Webdunia - Bharat's app for daily news and videos

Install App

తొలి టెస్ట్ మ్యాచ్ : పీకల్లోతు కష్టాల్లో బంగ్లాదేశ్

cricket balls
Webdunia
గురువారం, 15 డిశెంబరు 2022 (15:24 IST)
ఆతిథ్య బంగ్లాదేశ్‌తో ఛట్టోగ్రామ్‌ వేదికగా జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్‌లో భారత జట్టు తన తొలి ఇన్నింగ్స్‌లో 404 పరుగులు చేసింది. ఆ తర్వాత తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన బంగ్లాదేశ్‌ పీకల్లోతు కష్టాల్లో కూరుకునిపోయింది. కేవలం 56 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. భారత బౌలర్ సిరాజ్ మూడు వికెట్లు నేలకూల్చి బంగ్లాదేశ్ టాపార్డర్‌ను కకావికలం చేశాడు. ఫలితంగా 56 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయింది. 
 
బంగ్లా ఓపెనర్లు శాంటో డకౌట్ కాగా, జకీర్ హుస్సేన్ 20, కెప్టెన్  లిట్టన్ దాస్ 4 చొప్పున పరుగులు చేశాడు. ఈ మూడు వికెట్లను సిరాజ్ పడగొట్టాడు. మరో ఎండ్‌లో ఉమేశ్ ఓ వికెట్ తీశాడు. దీంతో భారత శిబిరంలో ఆనందం నింపాడు. భారత్ తన తొలి ఇన్నింగ్స్‌లో చేసిన పరుగులు బంగ్లాదేశ్ ఇంకా 333 పరుగుల దూరంలో ఉంది. 
 
అంతకుముందు భారత్ ఇన్నింగ్స్‌లో కేఎల్ రాహుల్ 22, గిల్ 20, పుజారా 90, కోహ్లీ 1, రిషబ్ పంత్ 46, శ్రేయాస్ అయ్యర్ 86, అక్సర్ పటేల్ 14, అశ్విన్ 58, కుల్దీప్ యాదవ్ 40, ఉమేశ్ యాదవ్ 15 (నాటౌట్), సిరాజ్ 4 చొప్పున పరుగులు చేశారు. బంగ్లా బౌలర్లలో ఇస్లాం, మిరాజ్‌లు చెరో నాలుగు వికెట్లు తీయగా, హుస్సే్, అహ్మద్ చెరో వికెట్ తీశారు. దీంతో భారత తొలి ఇన్నింగ్స్‌లో 404 పరుగులు చేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అనంత్ అంబానీ 141 కిలోమీటర్లు కాలినడకన ద్వారక చేరుకుంటారా?

పూజ చేస్తున్న సమయంలో మంటలు.. గాయపడిన గిరిజా వ్యాస్

డామిట్ కథ అడ్డం తిరిగింది... కోడలిని మొదటి భర్త వద్దకు పంపిన అత్తగారు!!

మయన్మార్ భూకంపం : 2700 దాటిన మృతుల సంఖ్య... మరింతగా పెరిగే ఛాన్స్..!!

కేవైసీ పూర్తయ్యాక.. కొత్త రేషన్ కార్డులు ఇస్తాం : మంత్రి నాదెండ్ల మనోహర్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika: సల్మాన్ ఖాన్‌, రష్మిక మందన్నకెమిస్ట్రీ ఫెయిల్

రోషన్ కనకాల మోగ్లీ 2025 నుంచి బండి సరోజ్ కుమార్ లుక్

Sai Kumar : సాయి కుమార్‌ కు అభినయ వాచస్పతి అవార్డుతో సన్మానం

మ్యాడ్ స్క్వేర్ నాలుగు రోజుల్లో.70 కోట్ల గ్రాస్ చేసింది : సూర్యదేవర నాగవంశీ

Nani: HIT: ది 3rd కేస్ నుంచి న్యూ పోస్టర్ రిలీజ్

తర్వాతి కథనం
Show comments