Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఇంటర్‌బ్యాంక్‌ రేట్‌ ఫారెక్స్‌ కార్డ్‌ విడుదల చేసిన బుక్‌ మై ఫారెక్స్‌

image
, గురువారం, 1 డిశెంబరు 2022 (22:44 IST)
భారతదేశపు మొట్టమొదటి ఆన్‌లైన్‌ ఫారిన్‌ ఎక్సేంజ్‌ మార్కెట్‌ ప్లేస్‌, బుక్‌ మై ఫారెక్స్‌ డాట్‌ కామ్‌ ఇంటర్‌ బ్యాంక్‌ రేట్‌ మల్టీ కరెన్సీ ఫారెక్స్‌ కార్డును విడుదల చేసింది. ఇది భారతదేశంలో మొట్టమొదటి ట్రూజీరో మార్కప్‌ ట్రావెల్‌కార్డ్‌. సాధారణ బ్యాంకింగ్‌ వేళల్లో, ఇంటర్నేషనల్‌ ట్రావెలర్స్‌ ఈ ఫారెక్స్‌కార్డులను ఇంటర్‌బ్యాంక్‌ రేట్ల వద్ద జీరో యాడెడ్‌ మార్కప్‌తో కొనుగోలు చేయవచ్చు. అంటే సెర్చ్‌ ఇంజిన్‌ల వద్ద కనిపించే ప్రత్యక్ష, వాస్తవ రేట్లను పొందవచ్చు. సాధారణంగా బ్యాంకులు ప్రధానమైన కరెన్సీల వద్ద ఒకదానితో ఒకటి ఆ రేట్ల వద్దనే లావాదేవీలు జరుపుతుంటాయి.  ఈ బుక్‌మై ఫారెక్స్‌ కో బ్రాండెడ్‌ మల్టీ కరెన్సీ కార్డును  ఎస్‌బ్యాంక్‌ , ఎం2పీ తో భాగస్వామ్యం చేసుకుని అభివృద్ధి చేయగా, వీసా దీనికి తగిన శక్తిని అందించింది.
 
బుక్‌మై ఫారెక్స్‌ ఫౌండర్‌ మరియు సీఈఓ సుదర్శన్‌ మొత్వానీ మాట్లాడుతూ, ‘‘విస్తృతశ్రేణిలో అంతర్జాతీయ ట్రావెల్‌ కార్డులు ఉన్నప్పటికీ, తమ విదేశీ ఖర్చులకు  సంబంధించి అత్యుత్తమంగా తగిన ఉత్పత్తుల పట్ల స్పష్టమైన చిత్రమైతే వినియోగదారులు పొందలేకపోతున్నారు. బ్యాంకులు జారీ చేసే క్రెడిట్‌/డెబిట్‌ కార్డులపై  చేసే విదేశీ లావాదేవీలపై 5%పై ఇంటర్‌బ్యాంక్‌ రేట్లను బ్యాంకులు వసూలు చేస్తుంటాయి. కొన్ని ఐఎన్‌ఆర్‌ కార్డు ఉత్పత్తులు జీరో మార్కప్‌ అని చెప్పినప్పటికీ అవి వీసా/మాస్టర్‌కార్డ్‌ రేట్లపై మాత్రమే జీరో మార్కప్‌ రేట్లను అందిస్తాయి. అవి 1% వరకూ అధికంగా ఇంటర్‌బ్యాంక్‌ రేట్లను వసూలు చేస్తాయి. అందువల్ల, జీరోమార్కప్‌ అంటే వాస్తవంగా జీరో మార్కప్‌ కాదు. అలా కావాలంటే ఇంటర్‌బ్యాంక్‌ రేట్లపై జీరో మార్కప్‌ ఉండాల్సి ఉంటుంది.
 
లైవ్‌ ఇంటర్‌బ్యాంక్‌ రేట్లతో జీరో మార్కప్‌ అందిస్తున్న మొట్టమొదటి ఫారెక్స్‌ కార్డ్‌ను బుక్‌మై ఫారెక్స్‌ అందిస్తుంది. భారతదేశంలో అందుబాటులో ఉన్న మొట్టమొదటి జీరో మార్కప్‌ ట్రావెల్‌ కార్డ్‌ ఇది. బుక్‌మై ఫారెక్స్‌ ఇంటర్‌బ్యాంక్‌ ఫారెక్స్‌ కార్డుతో మా మార్కెట్‌ వాటా రెట్టింపు అవుతుందనే విశ్వాసంతో ఉన్నాము’’ అని అన్నారు. వీసా పవర్‌ కలిగిన బుక్‌మై ఫారెక్స్‌ కార్డును అంతర్జాతీయంగా 35 మిలియన్లకు పైగా స్టోర్ల వద్ద, ఒక మిలియన్‌కు పైగా ఈ-కామర్స్‌ వెబ్‌సైట్లు, 2 మిలియన్‌లకు పైగా ఏటీఎంల వద్ద అంగీకరిస్తున్నారు. ఈ కార్డును 14 విభిన్న కరెన్సీలపై లోడ్‌ చేయవచ్చు. డెబిట్‌ లేదా క్రెడిట్‌ కార్డుల్లా కాకుండా ఫారెక్స్‌ కార్డులపై ఎక్సేంజ్‌ రేట్లు స్థిరంగా ఉంటాయి.
 
