Webdunia - Bharat's app for daily news and videos

Install App

బోల్ట్ దెబ్బకు మటాష్ :: 7, 13, 9, 0, 0, 1, 16, 1, 15, 18, 5 ఇవీ భారత బ్యాట్స్‌మెన్ల రన్స్...

Webdunia
గురువారం, 31 జనవరి 2019 (09:53 IST)
హామిల్టన్ వేదికగా ఆతిథ్య న్యూజిలాండ్ జట్టుతో జరుగుతున్న నాలుగో వన్డే మ్యాచ్‌లో భారత బ్యాట్స్‌మెన్లు చేతులెత్తేశారు. కివీస్ బౌలర్లు సంధించిన బంతులను ఎదుర్కొనే సాహసం కూడా చేయకుండా పెవిలియన్‌కు క్యూకట్టారు. ఫలితంగా భారత బ్యాట్స్‌మెన్లు ఏ ఒక్కరు కూడా పట్టుమని 20 పరుగులు కూడా చేయలేక పోయారు. ఫలితంగా భారత జట్టు 30.5 ఓవర్లలో 92 పరుగులు చేసి ఆలౌట్ అయింది. 
 
అంతకుముందు ఐదు వన్డేల సిరీస్‌లో భాగంగా, ఇప్పటికే జరిగిన మూడు వన్డేల్లో టీమిండియా వరుసగా గెలిచి... సిరీస్‌ను కైవసం చేసుకుంది. గురువారం హామిల్టన్ వేదికగా నాలుగో వన్డే మ్యాచ్ ప్రారంభంకాగా, తొలుత టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత జట్టు టాప్ ఆర్డర్‌తో పాటు.. బ్యాట్స్‌మెన్స్ అంతా చేతులెత్తేశారు. ఫలితంగా కేవలం 92 పరుగులకే ఆలౌట్ అయ్యారు. 
 
తొలుత బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా బ్యాట్స్‌మెన్స్ కివీస్ బౌల‌ర్స్‌ని ఏ మాత్రం ప్ర‌తిఘ‌టించ‌కుండానే పెవిలియ‌న్‌కి క్యూ క‌ట్టేశారు. ఓపెనర్ శిఖర్ ధావన్ 20 బంతుల్లో ఓ ఫోరు, ఓ సిక్సర్ సాయంతో 13 పరుగులు చేసి, జట్టు స్కోరు 21 వద్ద ఉండగా తొలి వికెట్ రూపంలో ఔటయ్యాడు. ఆ తర్వాత మరో ఓపెనర్ రోహిత్ శర్మ 23 బంతుల్లో 7 పరుగులు, అంబటి రాయుడు, దినేశ్ కార్తీక్‌లు వరుస బంతుల్లో డకౌట్ అయ్యారు. ఇన్నింగ్స్ 11వ ఓవర్ వేసిన గ్రాండ్‌హోమ్ మూడు బంతుల వ్యవధిలో ఇద్దరినీ పెవిలియన్ బాట పట్టించాడు. 
 
ఆ తర్వాత కొద్దిసేపటికే కెప్టెన్ విరాట్ కోహ్లీ స్థానంలో తుది జట్టులోకి వచ్చిన శుభమన్ గిల్ కూడా 21 బంతులు ఎదుర్కొని ఒక్క ఫోరు సాయంతో 9 రన్స్ చేసి నిరాశపరిచాడు. మంచి ఫాంలో ఉన్న కేదార్ జాద‌వ్‌ కూడా కేవలం ఒక్క పరుగు మాత్రమే చేశాడు. ఇక బౌలర్ భువ‌నేశ్వ‌ర్ ఒక్క పరుగు చేశాడు. అప్పటికి భారత్ స్కోరు 19 ఓవర్లలో 55 ప‌రుగులు. ఏడు వికెట్లను కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఆ సమయంలో జాగ్రత్తగా ఆడాల్సిన హార్ధిక్ పాండ్యా (16; 16 బంత‌ుల్లో, 4 ఫోర్స్‌), కుల్దీప్ యాద‌వ్ ( 2, 8 బంతుల్లో)లు అనవసరపు షాట్లకు ప్రయత్నించి ఔటయ్యారు. 
 
చివరగా చాహల్ 18 (నాటౌట్), అహ్మద్ 5 చొప్పున పరుగులు చేసి ఔట్ కావడంతో భారత ఇన్నింగ్స్ ముగిసింది. ఈ మ్యాచ్‌లో కివీస్ బౌలర్ బోల్ట్ అద్భుతంగా బౌలింగ్ చేసి ఐదు వికెట్లు పడగొట్టాడు. దీంతో భారత ఇన్నింగ్స్ పేకమేడలా కూలిపోయింది. అలాగే, గ్రాండ్ హోమ్ కూడా మూడు వికెట్లు తీశాడు. న్యూజిలాండ్ బౌల‌ర్స్‌లో బౌల్ట్ నాలుగు వికెట్లు తీయ‌గా, గ్రాండ్‌ హోమ్ మూడు వికెట్లు తీశారు. ఈ వ‌న్డే రోహిత్ శ‌ర్మ‌కి 200వ‌ది కావ‌డం విశేషం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అల్పపీడనం: నవంబర్ 26 నుంచి 29 వరకు ఏపీలో భారీ వర్షాలు

జ్వరంతో విద్యార్థిని మృతి.. టీచర్లపై కేసు నమోదు.. ఎందుకని?

జైలుకు వెళ్లినలారంతా సీఎం అయ్యారనీ.. ఆ లెక్కన కేటీఆర్‌కు ఆ ఛాన్స్ రాదు : సీఎం కేసీఆర్

సెకీతో సౌర విద్యుత్ ఒప్పందంలో ఎలాంటి సంబంధం లేదు : బాలినేని

అనకాపల్లిలో గ్రీన్ హైడ్రోజన్ హబ్‌కు శంకుస్థాపన చేయనున్న ప్రధాని

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విజయ్ దేవరకొండ రౌడీ వేర్ బ్రాండ్ కు ఔట్ లుక్ ఇండియా బిజినెస్ అవార్డ్

వికటకవి చూసి గర్వంగా అనిపించింది.. నిర్మాత రామ్ తాళ్లూరి

రామ్ పోతినేని సినిమాకు తమిళ సంగీత ద్వయం వివేక్ - మెర్విన్

ఉజ్జయిని మహాకాళేశ్వర్ టెంపుల్ సాక్షిగా కన్నప్ప రిలీజ్ డేట్ ప్రకటన

వెన్నెల కిషోర్ నటించిన శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ రిలీజ్ డేట్ ఫిక్స్

తర్వాతి కథనం
Show comments