Webdunia - Bharat's app for daily news and videos

Install App

1000వ వన్డేలో భారత్ ఘన విజయం - విండీస్ చిత్తు

Webdunia
ఆదివారం, 6 ఫిబ్రవరి 2022 (19:57 IST)
అహ్మదాబాద్ వేదికగా భారత్ ఆడిన 1000వ వన్డే మ్యాచ్‌లో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో ప్రత్యర్థి వెస్టిండీస్ జట్టును టీమిండియా చిత్తుగా ఓడించింది. ఫలితంగా ఆరు వికెట్ల తేడాతో భారత్ గెలిచి మూడు వన్డేల సిరీస్‌లో 1-0 ఆధిక్యాన్ని కూడబెట్టుకుంది. ఇది భారత్ ఆడిన 1000వ అంతర్జాతీయ వన్డే మ్యాచ్ కావడం గమనార్హం. 
 
తొలుత ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్‌ చేసిన విండీస్ 43.5 ఓవర్లలో కేవలం 176 పరుగులకే ఆలౌట్ అయింది. భారత స్పిన్నర్లు చహల్ (4/49), సుందర్ (3/30)లు అద్భుతమైన బౌలింగ్‌తో కరేబియన్ ఆటగాళ్లను ముప్పతిప్పలు పెట్టారు. 
 
అయితే, ఆల్‌రౌండర్ జాసన్ హోల్డర్ బాధ్యతాయుతంగా ఆడి అర్థ సెంచరీ నమోదు చేశారు. హోల్డర్ 71 బంతుల్లో 57 పరుగులు చేయగా, లోయర్ ఆర్డర్ ఆటగాళ్లు అలెన్ (29) సహకారంతో కివీస్ 150 పరుగుల స్కోరును దాటింది. 
 
ఆ తర్వాత 177 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన భారత్... 132 బంతులు, 6 వికెట్లు మిగిలివుండగానే విజయం సాధించింది. భారత ఆటగాళ్లలో రోహిత్ శర్మ (60), ఇషాన్ కిషన్ (28), విరాట్ కోహ్లీ (8), రిషబ్ పంత్ (11), సూర్యకుమార్ 34 (నాటౌట్), దీపక్ హూడా 26 (నాటౌట్) చొప్పున పరుగులు చేశారు. అదనంగా మరో 11 పరుగులు వచ్చాయి. దీంతో నాలుగు వికెట్ల నష్టానికి 28 ఓవర్లలో 178 పరుగులు చేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వన్ నేషన్-వన్ ఎలక్షన్: దేశమంతా ఒకేసారి ఎన్నికలు నిర్వహిస్తే ఎంత ఖర్చవుతుందో తెలుసా

కేటీఆర్‌ను కలవలేదు.. కనీసం ఫేస్ టు ఫేస్ చూడలేదు.. దువ్వాడ మాధురి (video)

Chain Snatching in Guntur: ఆంజనేయ స్వామి గుడి సెంటర్‌ వద్ద మహిళ మెడలో..? (video)

సంధ్య థియేటర్‌ లైసెన్స్‌ను ఎందుకు రద్దు చేయకూడదు : సీవీ ఆనంద్

కుప్పంలో పర్యటించనున్న నారా భువనేశ్వరి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో సింగర్ అవసరమే లేదు : సింగర్ రమణ గోగుల

అల్లు అర్జున్ సేఫ్‌గా బయటపడేందుకు చిరంజీవి మాస్టర్ స్కెచ్ ?

జనవరి 1 న విడుదల కానున్న క్రావెన్: ది హంటర్

బచ్చల మల్లి పదేళ్ళ పాటు గుర్తుండిపోయే సినిమా : అల్లరి నరేష్

మనోజ్ ఫిర్యాదులో నిజం లేదు .. మంచు విష్ణు గొడవ చేయలేదు : తల్లి నిర్మల

తర్వాతి కథనం
Show comments