వినియోగదారులు రేట్ల ఒడిదుడుకులు గురించి, రేట్లు ఒడిదుడుకుల గురించి ఆందోళన చెందనవసరం లేదు. సంవత్సరానికి ఏడు లక్షల రూపాయలకు మించి విదేశీ మారక ద్రవ్యం కొనుగోలు చేసిన వినియోగదారులపై ట్యాక్స్‌ కలెక్టడ్‌ ఎట్‌ సోర్స్‌(టీసీఎస్‌)ను ఫారెక్స్‌ కార్డుపై  వసూలు చేస్తారు. ఈ కార్డుపై జీరో ఇష్యూయెన్స్‌, రీలోడ్‌/అన్‌లోడింగ్‌ చార్జ్‌ ఉంటుంది. వినియోగదారులు ఈ ఫారెక్స్‌ కార్డును బుక్‌మై ఫారెక్స్‌ వెబ్‌సైట్‌ లేదా ఆండ్రాయిడ్‌/ఐఓఎస్‌ యాప్‌ ద్వారా పొందవచ్చు. దేశవ్యాప్తంగా ప్రధాన నగరాలలో దీనిని అదే రోజు డెలివరీ చేస్తారు. ఈ కార్డును డిజిటల్‌గా టాప్‌ అప్‌ చేయవచ్చు. విదేశాలలో ఉన్నప్పుడు బుక్‌మై ఫారెక్స్‌ యాప్‌పై రీలోడ్‌ ఆర్డర్‌ చేయడం ద్వారా రీలోడ్‌ చేయవచ్చు.
 
గణనీయమైన రేట్‌ ప్రయోజనంతో పాటుగా ఫారెక్స్‌ కార్డ్‌ శక్తివంతమైన నూతన తరపు యాప్‌‌ను ఆలోచనాత్మకంగా అంతర్జాతీయ ట్రావెలర్లకు మహోన్నతమైన అనుభవాలను అందించే రీతిలో తీర్చిదిద్దారు. ఇవి వినూత్నమైన ఫీచర్లతో వస్తుంది.
 
1. వాస్తవ సమయంలో వినియోగం ట్రాకింగ్‌ చేయడంతో పాటుగా లావాదేవీల క్రమబద్దీకరణ
 
2. ఇన్‌స్టెంట్‌ ట్రాన్‌శాక్షన్‌ నోటిఫికేషన్స్‌
 
3. ఒక కరెన్సీ నుంచి మరో కరెన్సీకి బ్యాలెన్స్‌ను ఇన్‌స్టెంట్‌గా మార్చే సదుపాయం
 
4. సురక్షిత ఆన్‌లైన్‌ లావాదేవీల కోసం వర్ట్యువల్‌ కార్డులను నాశనం చేయడం
 
5. సౌకర్యవంతమైన టాపప్స్‌ మరియు కార్డుపై రీఫండ్స్‌
 
6. బ్యాంక్‌ గ్రేడ్‌ సెక్యూరిటీ
 
7. దగ్గరలోని ఏటీఎం ట్రాకర్‌
 
బుక్‌ మై ఫారెక్స్‌ ఫౌండర్‌- సీటీఓ నితన్‌ మొత్త్వానీ మాట్లాడుతూ, ‘‘భారతదేశంలో డిజిటల్‌ ఫారెక్స్‌ విప్లవం తీసుకురావడంలో అగ్రగామిగా, మేమెప్పుడూ కూడా వినియోగదారుల విలువను పెంపొందించే ఉత్పత్తులను సృష్టించడానికి ప్రయత్నిస్తుంటాము. అదే సమయంలో అతి సులభంగా వినియోగించే అవకాశమూ అందిస్తున్నాము. ఈ ఇంటర్‌బ్యాంక్‌ ఫారెక్స్‌ కార్డ్‌‌తో పాటుగా మొబైల్‌ యాప్‌ కూడా అందించడం వల్ల భారతదేశంలో విదేశీ మారకద్రవ్యం పరంగా విప్లవాత్మీకరించడం సాధ్యమవుతుంది’’ అని అన్నారు
 
ఇంటర్నేషనల్‌ ట్రావెలర్స్‌కు మరింత విలువను అందించేందుకు బుక్‌మై ఫారెక్స్‌ ఇప్పుడు ఉచిత అంతర్జాతీయ సిమ్‌ను అపరిమిత ఇన్‌కమింగ్‌ కాల్స్‌, వాట్సాప్‌ చాట్స్‌తో పాటుగా ఇంటర్‌బ్యాంక్‌ రేట్‌ ఫారెక్స్‌ కార్డుతో అందిస్తుంది. ఈ సిమ్‌కార్డుతో ప్రయాణీకులు పూర్తిగా కనెక్ట్‌ కాబడి ఉండవచ్చు. అదే సమయంలో అపరిమిత ఇన్‌కమింగ్‌ కాల్స్‌, వాట్సాప్‌ చాట్‌ను 30 రోజుల పాటు యాక్టివేషన్‌‌తో పాటుగా పొందవచ్చు. వినియోగదారులు అతి సులభంగా ఈ సిమ్‌ టాపప్‌ చేసుకోవడం ద్వారా అదనపు డాటా, వాయిస్‌ ప్యాక్‌లను తమ అవసరాలకనుగుణంగా పొందవచ్చు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కాశీ కాదు.. మురికినీటితో చుట్టబడిన నగరం.. అపర్ణ ఎవరు?