Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐసీసీ టెస్ట్ ర్యాంకులు : మళ్లీ అగ్రస్థానానికి చేరుకున్న భారత్

ఠాగూర్
సోమవారం, 11 మార్చి 2024 (07:57 IST)
అంతర్జాతీయ క్రికెట్ మండలి ఐసీసీ టెస్టు ర్యాంకులను తాజాగా ప్రకటించింది. ఇందులో భారత క్రికెట్ జట్టు మళ్లీ మొదటి స్థానానికి చేరుకుంది. స్వదేశంలో పర్యాటక ఇంగ్లండ్ జట్టుతో జరిగిన ఐదు టెస్ట్ మ్యాచ్‌‍ల సిరీస్‌ను భారత్ 4-1 తేడాతో కైవసం చేసుకుంది. దీంతో టీమిండియా మళ్లీ అగ్రస్థానానికి ఎగబాకింది. నిన్నటిదాకా మొదటి స్థానంలో ఉన్న ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు ఇపుడు రెండో స్థానానికి పడిపోయింది. ఐసీసీ విడుదల చేసిన తాజా ర్యాంకింగ్స్ ప్రకారం... 
 
భారత్, ఆస్ట్రేలియా జట్లు మొదటి రెండు స్థానాల్లో ఉండగా, ఆ తర్వాతి స్థానాల్లో వరుసగా ఇంగ్లండ్ (3), న్యూజిలాండ్ (4), సౌతాఫ్రికా (5), పాకిస్థాన్ (6), వెస్టిండీస్ (7), శ్రీలంక (8), బంగ్లాదేశ్ (9), జింబాబ్వే (10), ఐర్లాండ్ (11), ఆప్ఘనిస్థాన్ (12) జట్లు ఉన్నాయి. ఐర్లాండ్ ఒక స్థానం మెరుగుపరుచుకుని 11వ ర్యాంకుకు చేరుకోగా, ఆప్ఘనిస్థాన్ ఒక స్థానం కోల్పోయి 12వ ర్యాంకుకు చేరుకుంది. అలాగే, భారత క్రికెట్ జట్టు ఐసీసీ నిర్వహించే వన్డే, టీ20, టెస్ట్ ఫార్మెట్‌లలో మొదటి స్థానంలో నిలిచింది. 
 
సరిగా ఆడలేకపోతున్నానని భావించినపుడు వైదొలుగుతా : రోహిత్ శర్మ
 
క్రికెట్‍ మైదానంలో‌నా శక్తి మేరకు రాణించలేకపోతున్నానని భావించినపుడు జట్టు నుంచే కాదు.. అంతర్జాతీయ క్రికెట్ నుంచి వైదొలుగుతానని భారత క్రికెట్ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ అన్నారు. రోహిత్ శర్మ క్రికెట్ శకం ముగిసిందని ఇటీవల ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ జెఫ్రీ బాయ్‌కాట్ చేసిన వ్యాఖ్యలను రోహిత్ శర్మ వద్ద ప్రస్తావించగా ఆయన స్పందించారు. తన ఆట బాగాలేదని అనిపించిన రోజున వెంటనే ఆట నుంచి తప్పుకుంటానని చెప్పారు. తనలో ఆట ఇంకా మిగిలి ఉందని స్పష్టం చేశాడు.
 
'నేను సరిగ్గా ఆడటం లేదని భావించినప్పుడు ఈ విషయాన్ని టీమ్ మేనేజ్‌మెంట్‌కు చెప్పి రిటైర్ అవుతా. కానీ నిజాయతీగా చెప్పాలంటే గత రెండు, మూడు ఏళ్లుగా నా ఆట మరింత మెరుగైంది. అత్యుత్తమ ఆట తీరును కనబరుస్తున్నా. నేను గణాంకాలు, రికార్డుల గురించి పెద్దగా పట్టించుకునే వ్యక్తిని కాదు. భారీ స్కోరులు చేయడం ముఖ్యమేకానీ జట్టు అవసరాలకు తగ్గట్టు ఆడటంపై దృష్టిపెట్టాను. నేను జట్టులో కొంత మార్పు తీసుకురావాలనుకున్నాను. ఆటగాళ్లు చాలా స్వేచ్ఛగా ఆడటం మీరు చూస్తున్నారు. వ్యక్తిగత స్కోర్లు ముఖ్యం కాదు. నిర్భయంగా, మనసును ప్రశాంతంగా ఉంచుకుని ఆడితే పరుగులు వాటంతట అవే వస్తాయి' అని రోహిత్ శర్మ చెప్పాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

శ్రీరాముని స్ఫూర్తితో ప్రజారంజక పాలన సాగిస్తా : సీఎం చంద్రబాబు

బెంగళూరు మెట్రో స్టేషన్ ప్లాట్‌ఫామ్‌పై యువ జంట: అమ్మాయి.. అబ్బాయి.. రొమాన్స్.. అలా? (video)

బీజేపీతో దోస్తీ ఎఫెక్ట్! తమిళనాడులో అన్నాడీఎంకే ఇక అంతేనా...

కుక్కపిల్లల కుస్తీ పోటీ, సినిమా చూస్తున్న కోళ్లు (video)

పైసా ఖర్చు లేకుండా ఇంటి పట్టాల రిజిస్ట్రేషన్ : మంత్రి నారా లోకేశ్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

44 యేళ్ళ మహిళ పెళ్లి విషయంపైనే మీ దృష్టిని ఎందుకుసారిస్తారు? : రేణూ దేశాయ్

విషపూరితమైన వ్యక్తులు - అసలు మీరెలా జీవిస్తున్నారు : త్రిష

Dil Raju: ఆస్ట్రేలియన్ కాన్సులేట్ జనరల్ ప్రతినిధి బృందంతో దిల్ రాజు భేటీ

యాంకర్ రవి క్షమాపణలు చెప్పారు.. ఎందుకంటే.. నందికొమ్ముల నుంచి చూస్తే? (video)

AA 22: అల్లు అర్జున్, అట్లీ సినిమా గురించి కొత్త అప్ డేట్ !

తర్వాతి కథనం
Show comments