Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్ట్రెచర్‌పై డ్రెస్సింగ్ రూమ్‌కు.. ఆసియా కప్‌కు దూరమైన హార్దిక్ పాండ్యా

భారత్ క్రికెట్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా ఆసియా కప్ టోర్నీకి దూరమయ్యాడు. గాయం కారణంగా జట్టు నుంచి పాండ్యా తప్పుకోవాల్సి వచ్చింది. పాకిస్థాన్‌తో బుధవారం జరిగిన మ్యాచ్‌లో భారత ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్

Webdunia
గురువారం, 20 సెప్టెంబరు 2018 (14:22 IST)
భారత్ క్రికెట్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా ఆసియా కప్ టోర్నీకి దూరమయ్యాడు. గాయం కారణంగా జట్టు నుంచి పాండ్యా తప్పుకోవాల్సి వచ్చింది. పాకిస్థాన్‌తో బుధవారం జరిగిన మ్యాచ్‌లో భారత ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా గాయపడిన సంగతి తెలిసిందే. పాకిస్థాన్ ఇన్నింగ్స్‌లో 18వ ఓవర్‌ను పాండ్యా వేశాడు. అయితే ఆ ఓవర్ ఐదో బంతి వేసిన తర్వాత పాండ్య మైదానంలో కుప్పకూలిపోయాడు. 
 
ఆరంభంలోనే బాగానే కనిపించిన పాండ్యా నొప్పితో ఒక్కసారిగా కిందపడిపోయాడు. దీంతో భారత ఆటగాళ్లతో పాటు పాకిస్థాన్ బ్యాట్స్‌మెన్ కూడా పాండ్య వద్దకు చేరుకున్నారు. వెన్ను కింద భాగంలో కలిగిన నొప్పితో పాండ్య విలవిల్లాడి పోయాడు. అప్పటికే గాయంతో కదలలేని స్థితిలో ఉన్న పాండ్యను స్ట్రెచర్‌పై డ్రెస్సింగ్ రూమ్‌కు తీసుకెళ్లారు. ప్రస్తుతం పాండ్యా స్థానంలో భారత జట్టుకు దీపక్ చాహర్‌ను ఎంపిక చేశారు. ప్రాథమిక చికిత్స కారణంగా అతడు లేచి నిలుచోసాగాడని.. ప్రస్తుతం చికిత్స పొందుతున్నట్లు బీసీసీఐ తెలిపింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

తెలుగు తల్లి ఫ్లైఓవర్‌ పేరు తెలంగాణ తల్లి ఫ్లైఓవర్‌గా మారింది

ఓటు చోరీపై రాహుల్ ఆరోపణలు... ఈసీ కఠినమైన నియమాలు.. ఏంటవి?

Buddhist monks: కేబుల్‌తో నడిచే రైలు బోల్తా పడింది.. ఏడుగులు బౌద్ధ సన్యాసులు మృతి

Man: ఢిల్లీ పట్టపగలే బంగారం దోపిడీ.. కోటి రూపాయలు గోవిందా

Woman: బతుకమ్మ ఆడుతూ గుండెపోటుతో మహిళ మృతి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

OG Review: పవన్ కళ్యాణ్ ఓజీ.. ఒరిజినల్ గ్యాంగ్ స్టర్.. ఓజీ ఒరిజినల్ రివ్యూ

11 నెలల పాటు ఈఎంఐ కట్టలేదు.. వేలానికి రవి మోహన్ ఇల్లు.. నోటీసులు అంటించేశారు..

గుజరాత్ బ్రాండ్ కాన్‌ప్లెక్స్ సినిమాస్ ప్రారంభించిన స్పీకర్, సిద్దు జొన్నలగడ్డ

Pawan: డల్లాస్ లో ఓజీ 25 అడుగుల కటౌట్ - నైజాంలో పుష్ప 2: ది రూల్ ను క్రాస్ చేస్తుందా....

హారర్ కాన్సెప్ట్‌లో ప్రేమ కథ గా ఓ.. చెలియా టీజర్ ను ఆవిష్కరించిన శ్రీకాంత్

తర్వాతి కథనం
Show comments