Webdunia - Bharat's app for daily news and videos

Install App

ధోనీకి షాక్.. సెలక్షన్‌కు అందుబాటులో లేడు.. అందుకే పక్కనబెట్టేశారట..

Webdunia
శనివారం, 31 ఆగస్టు 2019 (15:23 IST)
టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి చుక్కెదురైంది. ప్రపంచ కప్ సెమీఫైనల్‌లో జట్టును గెలిపించలేకపోవడంతో ధోనీపై సెలక్టర్లు కన్నేయట్లేదు. ఇందులో భాగంగా ఆర్మీతో వుండిన ధోనీ.. దక్షిణాఫ్రికాతో జరిగే మూడు టీ-20 సిరీస్‌లో ఆడుతాడని అందరూ అనుకున్నారు

. అయితే  సొంతగడ్డపై వచ్చే నెలలో దక్షిణాఫ్రికాతో జరిగే మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు బీసీసీఐ గురువారం 15 మందితో కూడిన భారత జట్టును ప్రకటించింది. ఈ 15 మందిలో మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్‌ ధోనీకి చోటు దక్కలేదు. 
 
ధోనీని జట్టులోకి ఎందుకు తీసుకోలేదని ఎమ్మెస్కే ప్రశ్నించగా.. 'ధోనీ సెలక్షన్‌కు అందుబాటులో లేడు' అని సమాధానం ఇచ్చాడు. మరోవైపు 'ప్రస్తుతం ధోనీ అమెరికాలో ఉన్నాడు. తనకు తానుగా సెలక్షన్‌కు అందుబాటులో లేడు' అని ధోనీ సన్నిహితుడు ఒకరు స్పష్టం చేశారు. దీంతో.. ధోనీ ప్రస్తుతం అమెరికాలో ఉన్న కారణంగానే సెలక్టర్లు ఆయన్ని జట్టులోకి తీసుకోలేకపోయారని టాక్ వస్తోంది. కాగా వచ్చే ఏడాది జరిగే టీ20 ప్రపంచకప్‌లో ధోనీ స్థానం దక్కించుకోవాలంటే మాత్రం ఫామ్‌, ఫిట్‌నెస్‌ను నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది.
 
ప్రపంచకప్‌ అనంతరం విశ్రాంతి తీసుకుంటున్న స్టార్ ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా మళ్లీ జట్టులో చోటు దక్కించుకున్నాడు. వరుసగా మ్యాచ్‌లు ఆడుతున్న పేసర్‌ భువనేశ్వర్‌ కుమార్‌కు సెలెక్టర్లు విశ్రాంతినిచ్చారు. ఈ ఒక్క మార్పు మినహా విండీస్‌తో టీ20ల్లో తలపడిన జట్టునే సెలెక్టర్లు కొనసాగించారు. హార్దిక్‌ పాండ్యా, రవీంద్ర జడేజా, కృనాల్‌ పాండ్యా రూపంలో ప్రస్తుతం జట్టులో ముగ్గురు ఆల్‌రౌండర్‌లు ఉన్నారు.
 
జట్టు వివరాలు.. 
విరాట్ కోహ్లీ (కెప్టెన్‌), రోహిత్‌ శర్మ (వైస్‌ కెప్టెన్‌), శిఖర్‌ ధావన్‌, కేఎల్‌ రాహుల్‌, శ్రేయస్‌ అయ్యర్‌, మనీష్‌ పాండే, రిషభ్‌ పంత్‌ (వికెట్‌ కీపర్‌), హర్దిక్‌ పాండ్య, రవీంద్ర జడేజా, కృనాల్‌ పాండ్య, వాషింగ్టన్‌ సుందర్‌, రాహుల్‌ చాహర్‌, ఖలీల్‌ అహ్మద్‌, దీపక్ చాహర్‌, నవదీప్‌ సైనీ.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వివాహిత వద్దన్నా వదిలిపెట్టని ప్రియుడు, భార్యను చంపేసిన భర్త?

భర్త తాగుబోతు.. వడ్డీ వసూలు చేసేందుకు వచ్చిన వ్యక్తితో భార్య జంప్.. అడిగితే?

ఏపీ విభజన తర్వాత తెలంగాణ అప్పుల కుప్పగా మారింది

Pawan Kalyan: కుంభేశ్వరర్ ఆలయంలో పవన్ కల్యాణ్.. సెల్ఫీ ఫోటోలు వైరల్ (video)

లోక్‌సభలో కొత్త ఆదాయపన్ను బిల్లును ప్రవేశపెట్టిన కేంద్రం

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాక్షస టైటిల్ సాంగ్ లాంచ్, రిలీజ్ డేట్ ఫిక్స్

రామ్ మధ్వాని ది వేకింగ్ ఆఫ్ ఎ నేషన్ సోనీ లివ్‌లో స్ట్రీమింగ్

29 మిలియన్ వ్యూస్‌తో నెం.1 ప్లేస్‌లో విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ టీజర్

బుక్ మై షోలో తల మూవీ టికెట్ ను కొన్న నాగార్జున

పవన్ కళ్యాణ్ బాగా ఎంకరేజ్ చేస్తారు.. ఆయన నుంచి అది నేర్చుకోవాలి : నిధి అగర్వాల్

తర్వాతి కథనం
Show comments