Webdunia - Bharat's app for daily news and videos

Install App

బ్రిస్బేన్‌ ట్వంటీ-20.. భారత్ విజయలక్ష్యం 174 ఫర్ 17 ఓవర్స్

Webdunia
బుధవారం, 21 నవంబరు 2018 (16:06 IST)
భారత్-ఆస్ట్రేలియాల మధ్య బ్రిస్బేన్‌లో జరుగుతున్న తొలి ట్వంటీ-20 మ్యాచ్‌లో భారత ఆటగాళ్లు సత్తా చాటారు. మూడు ట్వంటీ-20 సిరీస్‌లో భాగంగా.. తొలి టీ-20లో తొలుత టాస్ గెలిచిన టీమిండియా ఫీల్డింగ్ ఎంచుకుంది. పిచ్ పరిస్థితులు బౌలింగ్‌కు అనుకూలంగా వుండటంతో ఆసీస్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు.


ఎప్పటిలాగానే మ్యాచ్‌కు ముందుగానే తుది జట్టును భారత్ ప్రకటించింది. దీంతో తొలుత బ్యాటింగ్‌కు ఆస్ట్రేలియా జట్టుకు భారత బౌలర్లు చుక్కలు చూపించారు. స్వల్ప పరుగులకే మూడు వికెట్లు పడగొట్టారు. 
 
ఈ క్రమంలో ఖలీల్ అహ్మద్ ధాటికి ఆసీస్ ఓపెనర్ షార్ట్ పెవిలియన్ చేరుకున్నాడు. ఆ తర్వాత ఇన్నింగ్స్‌ను చక్కదిద్దేందుకు ప్రయత్నం చేసిన ఫించ్, క్రిస్ లైన్ కూడా ఖలీల్ బౌలింగ్‌లో అవుట్ అయ్యారు. ఈ క్రమంలో షార్ట్ ఏడు పరుగుల వద్ద అవుట్ కాగా, పించ్ 27 పరుగుల వద్ద వెనుదిరిగాడు. అలాగే లైన్ 37 పరుగుల వద్ద పెవిలియన్ చేరాడు. ఆపై బరిలోకి దిగిన మ్యాక్స్ వెల్ ధీటుగా ఆడాడు. 
 
భారత బౌలర్ల ధాటికి నిలకడగా బ్యాటింగ్ చేసిన మ్యాక్స్ వెల్ 46 పరుగులు సాధించాడు. కానీ బూమ్రా బౌలింగ్‌లో వెనుదిరిగాడు. ఇతనికి గట్టి భాగస్వామ్యం ఇచ్చిన స్టోనిస్ 33 పరుగులతో రాణించి నాటౌట్‌గా నిలిచాడు.

డెర్మోట్ 2 పరుగుల వద్ద నాటౌట్‌గా నిలిచాడు. దీంతో 17 ఓవర్లలోనే నాలుగు వికెట్ల పతనానికి ఆస్ట్రేలియా 158 పరుగులు సాధించింది. వర్షం కారణంగా 17 ఓవర్లకే మ్యాచ్‌ను కుదించడం జరిగిందని సమీక్ష ద్వారా తెలియరావడంతో.. భారత్ 174 పరుగులను 17 ఓవర్లలో సాధించాల్సి వుంటుంది. 
 
భారత బౌలర్లలో బూమ్రా, అహ్మద్ చెరో వికెట్ సాధించగా, కుల్‌దీప్ యాదవ్ తన ఖాతాలో రెండు వికెట్లు వేసుకున్నాడు. అనంతరం బరిలోకి దిగిన టీమిండియా ఆటగాళ్లలో ఆర్జీ శర్మ (4) ధావన్  (13) పరుగులతో క్రీజులో వున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రీల్స్ కోసం.. శునకాన్ని ఆటోపై ఎక్కించుకుని తిరిగాడు.. (Video)

Andhra Pradesh: ఏపీలో భూప్రకంపనలు.. రెండు సెకన్ల పాటు కంపించింది.. పరుగులు

యూపీలో ఇద్దరు యువతుల వివాహం.. ప్రేమ.. పెళ్లి ఎలా?

శ్రీతేజ్: సంధ్య థియేటర్ తొక్కిసలాటలో గాయపడ్డ ఈ అబ్బాయి ఇప్పుడెలా ఉన్నాడు?

పుష్ప 2 బ్లాక్‌బస్టర్ సక్సెస్‌తో 2024కు సెండాఫ్ ఇస్తున్న రష్మిక మందన్న

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తమన్నా భాటియా ఓదెల 2 నుంచి తమన్నా టెర్రిఫిక్ లుక్ రిలీజ్

Pushpa-2- పుష్ప-2: 100 సంవత్సరాల హిందీ సినిమా చరిత్రలో కొత్త మైలురాయి

బిగ్ బాస్ కంటే జైలు బెటర్ అంటున్న నటి కస్తూరి

ఆది సాయికుమార్ హారర్ థ్రిల్లర్ శంబాల

తెలంగాణలో సినిమా అభివృద్ధి కాకపోవడానికి కారకులు ఎవరు?

తర్వాతి కథనం
Show comments