Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇంగ్లండ్‌తో టెస్టు.. ఆ ఇద్దరికీ జట్టులో స్థానం.. వాళ్లెవరు?

ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఐదు టెస్టుల సిరీస్‌లో మిగిలిన రెండు టెస్టులకు పృథ్వీషాకు చోటు కల్పించింది. ప్రపంచకప్‌ను భారత్‌కు అందించిన కెప్టెన్ పృథ్వీషాకు బీసీసీఐ జట్టులో స్థానం కల్పించింది. అతడితోపాటు 24 ఏ

Webdunia
గురువారం, 23 ఆగస్టు 2018 (17:04 IST)
ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఐదు టెస్టుల సిరీస్‌లో మిగిలిన రెండు టెస్టులకు పృథ్వీషాకు చోటు కల్పించింది. ప్రపంచకప్‌ను భారత్‌కు అందించిన కెప్టెన్ పృథ్వీషాకు బీసీసీఐ జట్టులో స్థానం కల్పించింది. అతడితోపాటు 24 ఏళ్ల ఆంధ్రా బ్యాట్స్‌మన్ హనుమ విహారీని కూడా జట్టుకు ఎంపిక చేసింది. బీసీసీఐ టీమిండియాలో స్థానం కల్పించడంతో.. వీరిద్దరూ ఇంగ్లండ్‌కు బయల్దేరనున్నారు 
 
18 ఏళ్ల పృథ్వీషా ఇటీవల జరిగిన అండర్-19 ప్రపంచకప్‌లో భారత జట్టుకు నాయకత్వం వహించాడు. అద్భుత ఆటతీరుతో భారత్‌కు ప్రపంచకప్ అందించాడు. కాగా, చివరి రెండు టెస్టులకు ఓపెనర్ మురళీ విజయ్, బౌలర్ కుల్దీప్ యాదవ్‌లను జట్టు నుంచి తప్పించారు. 
 
మురళీ విజయ్ గత 11 ఇన్నింగ్స్‌లలో సింగిల్ డిజిట్ స్కోరుకే పరిమితం కావడంతో అతడిపై వేటు వేశారు. ఇక రెండో టెస్టులో కుల్దీప్ యాదవ్ ఒక్కటంటే ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. దీంతో వీరిద్దరినీ తప్పించిన మేనేజ్ మెంట్.. వారి స్థానాల్లో పృథ్వీ షా, హనుమ విహారీలను తీసుకుంది.
 
ఇదిలా ఉంటే.. ఇంగ్లండ్‌తో జరిగిన మూడో టెస్ట్‌ విజయంలో కీలకపాత్ర పోషించిన సీమర్‌ జస్ప్రీత్‌ బుమ్రా ప్రస్తుతం ఖుషీ ఖుషీగా వున్నాడు. కెమెరా కంటిలో పడే స్థాయి లేనప్పుడు రంజీ క్రీడాకారుడిగా తాను చేసిన కఠోర సాధన ఇప్పుడు ఫలితం ఇస్తోందని చెబుతున్నాడు. రెండో ఇన్నింగ్స్‌లో బుమ్రా ఐదు వికెట్లు సాధించిన విషయం తెలిసిందే.  

సంబంధిత వార్తలు

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

తర్వాతి కథనం
Show comments