Webdunia - Bharat's app for daily news and videos

Install App

టీ20 ప్రపంచకప్: బ్లాక్ బస్టర్ పోరు.. దాయాదీ దేశాల మధ్య సమరం

Webdunia
శనివారం, 23 అక్టోబరు 2021 (21:36 IST)
యూఏఈ వేదికగా జరుగుతున్న టీ20 ప్రపంచకప్.. ఈ బ్లాక్ బస్టర్ పోరుకు వేదిక కానుంది. ఒకే గ్రూప్‌లో ఉన్న దాయాదీ దేశాలు అక్టోబర్ 24న దుబాయ్ వేదికగా తమ తొలి మ్యాచ్ ఆడనున్నాయి. ప్రపంచకప్‌ల్లో, ముఖ్యంగా టీ20 ఫార్మాట్‌లో దాయాదీపై భారత్‌దే పూర్తి ఆధిపత్యం. 
 
ఈ నేపథ్యంలో భారత్‌తో తలపడే తుది జట్టును పాకిస్థాన్ ఒకరోజు ముందే ప్రకటించింది. 12 మంది సభ్యులతో పాక్ టీమ్ జట్టును ప్రకటించగా.. అందులో బాబర్ ఆజమ్ (కెప్టెన్), అసిఫ్ అలీ, ఫకార్ జమాన్, హైదర్ అలీ, మహ్మద్ రిజ్వాన్, ఇమాద్ వసీమ్, మహ్మద్ హఫీజ్, షాదాబ్ ఖాన్, షోయబ్ మాలిక్, హరీస్ రౌఫ్, హసన్ అలీ, షహీన్ షా అఫ్రిదీ ఉన్నారు.
 
ఇకపోతే.. టీ20ల్లో 8 మ్యాచుల్లో 6 టీమిండియా, ఒకే ఒక్క మ్యాచ్‌లో పాక్ గెలిచింది. మరొక మ్యాచ్‌ టైగా ముగిసినా.. బౌలౌట్‌లో విజయం భారత్‌నే వరించింది. టీ20 ప్రపంచకప్‌లో ఐదు మ్యాచ్‌లకు ఐదు భారతే గెలిచింది. 2007 వరల్డ్ కప్ బౌలౌట్‌తో మొదలైన భారత్ విజయ ప్రస్థానం గత 2016 టీ20 ప్రపంచకప్ వరకు కొనసాగింది.
 
గతంలో సౌతాఫ్రికా వేదికగా జరిగిన అరంగేట్ర టీ20 ప్రపంచకప్‌లో ధోనీ కెప్టెన్సీలోని టీమిండియా తన ఫస్ట్ మ్యాచ్ దాయాదీతోనే ఆడింది. ఈ మ్యాచ్‌లో భారత్ గెలుపును నమోదు చేసుకుంది. ఆ టోర్నీ ఫైనల్లో కూడా భారత్-పాక్ మరోసారి తలపడ్డాయి. 
 
ఆర్పీ సింగ్‌ (3/26), ఇర్ఫాన్‌ పఠాన్ (3/16), జోగిందర్ శర్మ (2/20) అద్భుత బౌలింగ్‌తో భారత్‌ చిరస్మరణీయ విజయాన్ని నమోదు చేసింది. కాగా ఇప్పటివరకు టీ20 ప్రపంచకప్‌లలో భారత్, పాకిస్థాన్ జట్లు ఐదుసార్లు తలపడ్డాయి. ఈ ఐదు సార్లు కూడా భారతే విజేతగా నిలిచింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భర్తతో శృంగారానికి నిరాకరిస్తే విడాకులు ఇవ్వొచ్చు : బాంబే హైకోర్టు

ఆ కూలీకి ఆరు రూపాయలతో రూ.కోటి అదృష్టం వరించింది... ఎలా?

women: మహిళల ఆర్థిక సాధికారత కోసం ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక.. సీతక్క

స్వర్ణాంధ్ర 2047-వికాసిత్‌ భారత్ 2047 కోసం అంకితభావంతో పనిచేస్తాం.. పవన్ కల్యాణ్

"3.0 లోడింగ్... 2028లో రప్పా రప్పా".. ఖమ్మంలో కేటీఆర్ ఫ్లెక్సీలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

60 యేళ్ల వయసులో 30 యేళ్ల నటిని పెళ్ళాడిన తమిళ దర్శకుడు మృతి

Venu Swami: వేణు స్వామి పూజలు ఫలించలేదా? నిధి అగర్వాల్ ఏమందంటే....

రామ్ పోతినేని రాసిన ఆంధ్రా కింగ్ తాలూకా ఫస్ట్ సింగిల్ పాడిన అనిరుధ్ రవిచందర్

Anandi: బుర్రకథ కళాకారిణి గరివిడి లక్ష్మి పాత్రలో ఆనంది ఫస్ట్ లుక్

సుమతీ శతకం నుంచి హీరోయిన్ సాయిలీ చౌదరి ఫస్ట్ లుక్

తర్వాతి కథనం
Show comments