Webdunia - Bharat's app for daily news and videos

Install App

రెండో టీ-20 దక్షిణాఫ్రికా గెలుపు.. ధోనీ, పాండే మెరిసినా నో యూజ్

ట్వంటీ-20 సిరీస్‌లో ఆతిథ్య దక్షిణాఫ్రికా జట్టు పుంజుకుంది. క్లాసన్‌ (69) చెలరేగడంతో బుధవారం జరిగిన రెండో ట్వంటీ-20లో ఆరు వికెట్ల తేడాతో భారత్‌పై దక్షిణాఫ్రికా విజయభేరి మోగించింది. మనీష్‌ పాండే (79 నాట

Webdunia
గురువారం, 22 ఫిబ్రవరి 2018 (09:37 IST)
ట్వంటీ-20 సిరీస్‌లో ఆతిథ్య దక్షిణాఫ్రికా జట్టు పుంజుకుంది. క్లాసన్‌ (69) చెలరేగడంతో బుధవారం జరిగిన రెండో ట్వంటీ-20లో ఆరు వికెట్ల తేడాతో భారత్‌పై దక్షిణాఫ్రికా విజయభేరి మోగించింది. మనీష్‌ పాండే (79 నాటౌట్‌), ధోని (52 నాటౌట్‌) మెరిసినా భారత్ గెలుపును నమోదు చేసుకోలేకపోయింది.

ధోనీ, మనీష్ పాండే మెరుగ్గా రాణించడంతో తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత్ 4వికెట్లకు 188 పరుగులు సాధించింది. కానీ తదనంతరం క్లాసన్‌తో పాటు డుమిని (64 నాటౌట్) విరుచుకుపడడంతో దక్షిణాఫ్రికా 18.4 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది. తద్వారా విజయాన్ని సఫారీల జట్టు తన ఖాతాలో వేసుకుంది.
 
ఇకపోతే.. టీమిండియా మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోనీ 11 ఏళ్ల టీ-20 కెరీర్‌లో రెండే అర్థ సెంచరీలు చేశాడు. అయితే బుధవారం దక్షిణాఫ్రికాతో సెంచూరియన్‌లో జరిగిన రెండో టీ20లో ధోనీ చెలరేగిపోయాడు. 28 బంతుల్లో 4 ఫోర్లు, మూడు సిక్సర్లతో అజేయంగా 52 పరుగులు చేశాడు. ధోనీకి ఇది 77వ టీ20 ఇన్నింగ్స్ కావడం గమనార్హం. అయినా రెండో టీ-20లో భారత్ పరాజయం పాలైంది. ఈ విజయంతో మూడు మ్యాచ్‌ల సిరీస్ 1-1తో దక్షిణాఫ్రికా సమం అయింది. సిరీస్ విజయాన్ని తేల్చే చివరి మ్యాచ్ శనివారం కేప్‌టౌన్‌లో జరగనుంది.

సంబంధిత వార్తలు

సంతోషిమాత అమ్మవారికి కేజీ బరువున్న వెండి చక్రం

అమెరికాలో తెలుగు టెక్కీ కారు ప్రమాదం నుంచి తప్పించుకున్నా మరో కారు రూపంలో మృత్యువు

Telangana రిజిస్ట్రేషన్లు ఇకపై TS కాదు TG, ఉత్తర్వులు జారీ

ఊపిరి పీల్చుకున్న మంజుమ్మెల్ బాయ్స్‌ నిర్మాతలు

ఏపీలో మరో నాలుగు రోజుల పాటు వర్షాలు

పాయల్ రాజ్‌ పుత్‌తో ప్రభాస్ పెళ్లి.. డార్లింగ్‌గా ఉంటాను?

కల్కి నుంచి భైరవ బుజ్జిని రిలీజ్ చేయనున్న చిత్ర టీమ్

'మక్కల్ సెల్వన్' విజయ్ సేతుపతి 'ఏసీఈ' ఫస్ట్ లుక్, టైటిల్ టీజర్ విడుదల

డర్టీ ఫెలో ట్రైలర్ ను మెచ్చిన విశ్వంభర దర్శకుడు మల్లిడి వశిష్ఠ

విజయ్ కనిష్కకి హిట్ లిస్ట్ మూవీ సక్సెస్ ఇవ్వాలి : హీరో సూర్య

తర్వాతి కథనం
Show comments