Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇండోర్ టెస్ట్ మ్యాచ్ : 109 పరుగులకే కుప్పకూలిన భారత్

Webdunia
బుధవారం, 1 మార్చి 2023 (15:21 IST)
బోర్డర్ - గవాస్కర్ టెస్ట్ సిరీస్‌లో భాగంగా పర్యాటక ఆస్ట్రేలియా జట్టుతో భారత బుధవారం ఇండోర్ వేదికగా మూడో టెస్ట్ మ్యాచ్ ఆడుతుంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేపట్టిన భారత్ పీకల్లోతు కష్టాల్లో చిక్కుకుంది. ఆస్ట్రేలియా బౌలర్ల ధాటికి ఆపసోపాలు పడి చివరకు తన తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 109 పరుగులు మాత్రమే చేసింది. ఆస్ట్రేలియా స్పిన్నర్లు కునెమన్, లైయన్‌లు విసిరే బంతులను ఎదుర్కోలేక భారత బ్యాటర్లు తడబడ్డారు. దీంతో 33.2 ఓవర్లలో 109 పరుగులు మాత్రమే చేసి ఆలౌట్ అయింది. 
 
కాగా, భోజన విరామం సమయానికే 84 పరుగులకు ఏడు వికెట్లు కోల్పోయిన భారత్.. మిగిలిన మూడు వికెట్లను ఏడున్నర ఓవర్లలో కోల్పోయింది. ఇందులో విరాట్ కోహ్లీ (22), గిల్ (21), శ్రీకర్ భరత్ (17), ఉమేశ్ యాదవ్ (17), అక్షర పటేల్ (12 నాటౌట్), కెప్టెన్ రోహిత్ శర్మ (12) చొప్పున రెండంకెల స్కోరు చేశారు. పుజారా ఒక్క పరుగు, రవీంద్ర జడేజా నాలుగు, శ్రేయస్ అయ్యర్ సున్నా, అశ్విన్ మూడు చొప్పున పరుగులు చేశారు. 
 
అయితే మ్యాచ్ ఆఖరులో ఉమేష్ యాదవ్ రెండు సిక్సర్లు బాదడంతో భారత్ వంద పరుగులైనా దాటగలిగింది. లేకుంటే వంద పరుగులు లేపే చాప చుట్టేసిది. ఆసీస్ బౌలర్లలో మాథ్యూ కునెమన్‌ ఏకంగా ఐదు వికెట్లు తీయగా, లైయ్ మూడు వికెట్లు పడగొట్టాడు. టాడ్ మర్ఫీకి ఓ వికెట్ దక్కింది. కాగా ఇప్పటివరకు ఆడిన రెండు మ్యాచ్‌లలో భారత్ నెగ్గి నాలుగు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్‌లో 2-0 ఆధిక్యంతో ఉన్న విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

ఈవీఎంలో పాము దూరిందట.. అందుకే దాన్ని పిన్నెల్లి పగులకొట్టారట!

అదే ముద్రగడ పద్మనాభం పరువు తీసేలా వుంది, ఫోన్ చేస్తే వైసిపి నాయకులు లిఫ్ట్ చేయడంలేదట?!!

పిన్నెలి రామకృష్ణారెడ్డి పాత పోస్ట్ వైరల్.. పేలుతున్న జోకులు

మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్ట్

నాకు తెలిసి జగన్ అసెంబ్లీలో అడుగు పెట్టరు: ఆర్ఆర్ఆర్

బుజ్జి తోపాటుఫ్యూచరిస్టిక్ వెహికల్స్ కు 25 మందికిపైగా పనిచేసిన ఇంజనీర్లు

కల్కి 2898 AD గ్రాండ్ గాలా.. బుజ్జి పాత్రకు కీర్తి సురేష్ వాయిస్ ఓవర్

డీ-హైడ్రేషన్‌తో ఆస్పత్రిలో చేరిన షారూఖ్ ఖాన్..

Rave Party: నేనో ఆడపిల్లను, బర్త్ డే పార్టీ అంటే వెళ్లా, నాకేం తెలియదు: నటి ఆషీరాయ్

హారర్, యాక్షన్, సస్పెన్స్, థ్రిల్లర్ గా అదా శర్మ C.D సెన్సార్ పూర్తి

తర్వాతి కథనం
Show comments