అబార్షన్లు చేసే ఓ వైద్యుడి ఇంట రెండు వేలకు పైగా మెడికల్ పరంగా భద్రపరిచిన పిండాలను పోలీసులు గుర్తించడం అమెరికాలో కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే.. ఉల్‌రిచ్ క్లోప్‌ఫెర్ అనే వైద్యుడు ఈ నెల మూడో తేదీన మరణించాడు.
ఇండియానాలోని సౌత్బెండ్లో ఒక అబార్షన్ క్లీనిక్‌లో ఆయన సుదీర్ఘ కాలంగా డాక్టర్‌గా పనిచేశాడు. పేషెంట్ల రిజిస్టర్‌ను సరిగ్గా మెయింటైన్ చేయకపోవడం మెడికల్ అబార్షన్ పాలసీలను ఉల్లఘించడం వంటి వాటికి సంబంధించి ఈ క్లీనిక్‌పై ఇండియానా స్టేట్ డిపార్ట్‌మెంట్‌ఆఫ్ హెల్త్‌కు అనేక కంప్లయింట్లు అందాయి.
అబార్షన్‌కు ముందు 18 గంటల పాటు పేషెంట్లకు తప్పనిసరిగా ఇవ్వాల్సిన కౌన్సిలింగ్‌ను ఇవ్వడం లేదని మెడికల్ ఏజెన్సీలు గుర్తించాయి. దీంతో 2015లో ఈ హాస్పిటల్ లైసెన్స్‌ను అధికారులు రద్దు చేశారు. ఇండియానాలో అతి ఎక్కువ అబార్షన్లు చేసిన డాక్టర్‌గా క్లోప్ ఫెర్కు పేరుంది. నాలుగు దశాబ్దాలుగా చాలా క్లీనిక్స్‌లో అతడు వేలాది ఆపరేషన్లు చేశాడు.
ఈ నేపథ్యంలో గత వారం కోప్ఫెర్ మరణించిన తర్వాత అతడి ఇంట్లో పిండాలను గుర్తించిన ఫ్యామిలీ మెంబర్లు షెరీఫ్ ఆఫీసుకు సమాచారం అందించారు. పిండాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు, అతని ఇంట్లో ఎలాంటి మెడికల్ ప్రొసీజర్ నిర్వహించిన ఆధారాలు లేవన్నారు. ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభించారు.