Webdunia - Bharat's app for daily news and videos

Install App

చెత్తగా బ్యాటింగ్ చేశాం.. చిత్తుగా ఓడాం.. విరాట్ కోహ్లీ

గౌహతి వేదికగా జరిగిన రెండో ట్వంటీ20 మ్యాచ్‌లో భారత జట్టు ప్రత్యర్థి ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయింది. ఈ ఓటమిపై భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ స్పందిస్తూ... తమ ఆటగాళ్లు చెత్తగా బ్యాటింగ్ చేయడం

Webdunia
బుధవారం, 11 అక్టోబరు 2017 (11:17 IST)
గౌహతి వేదికగా జరిగిన రెండో ట్వంటీ20 మ్యాచ్‌లో భారత జట్టు ప్రత్యర్థి ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయింది. ఈ ఓటమిపై భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ స్పందిస్తూ... తమ ఆటగాళ్లు చెత్తగా బ్యాటింగ్ చేయడం వల్లే చిత్తుగా ఓడిపోయామన్నారు. 
 
క్రీజులో కుదురుకునేంత వరకైనా వికెట్లను అంటిపెట్టుకుని ఉండాల్సిందన్నారు. శుక్రవారం జరిగే చివరి టీ20లో మన బ్యాట్స్‌మెన్లు చెలరేగి ఆడాల్సిన అవసరం ఉందన్నాడు. లేనిపక్షంలో సిరీస్ కోల్పోయే ప్రమాదముందన్నారు. 
 
మైదానంలో పరిస్థితులు మనకు అనుకూలంగా లేనప్పుడు మనం 120 శాతం కష్టపడాల్సిన అవసరం ఉందని అన్నాడు. ఈ మ్యాచ్ లో ఆసీస్ ఆటగాళ్లు తమకంటే మెరుగైన ఆటతీరును ప్రదర్శించారన్నారు. ఈ సందర్భంగా ఆసీస్ పేస్ బౌలర్ జాసన్ బెహ్రెండార్ఫ్‌ను కోహ్లీ ఆకాశానికెత్తేశాడు. అద్భుతంగా బౌలింగ్ చేసి భారత వెన్ను విరిచాడన్నారు. 

సంబంధిత వార్తలు

ఆత్మాహుతి దాడులకు పాల్పడేందుకు ప్రవేశించిన ఐసిస్ ఉగ్రవాదులు

పల్నాడు జిల్లా ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన మలికా గార్గ్!!

తెలంగాణాకు శుభవార్త - జూన్ 5 -11 మధ్య నైరుతి రుతుపవనాలు ప్రవేశం!

బిల్లులు చెల్లించని జగన్ సర్కారు.. ఏపీలో ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేత!!?

వైఎస్ జగన్ అనే నేను... జూన్ 9న ఉదయం 9.38 గంటలకు విశాఖలో ప్రమాణ స్వీకారం...

దేవర ఫియర్ సాంగ్ వర్సెస్ పుష్ప సాంగ్.. జరగండి అంటోన్న చెర్రీ

కనీసం నా పిల్లలతో చాక్లెట్ పార్టీకి కూడా తీరికలేదు, రేవ్ పార్టీనా?: జానీ మాస్టర్ - video

రేవ్ పార్టీలో పట్టుబడ్డ అతడెవరో నాలాగే వున్నాడు: శ్రీకాంత్ మేకా

అబ్బాయిలూ ఇలా అమ్మాయిలకు ప్రపోజ్ చేస్తే చెంపలు చెళ్లుమంటాయి

పాయల్ రాజ్‌పుత్ పైన రక్షణ నిర్మాత ఫిలిం ఛాంబర్‌కు ఫిర్యాదు

తర్వాతి కథనం
Show comments