Webdunia - Bharat's app for daily news and videos

Install App

చేతులెత్తేసిన భారత బౌలర్లు .. సిమ్మన్స్ వీరవిహారం.. విండీస్ విజయం

Webdunia
సోమవారం, 9 డిశెంబరు 2019 (09:51 IST)
తిరువనంతపురం వేదికగా జరిగిన రెండో ట్వంటీ20 మ్యాచ్‌లో భారత్ చిత్తుగా ఓడిపోయింది. ఈ మ్యాచ్‌లో వెస్టిండీస్ ఆటగాడు లెండల్ సిమ్మన్స్ బ్యాట్‌తో వీరవిహారం చేయడంతో మరో 9 బంతులు మిగిలివుండగానే, 8 వికెట్ల తేడాతో విజయభేరీ మోగించింది. దీంతో మూడు మ్యాచ్‌ల టీ 20 సిరీస్‌ 1-1 తో సమమైంది. 
 
తొలుత ఈ మ్యాచ్‌లో భారత జట్టు బ్యాటింగ్ చేసింది. యువ ఆటగాడు శివమ్‌ దూబే అర్థ సెంచరీ(54), రిషభ్‌ పంత్‌ 33 పరుగులతో ఆకట్టుకొని, భారత్‌కు గౌరవ ప్రదమైన స్కోరును సాధించిపెట్టగా, మిగితా బాట్స్‌మెన్‌ ఘోరంగా విఫలమయ్యారు. ఫలితంగా 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 170 పరుగులు మాత్రమే చేసింది. భారత ఆటగాళ్లలో రోహిత్ 15, రాహుల్ 11, దూబే 54, కోహ్లీ 19, పంత్ 33 (నాటౌట్), శ్రేయాస్ 10, జడేజా 9, సుందర్ 0, చాహర్ 1 చొప్పున పరుగులు చేశారు. 
 
ఆ తర్వాత 171 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన వెస్టిండీస్ జట్టు మరో 9 బంతులు మిగిలివుండగానే, 8 వికెట్ల తేడాతో విజయభేరీ మోగించింది. ఆ జట్టులో సమ్మన్ 67 (నాటౌట్), లూయిస్ 40, హెట్‌మయెర్ 23, పూరన్ 38 (నాటౌట్) చొప్పున పరుగులు చేశారు. 
 
ఫలితంగా 18.3 ఓవర్లలో 173 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌లో బౌలర్లు పూర్తిగా విఫలమయ్యారు. కాగా, సిరీస్ ఫలితాలన్ని తేల్చే మూడో వన్డే మ్యాచ్ ఈ నెల 11వ తేదీన ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరుగనుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఈవీఎం బ్యాలెట్ పత్రాల్లో అభ్యర్థుల కలర్ ఫోటోలు : ఎన్నికల కమిషన్

పార్టీ బలోపేతంపై దృష్టిసారించండి... ఎమ్మెల్యేలకు జనసేనాని ఆర్డర్

మందలించిన తల్లి.. కత్తితో గొంతుకోసి చంపేసిన కిరాతక బీటెక్ కొడుకు

తమిళనాడుకు వర్ష సూచన - 12 జిల్లాల్లో కుండపోత వర్షం

పెళ్లి పేరుతో నమ్మంచి వాడుకుని వదిలేశాడు.. భరించలేక ప్రాణాలు తీసుకున్న యువతి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నా కుమార్తెలో లెజెండరీ నటి ఆత్మ ప్రవేశించిందేమో? రవీనా టాండన్

దిగ్గజ దర్శకుడు శాంతారామ్ సతీమణి సంధ్య ఇకలేరు

30 యేళ్లుగా ఇనుప రాడ్లు కాలులో ఉన్నాయి... బాబీ డియోల్

Chiranjeevi: చెన్నైవెళుతున్న చిరంజీవి, వెంకటేష్

Vennela Kishore: వెన్నెల కిషోర్ పాడిన అనుకుందొకటిలే.. లిరికల్ సాంగ్

తర్వాతి కథనం
Show comments