Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐసీసీ ట్వంటీ20 కప్ : భారత్ ఆటగాళ్లకు ఏమైంది? కోహ్లీ ఆదుకునేనా?

Webdunia
ఆదివారం, 24 అక్టోబరు 2021 (20:47 IST)
ఐసీసీ టీ20 ప్రపంచకప్‌లో భాగంగా పాకిస్థాన్‌తో జరుగుతున్న సూపర్ -12 గ్రూప్ 2 మ్యాచ్‌లో భారత్‌ను కష్టాలు వెంటాడుతున్నాయి. తొలి ఓవర్ నాలుగో బంతికి స్టార్ బ్యాట్స్‌మన్ రోహిత్ శర్మ (0) తాను ఎదుర్కొన్న తొలి బంతికే ఎల్బీగా వెనుదిరగ్గా, మూడో ఓవర్ తొలి బంతికి మరో ఓపెనర్ కేఎల్ రాహుల్ బౌల్డయ్యాడు. 8 బంతులు ఆడిన రాహుల్ 3 పరుగులు మాత్రమే చేశాడు. 
 
ఆ తర్వాత క్రీజ్‌లోకి వచ్చిన సూర్యకుమార్ యాదవ్ కూడా 8 బంతుల్లో ఒక ఫోర్, ఓ సిక్సర్ సాయంతో 11 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. ఈ దశలో కెప్టెన్ విరాట్ కోహ్లీ జతకలిసిన రిషబ్ పంత్ 30 బంతులను ఎదుర్కొని రెండు ఫోర్లు, రెండు సిక్సర్ల సాయంతో 39 పరుగులు చేసి బౌలర్‌కే క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. అప్పటికీ భారత్ స్కోరు 12.2 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 84 పరుగులు. 
 
ఆ తర్వాత పంత్ తర్వాత రవీంద్ర జడేజా క్రీజ్‌లోకి వచ్చాడు. ఈ క్రమంలో విరాట్ కోహ్లీ ఆచితూచి ఆడుతూ మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడుతూ జట్టు స్కోరును పెంచాడు. దీంతో భారత్ 14 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 96 పరుగులు చేసింది. పాక్ బౌలర్లలో ఆఫ్రిది రెండు వికెట్లు తీయగా, అలీ, ఖాన్ ఒక్కో వికెట్ చొప్పున తీశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వామ్మో... Cyclone Fengal తుపానులో చెన్నై రన్ వేపై విమానం జస్ట్ మిస్ (Video)

ఢిల్లీ మాజీ సీఎం కేజ్రీవాల్ ముఖంపై ద్రవం పోసిన వ్యక్తి

తెలంగాణలో రూ. 200 కోట్ల భారీ అవినీతి తిమింగలం నిఖేష్, ఏసీబి సోదాలు

విశాఖపట్నంలో జరిగిన కేబెల్ స్టార్ సీజన్ 3 విజేతలను ప్రకటించిన ఆర్ఆర్ కేబెల్

జనవరి నుంచి రాజధాని అమరావతి నిర్మాణ పనులు : మంత్రి నారాయణ

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

డాల్బీ విజన్ 4కే, అట్మాస్ టెక్నాలజీలో క సినిమా : హీరో కిరణ్ అబ్బవరం

M4M చూసి కిల్ల‌ర్ ఎవ‌రో గెస్ చేస్తే లక్ష రూపాయలు బహుమతి : డైరెక్ట‌ర్ మోహన్ వడ్లపట్ల

రామ్ చ‌ర‌ణ్, జాన్వీ క‌పూర్‌, బుచ్చిబాబు సానా చిత్రంలో మున్నాభాయ్ దివ్వేందు

తెలుగులో పా.. పా..గా రాబోతున్న త‌మిళ బ్లాక్ బ‌స్ట‌ర్ డా..డా

వైవిఎస్ చౌదరి సినిమాలో వీణారావు ఫస్ట్ దర్శన్ లాంచ్ చేసిన సుప్రియ, స్వప్నాదత్

తర్వాతి కథనం
Show comments