Webdunia - Bharat's app for daily news and videos

Install App

బంగ్లాదేశ్ చిత్తు : సెమీస్‌కు భారత్... వరుసగా మూడోసారి...

Webdunia
బుధవారం, 3 జులై 2019 (10:13 IST)
ఐసీసీ క్రికెట్ ప్రపంచ కప్ టోర్నీలో భాగంగా బర్మింగ్‌హామ్‌లోని ఎడ్జ్ బాస్టన్ స్టేడియంలో మంగళవార బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ విజయభేరీ మోగించింది. దీంతో సెమీస్ బెర్తును ఖరారు చేసింది. ఈ ప్రపంచ కప్‌లో సెమీస్‌కు చేరిన రెండో జట్టుగా కోహ్లీ సేన రికార్డు సృష్టించింది. ఇప్పటికే ఆస్ట్రేలియా సెమీస్‌కు చేరిన విషయం తెల్సిందే. ఓ దశలో బంగ్లాదేశ్ భయపట్టినా చివరకు భారత బౌలర్లు విజృంభించడంతో చిత్తుకాక తప్పలేదు. ముఖ్యంగా, బుమ్రా వరుస బంతుల్లో రెండు వికెట్లు తీయడంతో బంగ్లా ఓటమి ఖాయమైపోయింది. 
 
అంతకుముందు.. తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 314 పరుగులు చేసింది. ఇందులో ఓపెనర్లు కేఎల్ రాహుల్ 77, రోహిత్ శర్మ 104 చొప్పున పరుగులు చేశారు. అలాగే, కోహ్లీ 26, రిషబ్ పంత్ 48, హార్దిక్ పాండ్యా 0, ధోనీ 35, దినేష్ కార్తీక్ 8, భువీ 2, షమీ ఒక్క పరుగు చొప్పున రన్స్ చేశారు. 
 
ఆ తర్వాత 315 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్.. 48 ఓవర్లలో 286 పరుగుల వద్ద ఆలౌట్ అయింది. ఆ జట్టలు ఓపెనర్లు తమీమ్ 22, సౌమ్యా సర్కార్ 33, షకీబల్ 66, ముష్పికర్ 24, లిటన్ 22, మొసద్దెక్ 3, షబ్బీర్ 36, సైఫుద్దీన్ 51, మొర్తాజా 8, రూబెల్ 9 చొప్పున పరుగులు చేశారు. భారత బౌలర్లలో భువనేశ్వర్, షమీ తలా ఒక్కొక్కటి, బుమ్రా 4, హార్దిక్ పాండ్యా 3, చాహల్ ఒక వికెట్ తీశారు. 
 
కాగా, ఈ మ్యాచ్‌లో భారత్ ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టింది. ఫలితంగా మూడోసారి వరుసగా సెమీ ఫైనల్లోకి ప్రవేశించింది. రోహిత్‌ శర్మ (92 బంతుల్లో 7 ఫోర్లు, 5 సిక్సర్లతో 104) శతకం, రాహుల్‌ (92 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స్‌తో 77) హాఫ్‌ సెంచరీతో అద్భుత ఆరంభాన్ని అందించగా బుమ్రా (4/55), హార్దిక్‌ పాండ్యా (3/60) బౌలింగ్‌ మాయతో బంగ్లాదేశ్‌పై 28 పరుగుల తేడాతో విజయం సాధించింది. దీంతో 13 పాయింట్లతో భారత్‌ మరో మ్యాచ్‌ ఉండగానే నాకౌట్‌కు చేరింది. అటు ఏడు పాయింట్లతో ఉన్న బంగ్లా జట్టు తమ చివరి మ్యాచ్‌లో పాక్‌పై గెలిచినా ఫలితం లేదు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సీఎం చంద్రబాబుపై ఆనంద్ మహీంద్రా ప్రశంసల వర్షం... ఆలోచనలు అద్భుతమంటూ ట్వీట్

అణు ఒప్పందంపై సంతకం చేయకుంటే టెహ్రాన్‌ను పేల్చేస్తాం - ట్రంప్ : కుదరదంటున్న ఇరాన్

సజీవ సమాధికి వ్యక్తి యత్నం : అడ్డుకున్న పోలీసులు

అలహాబాద్ ట్రిపుల్ ఐటీలో నిజామాబాద్ విద్యార్థి ఆత్మహత్య!

ఎస్వీఎస్ఎన్ వర్మ వైకాపాలో చేరుతారా? క్రాంతి ఈ కామెంట్లు ఏంటి? పవన్ సైలెంట్?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sharva: శర్వా, సంయుక్త పై నారి నారి నడుమ మురారి ఫస్ట్ సింగిల్

నెలకు 67 రూపాయల ప్యాక్ తో ఖర్చు తక్కువ కిక్ ఎక్కువ అంటున్న ఆహా ఓటీటీ

Balayya: ఎనిమిది నెలలు నిద్రాహారాలు మాని కృషి చేసి సినిమాని రీస్టోర్ చేశారు : బాలకృష్ణ

Kadambari: వ‌దిలేసిన నిస్సాహ‌యుల‌ను మేం చేరదీస్తాం : మనం సైతం కాదంబరి

Namrata: సితార ఘట్టమనేని తొలి చిత్రం ఎప్పుడు.. నమ్రత ఏం చెప్పారు?

తర్వాతి కథనం
Show comments