Webdunia - Bharat's app for daily news and videos

Install App

బంగ్లాదేశ్‌తో తొలి వన్డే మ్యాచ్ : భారత్ 186 ఆలౌట్

Webdunia
ఆదివారం, 4 డిశెంబరు 2022 (15:18 IST)
ఆతిథ్య బంగ్లాదేశ్ జట్టుతో భారత్ ఆదివారం తొలి వన్డే మ్యాచ్‌లో తలపడింది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్... కేవలం 41.2 ఓవర్లలో 186 పరుగులకే ఆలౌట్ అయింది. బంగ్లాదేశ్ బౌలర్లలో షకీబ్‌కు ఐదు వికెట్లు తీయగా, ఇబాదత్ నాలుగు వికెట్లు కూల్చాడు. 
 
మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా ఆదివారం తొలి వన్డే జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత ఆటగాళ్లు పూర్తిగా విఫలమయ్యారు. లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ షకీబల్ హాసన్‌ దెబ్బకు భారత ఆటగాళ్లు తలవంచారు. మరోవైపు, ఇబాదత్ హుస్సేన్ కూడా అద్భుతమైన లైన్ అండ్ లెంగ్త్ బౌలింగ్‌తో నాలుగు వికెట్లు కూల్చాడు. దీంత భారత్ బ్యాటర్లు తలవంచారు. 
 
ఫలితంగా 41.2 ఓవర్లలో 186 పరుగులకే ఆలౌట్ అయింది. భారత ఆటగాళ్లలో అత్యధికంగా కేఎల్ రాహుల్ 73 పరుగులు చేయగా, కెప్టెన్ రోహిత్ శర్మ 27, శ్రేయాస్ అయ్యర్ 247, ఓపెనర్ శిఖర్ ధావన్ 7 చొప్పున పరుగులు చేశాడు. 
 
ఒకే ఓవర్‌లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ (9) వికెట్లను షకీబ్ నేలకూల్చాడు. ఆ తర్వాత భారత్ ఏ దశలోనూ కోలుకోలేక పోయింది. వాషింగ్టన్ సుందర్ కూడా 19 పరుగులు చేసి షకీబ్ బౌలింగ్‌లోనే ఔట్ అయ్యారు. మెహిదీ హాసన్‌కు ఓ వికెట్ దక్కింది. 

సంబంధిత వార్తలు

తాడిపత్రి నుంచి జేసీ ప్రభాకర్ రెడ్డిని బలవంతంగా తరలించారు!!

బాలికలతో వ్యభిచారం.. డీఎస్పీ సహా 21 మంది అరెస్టు

ఏపీలో పోలింగ్ తర్వాత హింస : సీఎస్‌పై ఈసీ ఆగ్రహం... ఓట్ల లెక్కింపు తర్వాత కూడా భద్రత కొనసాగింపు..

చిన్నారి చేతి వేలికి ఆపరేషన్ చేయమంటే.. నాలుకకు చేసిన వైద్యుడు... ఎక్కడ?

అమెరికా రోడ్డు ప్రమాదంలో ముగ్గురు భారతీయ విద్యార్థుల మృతి.. తెలుగమ్మాయి..?

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

తర్వాతి కథనం
Show comments