Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత మహిళా క్రికెట్ ప్లేయర్‌ను కలిసిన బుకీలు.. భారీగా ఆఫర్ చేశారట..

Webdunia
బుధవారం, 18 సెప్టెంబరు 2019 (10:30 IST)
భారత మహిళా క్రికెట్ ప్లేయర్‌ను ఇద్దరు బుకీలు కలిశారనే ఆరోపణలపై బెంగళూరు పోలీసులు కేసు నమోదు చేశారు. ఇంగ్లండ్‌తో ఆడే మ్యాచ్‌ ఫిక్స్ చేయాలని వారు ఆమెను సంప్రదించినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఇంగ్లండ్‌తో పరిమిత ఓవర్ల క్రికెట్ సిరీస్ ఆడేందుకు ముందు ఫిబ్రవరిలో ఈ సంప్రదింపులు జరిగినట్లు వార్తలు వస్తున్నాయి. 
 
తమను తాము స్పోర్ట్స్ మేనేజర్లుగా పరిచయం చేసుకున్న ఇద్దరు వ్యక్తులు ఒక భారత మహిళా క్రికెటర్‌ను సంప్రదించారు. తనకు-రాకేష్ బాఫ్నాకు మధ్య ఫోన్లో జరిగిన సంభాషణను ఆమె రికార్డ్ చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. మోసం, జూదం సెక్షన్ల కింద వారిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసులో చిక్కుకున్ననిందితుల పేర్లు జితేంద్ర, బాఫ్నా అని పోలీసులు వెల్లడించారు. 
 
ఈ బెట్టింగ్ రూ.300 కోట్ల నుంచి వెయ్యి కోట్ల వరకు జరిగిందని అంచనా. ఇద్దరు బుకీలు మ్యాచ్ ఫిక్స్ చేయమని తనతో మాట్లాడారని మహిళా క్రికెటర్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. మహిళా క్రికెటర్లు కూడా పురుష క్రికెటర్ల లాగే బుకీల దృష్టిలో పడుతున్నారు. అందుకే వాళ్లు కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని బీసీసీఐ అధికారి అజిత్ సింగ్ షెకావత్ మీడియాతో అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పాకిస్థాన్‌కు వార్నింగ్ ఇచ్చిన సీఎం చంద్రబాబు.. అలా జరిగితే అదే చివరి రోజట...

ఏపీ లిక్కర్ స్కామ్‌ : ఆ ఇద్దరు ఐఏఎస్ అరెస్టు

Lizard: చికెన్ బిర్యానీలో ఫ్రైడ్ బల్లి కనిపించింది.. అదేం కాదులే తీసిపారేయండన్న మేనేజర్!

Heavy rain: గుంటూరు, నెల్లూరులో భారీ వర్షాలు.. మామిడి రైతులకు భారీ నష్టం

Tiruvannamalai: నాలుగు నెలల గర్భవతి.. నా భార్యే ఇక లేదు.. విషం తాగిన భర్త

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

#సింగిల్ సినిమాను పది మంది రిజెక్ట్ చేసినందుకు థ్యాంక్స్ చెప్పిన శ్రీవిష్ణు

కృష్ణ లీల తో వివి వినాయక్ కు తిరిగొచ్చిన కాలం అవుతుందా !

థియేటర్లపై తప్పుడు ప్రచారాలు నమ్మొద్దు: తెలంగాణ స్టేట్ ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్

రీయూనియన్‌ కథతో రుష్య, మిర్నా మీనన్ జంటగా డాన్ బాస్కో

మహేంద్రగిరి వారాహి కోసం డబ్బింగ్ స్టార్ట్ చేసిన సుమంత్

తర్వాతి కథనం
Show comments