Webdunia - Bharat's app for daily news and videos

Install App

మొహాలీ టెస్ట్.. ఇంగ్లండ్ బ్యాటింగ్.. కరుణ్ నాయర్‌ 'టెస్ట్‌' అరంగేట్రం

మొహాలీ వేదికగా శనివారం నుంచి ప్రారంభమైన టెస్ట్ మ్యాచ్‌లో ఇంగ్లండ్ జట్టు తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో టెస్ట్ జట్టులో స్థానం కోసం ఎదురు చూస్తోన్న కర్ణాటక ఆల్‌రౌండర్‌ కరుణ్ నాయర్‌‌క

Webdunia
శనివారం, 26 నవంబరు 2016 (10:04 IST)
మొహాలీ వేదికగా శనివారం నుంచి ప్రారంభమైన టెస్ట్ మ్యాచ్‌లో ఇంగ్లండ్ జట్టు తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో టెస్ట్ జట్టులో స్థానం కోసం ఎదురు చూస్తోన్న కర్ణాటక ఆల్‌రౌండర్‌ కరుణ్ నాయర్‌‌కు చోటు దక్కింది. ఈ మ్యాచ్‌ కోసం ప్రకటించిన తుది 11 మందిలో ఒకడిగా కరుణ్ ఎంపికయ్యాడు. మరో యువ బ్యాట్స్‌మన్‌ కేఎల్‌.రాహుల్‌ అనూహ్యంగా గాయపడటంతో నాయర్‌కు జట్టులో బెర్త్‌ ఖరారైంది. 
 
కాగా, శనివారం ఉదయం మొహాలీలోని పంజాబ్‌ క్రికెట్‌ అసోసియేషన్ స్టేడియంలో మూడో టెస్ట్‌ మొదలైంది. టాస్‌ టాస్ గెలిచిన ఇంగ్లాండ్‌ బ్యాటింగ్‌ ఎంచుకుంది. భారత ఆటగాళ్లు ఫీల్డ్‌లోకి దిగడానికి కొద్ది నిమిషాల ముందు కోచ్‌ అనిల్‌ కుంబ్లే, వెటరన్‌ క్రికెటర్‌ సునీల్‌ గవాస్కర్‌ తదితరులు కరుణ్ నాయర్‌కు జాతీయ జట్టు టోపీని అందించి శుభాకాంక్షలు తెలిపారు. నిజానికి గత జింబాబ్వే సిరీస్‌లోనే నాయర్‌కు జట్టులో చోటు దక్కినప్పటికీ స్టాండ్స్‌‌కే పరిమితం కావాల్సి వచ్చింది.
 
ఇంగ్లండ్‌తో ఐదు టెస్టుల సిరీస్‌లో భారత్‌ 1-0 తేడాతో ముందంజలో ఉన్న సంగతి తెలిసిందే. రాజ్‌కోట్‌ టెస్టు డ్రాగా ముగియగా, విశాఖ టెస్టులో టీమిండియా సూపర్‌ విక్టరీ సాధించింది. ఇక మూడో టెస్టుకు వేదికైన పీసీఏ(మొహాలీ) మైదానంలో గత 11 టెస్టులలో ఒక్కటి కూడా ఓడని రికార్డు భారత్‌కు ఉంది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

బీమా సొమ్ము కోసం కన్నతండ్రినే కారుతో ఢీకొట్టించిన కుమారుడు...

నైట్ రైడర్స్ బార్‌ను ధ్వంసం చేసిన రాజ్ థాక్రే అనుచరులు

ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసింది.. ఫోన్ సిగ్నల్ ఆధారంగా యేడాది తర్వాత వెలుగులోకి..

అసహజ లైంగిక ప్రవర్తనతో వేధింపులు... భర్తపై భార్య ఫిర్యాదు

గ్రామ సర్పించి అక్రమ సంబంధం... పోలీసులకు పట్టించిన భర్త

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Niharika: సంప్రదాయం దుస్తులతో పెండ్లి కూతురులా ముస్తాబయిన నీహారిక కొణిదల

ఒక్క కూలీ కోసం యుద్ధమే జరుగుతోందని చెప్పే రజనీకాంత్ కూలీ ట్రైలర్

అర్జున్ రెడ్డి టైంలోనే సుకుమార్ తో సినిమా అనుకున్నాం : విజయ్ దేవరకొండ

ఫ్యామిలీ ఎమోషన్స్, ఎంటర్ టైన్ మెంట్ తో లిటిల్ హార్ట్స్ సిద్ధం

త్రిబాణధారి బార్బరిక్ లో ఉదయ భాను స్టెప్పులు స్పెషల్ అట్రాక్షన్

తర్వాతి కథనం
Show comments