Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత్ క్రికెట్ జట్టు ఇంగ్లండ్ టూర్ షెడ్యూల్ ఇదే...

ద్వైపాక్షిక క్రికెట్ సిరీస్‌లో భాగంగా, భారత క్రికెట్ జట్టు ఇంగ్లండ్ పర్యటన షెడ్యూల్ ఖరారైంది. వచ్చే యేడాది జూలై నెల 3వ తేదీ నుంచి ఈ పర్యటన ప్రారంభమవుతుంది. మొత్తం మూడు నెలల పాటు టీమిండియా ఇంగ్లండ్ గడ్

Webdunia
బుధవారం, 6 సెప్టెంబరు 2017 (12:50 IST)
ద్వైపాక్షిక క్రికెట్ సిరీస్‌లో భాగంగా, భారత క్రికెట్ జట్టు ఇంగ్లండ్ పర్యటన షెడ్యూల్ ఖరారైంది. వచ్చే యేడాది జూలై నెల 3వ తేదీ నుంచి ఈ పర్యటన ప్రారంభమవుతుంది. మొత్తం మూడు నెలల పాటు టీమిండియా ఇంగ్లండ్ గడ్డపై గడపనుంది. ఈ షెడ్యూల్ వివరాలను ఇంగ్లండ్‌, వేల్స్‌ క్రికెట్‌ బోర్డు (ఈసీబీ) అధికారికంగా ప్రకటించింది. 
 
ఈ షెడ్యూల్‌లో ఐదు టెస్టులు, మూడు వన్డేలు, మూడు టీ20 మ్యాచ్‌లు ఆడుతుంది. ఇందుకోసం సెప్టెంబర్ రెండో వారం వరకు ఇంగ్లండ్‌లో టీమిండియా పర్యటించనుంది. తొలి టీ20 మ్యాచ్ జులై 3వ తేదీ న మాంచెస్టర్‌ వేదికగా జరగనుంది. తొలుత ట్వంటీ-20, ఆ తర్వాత వన్డే సిరీస్, పిమ్మట టెస్ట్ సిరీస్‌లను భారత్ ఆడనుంది. ఈ షెడ్యూల్ ఇదే... 
 
2018 జూలై 3న మాంచెష్టర్ వేదికగా మొదటి టీ20 మ్యాచ్. 
జులై 6న కార్డిఫ్ వేదికగా రెండో టీ20 మ్యాచ్.
జులై 8న బ్రిస్టల్ వేదికగా మూడో టీ20 మ్యాచ్.
జులై 12న నాటింగ్ హామ్ వేదికగా తొలి వన్డే మ్యాచ్.
జులై 14న లార్డ్స్ వేదికగా రెండో వన్డే మ్యాచ్.
జులై 17న లీడ్స్ వేదికగా మూడో వన్డే మ్యాచ్.
ఆగస్టు 1 నుంచి 5 వరకు ఎడ్జ్‌బాస్టన్ వేదికగా తొలి టెస్టు మ్యాచ్.
ఆగస్టు 9 నుంచి 13 వరకు లార్డ్స్ వేదికగా రెండో టెస్టు మ్యాచ్.
ఆగస్టు 18 నుంచి 22 వరకు నాటింగ్ హామ్ వేదికగా మూడో టెస్టు ‌మ్యాచ్.
ఆగస్టు 30 నుంచి సెప్టెంబర్‌ 3 వరకు సౌతాంప్టన్ వేదికగా నాలుగో టెస్టు మ్యాచ్.
సెప్టెంబర్‌ 7 నుంచి 11వ తేదీ వరకు లార్డ్స్ వేదికగా ఐదో టెస్టు మ్యాచ్ జరగనుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మహిళతో అర్థనగ్నంగా ప్రవర్తించిన ఎంఎన్‌ఎస్ నేత కుమారుడు

Weather alert: తెలంగాణలో భారీ వర్షాలు.. ఐదు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్

మైనర్ బాలికపై అత్యాచారం... ముద్దాయికి 20 యేళ్ల జైలు

వచ్చే నాలుగేళ్లలో మీకెలాంటి పనులు కావాలి... ఇంటికి కూటమి నేతలు

అమెరికాలో ఘోర ప్రమాదం... భాగ్యనగరికి చెందిన ఫ్యామిలీ అగ్నికి ఆహుతి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nidhi: హోమాలు, పూజలు తర్వాత నిధి అగర్వాల్ కెరీర్ పరుగెడుతుందా !

Chiru: విశ్వంభరలో చిరంజీవి రీమిక్స్ సాంగ్ చేయనున్నాడా !

వెంకీ సరసన నటించనున్న నిధి అగర్వాల్.. ఇదైనా హిట్ అవుతుందా?

రూరల్ గ్రామీణ యాక్షన్ డ్రామాగా మాధవ్ చిత్రం టైటిల్ మారెమ్మ

కోర్ట్‌తో హిట్ కొట్టింది.. ఇప్పుడు కోలీవుడ్‌లో క్రేజేంటో చూపెట్టనున్న శ్రీదేవి!

తర్వాతి కథనం
Show comments