Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

దేశంలో డిజిటల్ కరెన్సీ రంగ ప్రవేశం.. ఆవిష్కరించిన ఆర్బీఐ

Rupee
, గురువారం, 1 డిశెంబరు 2022 (15:24 IST)
దేశంలో డిజిటల్ కరెన్సీ రంగ ప్రవేశం చేసింది. ఈ డిజిటల్ కరెన్సీని భారత రిజర్వు బ్యాంకు డిసెంబరు ఒకటో తేదీ గురువారం ఆవిష్కరించింది. ఇందుకోసం ఆర్బీఐ పలు బ్యాంకులతో ఒప్పందం కుదుర్చుకుంది. తొలి దశలో పరిమిత నగరాల్లో ఈ సేవలు అందుబాటులోకి రానున్నాయి. మలి దశలో ఇతర నగరాలకు విస్తరించేలా చర్యలు తీసుకోనుంది. డిజిటల్ కరెన్సీ రాకతో కరెన్సీ నోట్లు చరిత్రగా మారనున్నాయి. 
 
ఇదిలావుంటే, డిజిటల్ రూపీ కోసం ఆర్బీఐ ఎనిమిది బ్యాంకులతో ఒప్పందం కుదుర్చుకుంది. వీటిలో దేశ వాణిజ్య రాధాని ముంబై, దేశ రాజధాని ఢిల్లీ, దేశ ఐటీ క్యాపిటల్ బెంగుళూరు, భువనేశ్వర్‌లోని భారతీయ స్టేట్ బ్యాంకు, ఐసీఐసీఐ, యస్ బ్యాంకు, ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంకులు ఉన్నాయి. ఈ ప్రయోగాత్మక ప్రాజెక్టు తొలుత కస్టమర్లు, వ్యాపారులతో కూడిన క్లోజ్డ్ యూజర్ గ్రూపు (సీయూజీ)కి మాత్రమే అందుబాటులోకి ఉంటుంది. ఈ మేరకు భారతీయ రిజర్వు బ్యాంకు ఓ ప్రకటన విడుదల చేసింది.
 
ఈ డిజిటల్ ఈ-రుపీ ఎలా పని చేస్తుందనే విషయాన్ని పరిశీలిస్తే, డిజిటల్ రూపాయిని వినియోగదారులు, వ్యాపారులకు బ్యాంకులు వంటి మధ్యవర్తుల ద్వారా పంపిణీ చేస్తారు. బ్యాంకులు అందించే వాలెట్ ద్వారా ఈ-రూపాయితో లావాదేవీలు చేసుకోవచ్చు. 
 
లేదంటే మొబైల్ ఫోన్లు, ఇతర పరికరాల్లోనూ నిల్వ చేసుకోవచ్చు. అలాగే వ్యక్తుల నుంచి వ్యక్తులమధ్య (పీ2పీ), వ్యాప్తి వ్యాపారి (పీ2ఎం) మధ్య డిజిటల్ రుపీతో లావాదేవీలు జరుపుకోవచ్చని ఆర్బీఐ తెలిపింది. 
 
ప్రస్తుతం ఆన్‌లైన్ లావాదేవీలు జరుగుతున్నట్టుగానే క్యూఆర్ కోడ్‌లను స్కాన్ చేసి కూడా డిజిటల్ ట్రాన్సాక్షన్ పూర్తి చేయొచ్చు. భౌతిక నగదు లాగానే ఇది కూడా ఒక భద్రత, సెటిల్‌మెంట్‌ను అందిస్తుంది. అయితే, డిజిటల్ రుపీ మన వాలెట్లలో ఉంటే మాత్రం దానికి వడ్డీ లభించదు. బ్యాంకుల వద్ద డిపాజిట్ల రూపంలో ఉంటే మాత్రం కొంతమేరకు వడ్డీ ఇస్తారు. 
 
చట్టపరమైన టెండర్‌ను సూచించే డిజిటల్ టోకన్ మరో రూపమే ఈ-రూపాయిగా పరిగణిస్తారు. క్రిప్టో కరెన్సీలా కాకుండా, పేపర్ కరెన్సీ, నాణేల మాదిరిగానే అదే విలువను కలిగివుంటుంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

3,897 పోస్టులకు తెలంగాణ సర్కారు పచ్చజెండా