Webdunia - Bharat's app for daily news and videos

Install App

రసపట్టులో వన్డే సిరీస్ : భారత్ - కివీస్‌ ఆఖరి వన్డే నేడు

ఐదు వన్డేల సిరీస్‌లో భాగంగా చివరి వన్డే మ్యాచ్ శనివారం జరుగనుంది. విశాఖ వేదికగా జరిగే ఈ మ్యాచ్‌లో విన్నర్‌కు టైటిల్ అందనుంది. వన్డేల్లో ఆతిథ్య జట్టుకు గట్టి పోటీనిచ్చిన కివీస్‌ 2-2తో సిరీస్‌ సమం చేసిం

Webdunia
శనివారం, 29 అక్టోబరు 2016 (08:59 IST)
ఐదు వన్డేల సిరీస్‌లో భాగంగా చివరి వన్డే మ్యాచ్ శనివారం జరుగనుంది. విశాఖ వేదికగా జరిగే ఈ మ్యాచ్‌లో విన్నర్‌కు టైటిల్ అందనుంది. వన్డేల్లో ఆతిథ్య జట్టుకు గట్టి పోటీనిచ్చిన కివీస్‌ 2-2తో సిరీస్‌ సమం చేసింది. దీంతో ఐదు వన్డేల సిరీస్‌ ఇప్పుడు రసపట్టులో పడింది. 
 
వైజాగ్‌ వేదికగా జరిగే ఐదో వన్డేలో నెగ్గిన జట్టుకు సిరీస్‌ దక్కుతుంది. ఈ నేపథ్యంలో ఇరుజట్లూ సిరీస్‌ డిసైడర్‌కు సిద్ధమయ్యాయి. కెప్టెన్సీ పరంగా కష్టకాలంలో ఉన్న ధోనీ ఎలాగైనా ఈ మ్యాచ్‌ నెగ్గి సిరీస్‌ విజయం అందుకోవాలని భావిస్తున్నాడు. మరోవైపు భారత గడ్డపై తొలిసారి వన్డే సిరీస్‌ నెగ్గి చరిత్ర సృష్టించాలని కివీస్‌ కుర్రోళ్లు ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. 
 
వన్డే సిరీస్‌ను కైవసం చేసుకుని టెస్టుల్లో భారత చేతిలో 0-3తో వైట్‌వాష్‌కు ప్రతీకారం తీర్చుకోవాలని కివీస్‌ భావిస్తోంది. అయితే.. వైజాగ్‌లో 4-1తో మెరుగైన రికార్డు ఉండటం భారతకు కలిసొచ్చే అంశం. ఈ వేదికపై ఆడిన చివరి మ్యాచ్‌ (2014 అక్టోబర్‌లో వెస్టిండీస్‌తో వన్డే) హుద్‌హుద్‌ తుఫాను కారణంగా ఒక్క బంతి కూడా పడకుండానే రద్దయింది. ఇప్పుడు కూడా తుఫాను హెచ్చరిక నేపథ్యంలో మ్యాచ్‌ జరుగుతుందో లేదోనని ఇరు జట్లలో ఆందోళన నెలకొంది. ఈ మ్యాచ్ కోసం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాటు చేశారు. 

సాధారణ మహిళలా మెట్రోలో నిర్మలా సీతారామన్ జర్నీ.. వీడియో వైరల్

కేరళలో విజృంభిస్తున్న హెపటైటిస్ ఏ- 12 మంది మృతి.. లక్షణాలు

స్వాతి మలివాల్‌పై కేజ్రీవాల్ సహాయకుడి దాడి.. ఆ నొప్పిలో వున్నా?

రాత్రంతా మహిళతో మాట్లాడాడు.. రూ. 60 లక్షలు ట్రాన్స్‌ఫర్ చేసుకున్నాడు...

సంతోషిమాత అమ్మవారికి కేజీ బరువున్న వెండి చక్రం

మ్యూజిక్ షాప్ మూర్తి నుంచి రాహుల్ సిప్లిగంజ్ పాడిన అంగ్రేజీ బీట్ లిరికల్ వచ్చేసింది

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన దర్శకుల సంఘం

రోడ్డు ప్రమాదంలో పవిత్ర మృతి.. త్రినయని నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య

రాహుల్ విజయ్, శివాని ల విద్య వాసుల అహం ఎలా ఉందంటే.. రివ్యూ

పాయల్ రాజ్‌ పుత్‌తో ప్రభాస్ పెళ్లి.. డార్లింగ్‌గా ఉంటాను?

తర్వాతి కథనం
Show comments