Webdunia - Bharat's app for daily news and videos

Install App

టీమిండియాకు తృటిలో తప్పిన పెను ప్రమాదం... ఎలా?

Webdunia
ఆదివారం, 15 నవంబరు 2020 (10:21 IST)
భారత క్రికెట్ జట్టు ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లింది. ఈ పర్యటనలో వన్డేలు, ట్వంటీ20లు, టెస్ట్ మ్యాచ్‌లు ఆడనుంది. ఇందుకోసం ఆసీస్‌కు వెళ్లిన భారత క్రికెట్ జట్టు సిడ్నీలోని ఓ హోటల్‌లో కరోనా నిబంధనల మేరకు 14 రోజుల క్వారంటైన్‌లో ఉంది. అయితే, భారత టీమ్ బస చేసి వున్న ప్రాంతానికి సమీపంలో ఓ విమానం కూలిపోయింది. శనివారం సాయంత్రం 4.30 గంటల సమయంలో (ఆస్ట్రేలియా కాలమానం ప్రకారం) ఈ ప్రమాదం జరిగింది.
 
ఆటగాళ్లంతా ప్రమాదం జరిగిన సమయంలో సిడ్నీలోని క్రీడా మైదానంలోనే ఉన్నారు. వీరికి 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న క్రామర్ పార్క్‌లో విమానం కూలింది. అదృష్టవశాత్తూ, విమానంలోని ఇద్దరూ గాయాలతో బయటపడ్డారని 'స్టఫ్ డాట్ కో డాట్ ఎన్జడ్' ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది.
 
కాగా, రెండు రోజుల క్రితం భారత జట్టు ఆస్ట్రేలియా పర్యటన నిమిత్తం వచ్చిన సంగతి తెలిసిందే. కోహ్లీ నేతృత్వంలోని టీమిండియా, స్మిత్ నేతృత్వంలోని ఆసీస్ జట్టుతో తొలుత మూడు వన్డేలు ఆడనుంది. ఆపై టీ-20 సీరీస్, టెస్ట్ సీరీస్ కూడా సాగనుందన్న సంగతి తెలిసిందే. 
 
భారత క్రికెట్ జట్టు ఇటీవల యూఏఈ గడ్డపై జరిగిన ఐపీఎల్ 13వ సీజన్ టోర్నీలో పాల్గొన్న విషయం తెల్సిందే. వివిధ ప్రాంఛైజీల కోసం ఆడిన భారత ఆటగాళ్లు.. ఈ టోర్నీ ముగిసిన తర్వాత బీసీసీఈ ఎంపిక చేసిన ఆటగాళ్ళంతా టీమ్ ఇండియాగా అవతరించి ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లారు.

సంబంధిత వార్తలు

అరాచకాలకు పాల్పడితే సహించేది లేదు : వైకాపా గూండాలకు చంద్రబాబు హెచ్చరిక!!

Allu Arjun: నా ఫ్రెండ్ రవిచంద్రకి విషెస్ చెప్పా, మావయ్య పవన్ కల్యాణ్‌కు మద్దతు

తొలిసారి ఓటు వేస్తున్నాం... ఓటును అమ్ముకోవడానికి సిద్ధంగా లేం... : 30 యానాది కుటుంబాల ఓటర్లు!!

ఆంధ్రాలో ఉదయం 6.30 గంటలకే పోలింగ్ కేంద్రాలకు బారులు తీరిన ఓటర్లు!!

ఏంటి.. టీడీపీ ఏజెంటుగా కూర్చొంటావా.. చంపేసి శవాన్ని పోలింగ్ కేంద్రానికి పంపితే దిక్కెవరు?

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

తర్వాతి కథనం
Show comments