Webdunia - Bharat's app for daily news and videos

Install App

టీమిండియా వర్సెస్ వెస్టిండీస్ 2వ టెస్ట్ హైలైట్స్: కోహ్లీ సెంచరీ చేస్తాడా?

Webdunia
గురువారం, 27 జులై 2023 (10:30 IST)
టీమిండియా-వెస్టిండీస్‌ల మధ్య జరుగుతున్న రెండో టెస్టులో మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ మెరిశాడు. జూలై 20 గురువారం ట్రినిడాడ్‌లోని పోర్ట్ ఆఫ్ స్పెయిన్‌లోని క్వీన్స్ పార్క్ ఓవల్‌లో ప్రారంభమైంది. భారత్ భారీ స్కోరు దిశగా పయనిస్తోంది. రెండో టెస్టు తొలిరోజు ఆట ముగిసే సమయానికి మంచి స్కోరు సాధించింది.
 
టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టుకు శుభారంభం లభించింది. రోహిత్ శర్మ 143 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 80 పరుగులు చేసి జోమెల్ వారికాన్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. రెండో నంబర్‌లో క్రీజులోకి వచ్చిన సుభమన్ గిల్ 10 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. 
 
విరాట్ కోహ్లీ 161 ​​బంతుల్లో 8 ఫోర్లు కొట్టి 87 పరుగులు చేశాడు. జడేజా 84 బంతుల్లో 4 ఫోర్లతో 36 పరుగులు చేశాడు. రోహిత్ శర్మ 143 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్సర్లతో 80 పరుగులు చేశాడు. యశస్వి జైస్వాల్ 74 బంతుల్లో 57 పరుగులు, శుభ్‌మన్ గిల్ 10 పరుగులు, అజింక్య రహానే 8 పరుగులు చేసి పెవిలియన్ చేరుకున్నారు. 
 
రోహిత్, యశస్వి శుభారంభం ఇవ్వడంతో భారత్ భారీ స్కోరు దిశగా పయనిస్తోంది. విరాట్ కోహ్లికి ఇది 500వ మ్యాచ్ కావడంతో అతను సెంచరీ చేస్తాడా లేదా అనే ఉత్కంఠ అందరిలో నెలకొంది. తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా నాలుగు వికెట్ల నష్టానికి 288 పరుగులు చేసింది. 
 
వెస్టిండీస్ బౌలర్లలో కీమర్ రోచ్, గాబ్రియెల్, వారికన్, జాసన్ హోల్టర్ తలో వికెట్ తీశారు. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా. ఓపెనర్లు రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్ శుభారంభం ఇచ్చారు. జైస్వాల్ నిలకడగా బౌండరీలు బాది స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. 
 
రోహిత్ కాస్త జాగ్రత్తగా ఆడినా.. జైస్వాల్ మొదటి నుంచి దూకుడు ప్రదర్శించాడు. విరాట్ కోహ్లీ సెంచరీకి చేరువలో ఉన్నాడు. ఈ మ్యాచ్‌లో సెంచరీ సాధించాలని బలంగా కోరుకుంటున్నాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఇండోర్‌ అప్నా దళ్ సమావేశంలో రాజకీయ వ్యూహకర్త డాక్టర్ అతుల్ మాలిక్‌రామ్

తెలుగు రాష్ట్రాల్లో అకాల వర్షాలు: వేడి నుంచి ఉపశమనం.. కానీ రైతుల పంటలు.. ఎల్లో అలెర్ట్

కంచ భూముల వివాదం ... విద్యార్థులపై కేసులు ఎత్తివేతకు ఆదేశం

ఐసీయూలో అలేఖ్య చిట్టి, మీకు దణ్ణం పెడతా, ట్రోల్స్ ఆపండి (Video)

ఈ నెల 12-13 తేదీల మధ్య ఆంధ్రప్రదేశ్ ఇంటర్ పరీక్షల ఫలితాలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Prabhas: రాజా సాబ్ అందుకే ఆలస్యమవుతోందని తేల్చి చెప్పిన డైరెక్టర్ మారుతి

Tamannaah: గాడ్ వర్సెస్ ఈవిల్ ఫైట్ మరో స్థాయిలో ఓదెల 2 వుంటుంది : తమన్నా భాటియా

Pawan Kalyan: సింగపూర్ బయల్దేరిన చిరంజీవి, సురేఖ, పవన్ కళ్యాణ్

Modi: మార్క్ శంకర్ కోలుకుంటున్నాడు - మోదీ, చంద్రబాబుకు ధన్యవాదాలు : పవన్ కళ్యాణ్ (video)

NTR: ఎన్.టి.ఆర్., ప్రశాంత్ నీల్ చిత్రం డ్రాగన్ అప్ డేట్

తర్వాతి కథనం
Show comments