Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

వ్యర్థాల వల్ల భూగర్బజలాలు కలుషితం.. సర్కారు ఆదేశాలు..

వ్యర్థాల వల్ల భూగర్బజలాలు కలుషితం.. సర్కారు ఆదేశాలు..
, శనివారం, 31 ఆగస్టు 2019 (15:11 IST)
అమరావతి: కడప జిల్లా వేముల మండలం తుమ్మలపల్లి యురేనియం కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌ వ్యర్థాల వల్ల భూగర్బజలాలు కలుషితం అవుతున్నాయన్న ఆరోపణలపై సమగ్ర తనిఖీ, అధ్యయానికి రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. 
 
ప్రభుత్వ నిపుణుల కమిటీని నియమించిన ఏపీ పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డు యురేనియం కార్పొరేషన్‌ వ్యర్థాలు నిల్వచేస్తున్న పాండ్, దాని చుట్టుపక్కల భూగర్భజలాలు కలుషితం అవుతున్నాయా? లేదా? అన్న విషయంపై అధ్యయనం చేయనుంది.

నిపుణుల కమిటీ నిపుణుల కమిటీలో సభ్యులుగా ఎన్‌జీఆర్‌ఐ, జియాలజీ, ఏపీ ప్రభుత్వ భూగర్భ జల విభాగం, అటామిక్‌ ఎనర్జీ రెగ్యులేటరీ బోర్డు,  ఏపీ మైన్స్‌ మరియు జియాలజీ విభాగం, రాష్ట్ర వ్యవసాయశాఖ, తిరుపతి ఐఐటీ నుంచి నిపుణులను పొల్యూషన్‌ కంట్రోల్‌బోర్డు నియమించనుంది. 
 
మూడురోజుల్లోగా నియామకాలు పూర్తిచేయనున్న పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డు 10 రోజుల్లోగా కమిటీ నివేదిక అందించనుంది. ప్రమాణాలను పాటించడంలేదని, టెయిల్‌ పాండ్‌ నిర్మాణంలో సరైన డిజైన్, ప్రణాళిక లేదంటూ జూన్‌ 21,2018న కడప ఎంపీ అవినాష్‌రెడ్డి, రిటైర్డ్‌ చీఫ్‌ సైంటిస్ట్‌ కె.బాబురావు పొల్యూషన్‌ కంట్రోల్‌బోర్డుకు ఫిర్యాదు చేశారు. 
 
ఆ తర్వాత యురేనియం కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌కు కొన్ని మార్గదర్శకాలు జారీచేసిన పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డు.. వీటిని కూడా పట్టించుకోకపోవడంతో ఆగస్టు 7న షోకాజ్‌ నోటీసు జారీచేసింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆంధ్రా బ్యాంకును విలీనం చేస్తే.. ఆ పని చేయండి.. ఎంపీ బాలశౌరి