Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాంచీ వన్డే మ్యాచ్ : న్యూజిలాండ్ 260/6.. భారత్ టార్గెట్ 261 రన్స్

భారత్‌లో న్యూజిలాండ్ క్రికెట్ టీమ్ ప‌ర్య‌ట‌నలో భాగంగా కొన‌సాగుతున్న ఐదు వ‌న్డేల సిరీస్‌లో నాలుగో వన్డే రాంచీలోని జేఎస్‌సీఏ అంతర్జాతీయ స్టేడియంలో బుధవారం జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో పర్యాటక జట్టు టాస్‌ గెల

Webdunia
బుధవారం, 26 అక్టోబరు 2016 (17:28 IST)
భారత్‌లో న్యూజిలాండ్ క్రికెట్ టీమ్ ప‌ర్య‌ట‌నలో భాగంగా కొన‌సాగుతున్న ఐదు వ‌న్డేల సిరీస్‌లో నాలుగో వన్డే రాంచీలోని జేఎస్‌సీఏ అంతర్జాతీయ స్టేడియంలో బుధవారం జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో పర్యాటక జట్టు టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకుంది. న్యూజిలాండ్ ఓపెన‌ర్లుగా గుప్తిల్‌, లాథ‌మ్‌లు క్రీజులోకి దిగి... తొలి వికెట్‌కు 96 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఇందులో గుప్తిల్ 72, లాథన్ 39 చొప్పున పరుగులు చేశారు. 
 
అలాగే, మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్లు విలియన్స్ 41, టేలర్ 35, నీషం 6, వాట్లింగ్ 14, డెవిచ్ 11, సత్నల్ 17, సౌథీ 9 చొప్పున పరుగులు చేయగా, 16 రన్స్ అదనపు పరుగుల రూపంలో వచ్చాయి. నిజానికి ఓపెనర్లు మార్టిన్‌ గుప్తిల్‌ (72), టామ్‌ లాథమ్‌ (39) శుభారంభం ఇవ్వగా, కెప్టెన్ కేన్ విలియమ్సన్ (41), రాస్ టేలర్ (35) ఆకట్టుకున్నా భారీ స్కోర్లుగా మలచడంలో విఫలమయ్యారు. 
 
ఫలితంగా నిర్ణీత 50 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 260 పరుగులు చేసింది. భారత బౌలర్లలో అమిత్ మిశ్రా రెండు వికెట్లు తీయగా, యాదవ్, కులకర్ణి, పాండ్యా, పటేల్‌లు ఒక్కో వికెట్ చొప్పున తీశారు. కాగా, ఈ వన్డే సిరీస్‌లో భారత జట్టు ఇప్పటికే 2-1 ఆధిక్యంలో ఉన్న విషయం తెల్సిందే.
అన్నీ చూడండి

తాజా వార్తలు

అవసరమైతే ఎంపీలతో చేతులు కలుపుతాం.. పోలవరం కోసం పోరాడతాం.. మిథున్ రెడ్డి

అందుకే మా ఓట్లు తెదేపా అభ్యర్థికి వేశాం: భూమన కరుణాకర్ రెడ్డి కాళ్లపై పడి ఏడ్చిన వైసిపి కార్పొరేటర్లు

టెన్త్ విద్యార్థులకు స్టడీ అవర్‌లో స్నాక్స్... మెనూ ఇదే...

డిప్యూటీ మేయర్‌గా టీడీపీ అభ్యర్థి మునికృష్ణ ఎన్నిక

ఒకే అబ్బాయిని ఇష్టపడిన ఇద్దరమ్మాయిలు.. ప్రియుడి కోసం నడిరోడ్డుపై సిగపట్లు (Video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అభిమానులకు జూ.ఎన్టీఆర్ విజ్ఞప్తి.. ఓర్పుగా ఉండాలంటూ ప్రకటన

చిన్న చిత్రాలే పెద్ద సౌండ్ చేస్తున్నాయి.. నిర్మాత రాజ్ కందుకూరి

వెంకట్ పాత్రకు మంచి రెస్పాన్స్ వస్తోంది.. ‘పోతుగడ్డ’ ఫేమ్ ప్రశాంత్ కార్తి

'తండేల్' పక్కన రిలీజ్ చేస్తున్నాం: 'ఒక పథకం ప్రకారం' హీరో సాయి రామ్ శంకర్

'హరి హర వీరమల్లు'తో పాన్ ఇండియా విజయాన్ని అందుకుంటాం : నిర్మాత ఏ.ఎం.రత్నం

తర్వాతి కథనం
Show comments