భారత్ - పాకిస్థాన్ క్రికెట్ మ్యాచ్‌ను రద్దు చేయాలి : కేంద్ర మంత్రి గిరిరాజ్

Webdunia
మంగళవారం, 19 అక్టోబరు 2021 (12:10 IST)
జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలో నెలకొన్న ఉద్రిక్తపరిస్థితుల నేపథ్యంలో టీ20 ప్రపంచకప్‌లో భాగంగా భారత్-పాకిస్థాన్ మధ్య జరగనున్న మ్యాచ్‌ను రద్దు చేయాలనే డిమాండ్లు ఎక్కువైపోతున్నాయి. ఇప్పటికే పలువురు రాజకీయ నాయకులు పాక్‌తో మ్యాచ్ ఆడవద్దని టీమిండియాకు సూచించారు. ఇక ఈ వాదనకు బలం చేకూరుస్తూ కేంద్రమంత్రి గిరిరాజ్ సింగ్ సైతం భారత్-పాక్ మ్యాచ్ విషయంలో పునరాలోచన చేయాలన్నాడు. 
 
ప్రపంచకప్ షెడ్యూల్ ప్రకారం అక్టోబరు 24వ తేదీన ఈ బ్లాక్‌బస్టర్ మ్యాచ్ జరగనుంది. అయితే జమ్మూకాశ్మర్‌లో ఉగ్రవాదులు రెచ్చిపోతున్నారు. కాల్పులకు తెగబడుతూ అమాయక ప్రజల ప్రాణాలు తీస్తున్నారు. దక్షిణ కశ్మీర్‌లోని కుల్గాం జిల్లాలో ఆదివారం సాయంత్రం ఇద్దరిని చంపిన ముష్కరులు.. ఈ నెలలో ఇప్పటిదాకా 11 మందిని పొట్టనబెట్టుకున్నారు. 
 
ముఖ్యంగా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారినే టార్గెట్‌గా పెట్టుకుంటూ చంపేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పాకిస్థాన్‌పై దేశవ్యాప్తంగా ఆగ్రహజ్వాలలు వ్యక్తమవుతున్నాయి. టీ20 ప్రపంచకప్‌లో పాక్‌తో మ్యాచ్ ఆడకుండా టీమిండియా బాయ్ కట్ చేయాలనే డిమాండ్ వినిపిస్తుంది. ఈ క్రమంలోనే కేంద్రమంత్రి గిరిరాజ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. 
 
'భారత్-పాకిస్థాన్ మధ్య సత్సంబంధాలు సరిగ్గా లేవు కాబట్టి టీ20 ప్రపంచకప్‌లో భాగంగా ఇరు దేశాల మధ్య జరిగే మ్యాచ్‌పై పునరాలోచన చేయాలి'పేర్కొన్నారు. పంజాబ్ మంత్రి పర్గత్ సింగ్ సైతం ఈ మ్యాచ్ రద్దు చేయాలని డిమాండ్ చేశారు. పాకిస్థాన్‌తో సత్సంబంధాలను పూర్తిగా తెంచుకోవాలన్నాడు. 'సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్తత పరిస్థితుల నేపథ్యంలో టీ20 ప్రపంచకప్‌లో భాగంగా జరిగే భారత్-పాక్ మ్యాచ్‌ను రద్దు చేయాలి.  కాబట్టి ఇరుదేశాల మధ్య సంత్సంబంధాలను పూర్తిగా తెంచుకోవడం ఉత్తమం.'అని ఆయన చెప్పుకొచ్చారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సీఎం సార్, రైల్వేకోడూరు టికెట్ ఇప్పిస్తామని రూ.7 కోట్లు తీసుకున్నారు: బాబుకి టీడిపి కార్యకర్త వీడియో

రిపోర్ట్ వచ్చేవరకూ ఆ 2000 కోళ్లను ఎవ్వరూ తినొద్దు

మనిద్దరి మధ్య మా ఆయన అడ్డుగా వున్నాడు, చంపేయ్: ప్రియుడితో వివాహిత

ట్రంప్ మళ్లీ కొత్త మెలిక: మధుమేహం, ఊబకాయం వుంటే వీసా రిజెక్ట్

బావతో భార్య నవ్వుతూ మాట్లాడిందని పీక కోసిన భర్త, ఆపై ఆత్మహత్య

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో మూవీకి చాలా అవార్డులు వస్తాయి - బీవీఎస్ రవి

Janhvi Swaroop: కౌశిక్ గోల్డ్, డైమండ్స్ ప్రచారకర్తగా జాన్వి స్వరూప్ ఘట్టమనేని

సంచలనంగా మారిన మన శంకరవర ప్రసాద్ గారు మీసాల పిల్ల సాంగ్

Mahesh Babu: మహేష్ బాబు .. బిజినెస్‌మ్యాన్ 4K ప్రింట్‌తో రీ-రిలీజ్

Kalivi Vanam: వనాలను రక్షించుకోవాలనే నేపథ్యంతో కలివి వనం

తర్వాతి కథనం
Show comments