Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాంచీ రాంబో.. ధోనీ రూ.43లక్షల కారులో.. కివీస్ ఆటగాళ్లు బస్సులో.. ఫోటో వైరల్..

టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి కార్లు, బైకులంటే పిచ్చి. అతని వద్ద ఇప్పటికే 23 బైకులు, పదికి పైగా కార్లున్నాయి. ఈ నేపథ్యంలో ధోనీని చూసి కివీస్ క్రికెటర్లు టామ్ లాథమ్, రాస్ టేలర్ షాక్ అయ్యారు.

Webdunia
బుధవారం, 26 అక్టోబరు 2016 (13:18 IST)
టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి కార్లు, బైకులంటే పిచ్చి. అతని వద్ద  ఇప్పటికే 23 బైకులు, పదికి పైగా కార్లున్నాయి. ఈ నేపథ్యంలో ధోనీని చూసి కివీస్ క్రికెటర్లు టామ్ లాథమ్, రాస్ టేలర్ షాక్ అయ్యారు. ఎక్కడంటే.. ధోనీ స్వస్థలమైన రాంచీలో. రాంచీలోని జేఎస్సీఏ ఇంటర్నేషనల్ స్టేడియం కాంప్లెక్స్‌లో భారత్- న్యూజిలాండ్ మధ్య నాలుగో వన్డే మ్యాచ్ జరుగనుంది. ఈ మ్యాచ్ కోసం రెండు జట్లు ఇప్పటికే స్టేడియానికి చేరుకున్నాయి. ఈ నేపథ్యంలో ధోనీ తన హమ్మర్ కారులో వెళ్తుండగా, అదే సమయంలో న్యూజిలాండ్ క్రికెట్ టీమ్ బస్సులో వెళ్తోంది.
 
ఆ బస్సు పక్కనుంచే ధోనీ వాహనం వెళుతుండటం, లాథమ్, టేలర్లు అది గమనించడం జరిగింది. దీంతో, సంతోషంతో పాటు వారు ఒకింత ఆశ్చర్యాన్ని కూడా వ్యక్తం చేశారు. ఇందుకు సంబంధించిన ఫొటో ఒకటి సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. కాగా ధోనీ కనిపించిన కారును రూ. 1.5లక్షలు కట్టి రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు. దీని విలువ రూ.43లక్షలు.  కాగా.. ఇప్పటివరకు జరిగిన మూడు మ్యాచ్‌ల్లో భారత్ రెండు, కివీస్ ఒక్క మ్యాచ్‌లో విజయం సాధించాయి.
అన్నీ చూడండి

తాజా వార్తలు

అవసరమైతే ఎంపీలతో చేతులు కలుపుతాం.. పోలవరం కోసం పోరాడతాం.. మిథున్ రెడ్డి

అందుకే మా ఓట్లు తెదేపా అభ్యర్థికి వేశాం: భూమన కరుణాకర్ రెడ్డి కాళ్లపై పడి ఏడ్చిన వైసిపి కార్పొరేటర్లు

టెన్త్ విద్యార్థులకు స్టడీ అవర్‌లో స్నాక్స్... మెనూ ఇదే...

డిప్యూటీ మేయర్‌గా టీడీపీ అభ్యర్థి మునికృష్ణ ఎన్నిక

ఒకే అబ్బాయిని ఇష్టపడిన ఇద్దరమ్మాయిలు.. ప్రియుడి కోసం నడిరోడ్డుపై సిగపట్లు (Video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మెడలో మంగళసూత్రం బరువైందమ్మా? భర్తకు తేరుకోని షాకిచ్చిన 'మహానటి'!!

అభిమానులకు జూ.ఎన్టీఆర్ విజ్ఞప్తి.. ఓర్పుగా ఉండాలంటూ ప్రకటన

చిన్న చిత్రాలే పెద్ద సౌండ్ చేస్తున్నాయి.. నిర్మాత రాజ్ కందుకూరి

వెంకట్ పాత్రకు మంచి రెస్పాన్స్ వస్తోంది.. ‘పోతుగడ్డ’ ఫేమ్ ప్రశాంత్ కార్తి

'తండేల్' పక్కన రిలీజ్ చేస్తున్నాం: 'ఒక పథకం ప్రకారం' హీరో సాయి రామ్ శంకర్

తర్వాతి కథనం
Show comments