Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైజాగ్ టెస్ట్ మ్యాచ్ : అశ్విన్ అర్థ సెంచరీ... భారత్ 455 ఆలౌట్

వైజాగ్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న టెస్ట్ మ్యాచ్‌లో భారత్ తన తొలి ఇన్నిగ్స్‌లో 455 పరుగులకు ఆలౌట్ అయింది. అంతకుముందు.. మొదటి రోజు రోజు ఓవర్ నైట్ స్కోరు 317/4 స్కోరుతో నాలుగో రోజు ఉదయం ఇన్నింగ్స్ కొ

Webdunia
శుక్రవారం, 18 నవంబరు 2016 (15:08 IST)
వైజాగ్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న టెస్ట్ మ్యాచ్‌లో భారత్ తన తొలి ఇన్నిగ్స్‌లో 455 పరుగులకు ఆలౌట్ అయింది. అంతకుముందు.. మొదటి రోజు రోజు ఓవర్ నైట్ స్కోరు 317/4 స్కోరుతో నాలుగో రోజు ఉదయం ఇన్నింగ్స్ కొనసాగించిన భారత్ మరో 169 పరుగులను జత చేసిన మిగతా ఆరు వికెట్లను కోల్పోయింది. 
 
గురువారం నాటి ఆటలో అజింక్యా రహానే(13) ఐదో వికెట్‌గా ఔటయ్యాక కాసేపటికి విరాట్ కోహ్లీ(40) పెవిలియన్ చేరాడు. దాంతో భారత్ 361 పరుగుల వద్ద ఆరో వికెట్‌ను నష్టపోయింది. అయితే రవి చంద్రన్ అశ్విన్ (70; 138 బంతుల్లో 7 ఫోర్లు), వృద్ధిమాన్ సాహా(35)లు బాధ్యతాయుతంగా ఆడి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు. ఈ జోడి ఏడో వికెట్ కు 63 పరుగులు జోడించిన తర్వాత సాహా అవుటయ్యాడు. 
 
ఆ తర్వాత అశ్విన్ తన టెస్టు కెరీర్‌లో ఏడో హాఫ్ సెంచరీ సాధించి చివరి వికెట్‌గా ఔటయ్యాడు. ఇంగ్లండ్ బౌలర్లలో రషీద్ నాలుగు వికెట్లు సాధించగా, అన్సారీ, మొయిన్ అలీలు రెండేసి వికెట్లు తీశారు. స్టువర్ట్ బ్రాడ్, బెన్ స్టోక్స్‌లకు తలో వికెట్ దక్కింది. అంతకుముందు ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 537 పరుగులకు ఆలౌటైన సంగతి తెలిసిందే. దాంతో ఇంగ్లండ్‌కు 49 పరుగుల ఆధిక్యం లభించింది. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

తమిళనాడు జీడీపీ కంటే పాకిస్థాన్ జీడీపీ తక్కువా? నెటిజన్ల సెటైర్లు!!

కాశ్మీర్ త్రాల్‌లో ముగ్గురు ఉగ్రవాదులు హతం, ఒకడు పహెల్గాం దాడిలో పాల్గొన్నాడు?!!

హత్యకు దారితీసిన సమోసా ఘర్షణ - షాపు యజమానిని కాల్చేసిన కస్టమర్!!

టీడీపీ మహానాడు.. నారా లోకేష్‌కు ప్రమోషన్ ఇచ్చే ఛాన్స్.. ఏ పదవి ఇస్తారంటే?

ఆపరేషన్ సిందూర్‌తో ఉగ్రవాదంపై ఉక్కుపాదం: శ్రీనగర్ లో రక్షణమంత్రి రాజ్‌నాథ్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Karate Kid: అజయ్ దేవ్‌గన్- యుగ్ దేవ్‌గన్ కలసి ‘కరాటే కిడ్: లెజెండ్స్’ హిందీ ట్రైలర్ విడుదల!

భర్తగా కాదు.. బంగారు గుడ్డుపెట్టే బాతులా చూశారు : రవి మోహన్

పౌరులను చైతన్యపరిచే చిత్రం జనం రీ-రిలీజ్

Sreeleela :గాలి కిరీటి రెడ్డి, శ్రీలీల మూవీ జూనియర్ అప్ డేట్

మీకు వావ్ అనిపించేలా వచ్చినవాడు గౌతమ్ సినిమా ఉంటుంది: అశ్విన్ బాబు

తర్వాతి కథనం
Show comments