Webdunia - Bharat's app for daily news and videos

Install App

నా భార్య గర్భవతిగా ఉన్నపుడు మోసం చేశా.. చైనా స్టార్ లిన్ డాన్

నా భార్య గర్భవతిగా ఉన్నప్పుడు ఆమెను మోసం చేసి.. తాను మరో మహిళతో సన్నిహితంగా ఉన్నట్టు చైనా బాడ్మింటన్‌ సూపర్‌ స్టార్‌ లిన్‌ డాన్‌ వెల్లడించాడు. ఇటీవలే లిన్‌ డాన్‌ భార్య తమ తొలిబిడ్డకు జన్మనిచ్చింది. ఈ

Webdunia
శుక్రవారం, 18 నవంబరు 2016 (09:37 IST)
నా భార్య గర్భవతిగా ఉన్నప్పుడు ఆమెను మోసం చేసి.. తాను మరో మహిళతో సన్నిహితంగా ఉన్నట్టు చైనా బాడ్మింటన్‌ సూపర్‌ స్టార్‌ లిన్‌ డాన్‌ వెల్లడించాడు. ఇటీవలే లిన్‌ డాన్‌ భార్య తమ తొలిబిడ్డకు జన్మనిచ్చింది. ఈ నేపథ్యంలో ఓ 'మిస్టరీ మహిళ'తో లిన్‌ డాన్‌ చెట్టాపట్టాలేసుకొని తిరుగుతున్న ఫొటోలు ఆన్‌లైన్‌లో వెలుగులోకి వచ్చాయి. 
 
'డిటెక్టివ్‌ ఝావో' అనే నెటిజన్‌ ఆన్‌లైన్‌లో పోస్టుచేసిన ఈ ఫొటోలు లిన్‌ డాన్‌ అభిమానుల్ని షాక్‌కు గురిచేశాయి. లిన్‌తో తిరిగిన సదరు మహిళ ప్రముఖ మోడల్‌, నటి ఝావో యాకిగా తేలింది. గత సెప్టెంబర్‌ నెలలో ఓ రెస్టారెంట్‌ వద్ద లిన్‌, యాకీ సన్నిహితంగా తిరుగుతుంటే తాను గమనించి.. వారిని అనుసరించానని, లిన్‌ యాకీని తన ఇంటికి తీసుకెళ్లాడని, 2 గంటలు గడిపిన అనంతరం వారు బయటకు వచ్చారని, ఆ తర్వాత ఒక హోటల్‌లోను వారు రాసలీలలు నెరిపారని డిటెక్టివ్‌ ఝావో పేర్కొన్నాడు.
 
లిన్‌ భార్య గ్జీ జింగ్‌ఫంగ్‌ కూడా బ్యాడ్మింటన్‌ చాంపియన్‌. ఆమె ఈ నెల 5న బిడ్డను ప్రసవించింది. ఈ క్రమంలోనే లిన్‌, యాకీ సన్నిహితంగా ఉన్న ఫొటోలు వెలుగుచూడటంతో చైనా సోషల్‌ మీడియా సైట్‌ వీబోలో అతనిపై నెటిజన్లు తీవ్రంగా మండిపడ్డారు. దీంతో లిన్‌ డాన్‌ స్పందిస్తూ ' ఒక వ్యక్తిగా నా తప్పులకు సాకులు వెతుక్కోను. నా ప్రవర్తన కుటుంబాన్ని గాయపరిచింది. అందుకే నా కుటుంబానికి క్షమాపణలు చెప్తున్నా'అని ఆయన పేర్కొన్నాడు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

నీకెంత ధైర్యం.. నా బస్సునే ఓవర్‌టేక్ చేస్తావా.. కండక్టరుపై వైకాపా మాజీ ఎమ్మెల్యే దాడి!!

ఇంటి ముందు చెత్త వేయుద్దన్నందుకు మహిళ తల నరికేశాడు

తమిళనాడు జీడీపీ కంటే పాకిస్థాన్ జీడీపీ తక్కువా? నెటిజన్ల సెటైర్లు!!

కాశ్మీర్ త్రాల్‌లో ముగ్గురు ఉగ్రవాదులు హతం, ఒకడు పహెల్గాం దాడిలో పాల్గొన్నాడు?!!

హత్యకు దారితీసిన సమోసా ఘర్షణ - షాపు యజమానిని కాల్చేసిన కస్టమర్!!

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Karate Kid: అజయ్ దేవ్‌గన్- యుగ్ దేవ్‌గన్ కలసి ‘కరాటే కిడ్: లెజెండ్స్’ హిందీ ట్రైలర్ విడుదల!

భర్తగా కాదు.. బంగారు గుడ్డుపెట్టే బాతులా చూశారు : రవి మోహన్

పౌరులను చైతన్యపరిచే చిత్రం జనం రీ-రిలీజ్

Sreeleela :గాలి కిరీటి రెడ్డి, శ్రీలీల మూవీ జూనియర్ అప్ డేట్

మీకు వావ్ అనిపించేలా వచ్చినవాడు గౌతమ్ సినిమా ఉంటుంది: అశ్విన్ బాబు

తర్వాతి కథనం
Show comments