Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కేన్ అవుట్.., థర్డ్ అంపైర్ నిర్ణయం వివాదాస్పదం..

కేన్ అవుట్.., థర్డ్ అంపైర్ నిర్ణయం వివాదాస్పదం..
, బుధవారం, 30 మార్చి 2022 (15:25 IST)
Kane Williamson
ఐపీఎల్ 2022 సీజన్‌లో భాగంగా రాజస్థాన్ రాయల్స్‌‌తో జరిగిన సన్‌రైజర్స్ హైదరాబాద్ లీగ్ మ్యాచ్‌లో థర్డ్ అంపైర్ ఇచ్చిన ఓ నిర్ణయం వివాదాస్పదమైంది. సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ క్యాచ్ విషయంలో థర్డ్ అంపైర్ ఘోర తప్పిదం చేశాడనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. 
 
211 పరుగుల భారీ లక్ష్య చేధనలో ఓపెనర్‌గా బరిలోకి దిగిన కేన్ విలియమ్సన్(2) క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు. ప్రసిధ్ కృష్ణ వేసిన రెండో ఓవర్ నాలుగో బంతి కేన్ మామను పెవిలియన్ చేర్చింది. ఈ బంతి బ్యాట్ ఎడ్జ్ తీసుకోని కీపర్ వైపు దూసుకెళ్లగా.. సంజూ శాంసన్ సూపర్ డైవ్‌తో అందుకునే ప్రయత్నం చేశాడు.
 
అయితే బంతిని శాంసన్ సరిగ్గా అంచనా వేయకపోవడంతో గ్లోవ్స్‌కు తగిలి ఫస్ట్ స్లిప్‌లో ఉన్న దేవదత్ పడిక్కల్ వైపు వెళ్లింది. దాంతో అలర్ట్ అయిన పడిక్కల్ సూపర్ డైవ్‌తో బంతిని అందుకున్నాడు. అయితే బంతిని అందుకునే క్రమంలో అది నేలకు తాకినట్లు అనిపించింది. 
 
దాంతో ఫీల్డ్ అంపైర్.. థర్డ్ అంపైర్ సమీక్షను కోరాడు. రిప్లేలో సైతం బంతి నేలకు తాకినట్లు కనిపించింది. థర్డ్ అంపైర్ మాత్రం ఔట్‌గా ప్రకటించాడు.  
 
ఇక థర్డ్ అంపైర్ నిర్ణయాన్ని అభిమానులు తప్పుబడుతున్నారు. బంతి నేలకు తాకినట్లు అంత స్పష్టంగా కనబడుతుంటే ఔట్ ఎలా ఇస్తారని ప్రశ్నిస్తున్నారు. అంపైర్‌ది అత్యంత చెత్త నిర్ణయమని, రిప్లేను మరోసారి పరిశీలించకుండానే ఔటిచ్చాడని అసహనం వ్యక్తం చేస్తున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మిస్ యు లిల్ టూ! మై ఎవ్రీథింగ్: కూలో సాహా భావోద్వేగ పోస్ట్‌