Webdunia - Bharat's app for daily news and videos

Install App

ధర్మశాల వన్డే : శ్రీలంక ఘన విజయం

ధర్మశాల వేదికగా ఆదివారం జరిగిన డే అండ్ నైట్ మ్యాచ్‌లో శ్రీలంక ఘనవిజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో భారత ఆటగాళ్లు పేలవప్రదర్శన కారణంగా కేవలం 112 పరుగులకే ఆలౌట్ అయింది.

Webdunia
ఆదివారం, 10 డిశెంబరు 2017 (17:28 IST)
ధర్మశాల వేదికగా ఆదివారం జరిగిన డే అండ్ నైట్ మ్యాచ్‌లో శ్రీలంక ఘనవిజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో భారత ఆటగాళ్లు పేలవప్రదర్శన కారణంగా కేవలం 112 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో 113 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన లంక జట్టు ఏడు వికెట్ల తేడాతో గెలిచింది. 20.4 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయిన శ్రీలంక జట్టు 114 పరుగులు చేసి ఘన విజయం సాధించింది. 
 
కాగా, ధర్మశాల వేదికగా జరిగిన తొలి వన్డేలో టాస్ గెలిచిన శ్రీలంక జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత జట్టు అత్యంత ఘోరంగా విఫలమైంది. 27 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేసింది. వికెట్ కీపర్ ధోనీ మరోమారు ఆపద్బాంధువుడి పాత్రను పోషించారు. 
 
ఫలితంగా 38.2 ఓవర్లలో అన్ని వికెట్లు కోల్పోయిన భారతజట్టు 112 పరుగులు చేసింది. భారత ఇన్నింగ్స్‌లో రోహిత్ శర్మ (2), ధావన్ (0), ఎస్ఎస్ అయ్యర్ (9), కార్తీక్ (0), ఎంకే పాండే(2), పాండ్యా (10), భువనేశ్వర్ కుమార్ (0), కులదీప్ యాదవ్ (19), ధోనీ (65), బుమ్రా (0), ఒక్క పరుగు కూడా చేయని చాహల్ నాటౌట్‌గా నిలిచాడు.
 
స్వల్ప విజయలక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక జట్టు ఆ లక్ష్యాన్ని సునాయాసంగా ఛేదించి తొలి వన్డేలో ఘన విజయం సాధించింది. 20.4 ఓవర్లలో శ్రీలంక జట్టు మూడు వికెట్ల నష్టానికి 114 పరుగులు చేసింది. గుణతిలకా (1), తరంగ (49), తిరుమనే (0), మ్యాథ్యూస్ 25, డిక్ వెలా 26 పరుగులతో నాటౌట్‌గా నిలిచారు. దీంతో మూడు వన్డే మ్యాచ్‌ల సిరీస్‌లో లంక 1-0 ఆధిక్యాన్ని కూడబెట్టుకుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అదానీ ఇచ్చిన రూ. 100 కోట్లు విరాళం నిరాకరిస్తున్నాం: సీఎం రేవంత్ రెడ్డి

ఆక్సిజన్ కొరత.. కవలపిల్లలు అంబులెన్స్‌లోనే చనిపోయారా?

అల్పపీడనం: నవంబర్ 26 నుంచి 29 వరకు ఏపీలో భారీ వర్షాలు (video)

జ్వరంతో విద్యార్థిని మృతి.. టీచర్లపై కేసు నమోదు.. ఎందుకని?

జైలుకు వెళ్లినలారంతా సీఎం అయ్యారనీ.. ఆ లెక్కన కేటీఆర్‌కు ఆ ఛాన్స్ రాదు : సీఎం రేవంత్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విజయ్ దేవరకొండ రౌడీ వేర్ బ్రాండ్ కు ఔట్ లుక్ ఇండియా బిజినెస్ అవార్డ్

వికటకవి చూసి గర్వంగా అనిపించింది.. నిర్మాత రామ్ తాళ్లూరి

రామ్ పోతినేని సినిమాకు తమిళ సంగీత ద్వయం వివేక్ - మెర్విన్

ఉజ్జయిని మహాకాళేశ్వర్ టెంపుల్ సాక్షిగా కన్నప్ప రిలీజ్ డేట్ ప్రకటన

వెన్నెల కిషోర్ నటించిన శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ రిలీజ్ డేట్ ఫిక్స్

తర్వాతి కథనం
Show comments