరసన్

Sidhu: నితిన్ కు కథ చెబితే సిద్దు జొన్నలగడ్డ కి బాగుంటుందన్నారు : నీరజా కోన

తర్వాతి కథనం
Show comments