Webdunia - Bharat's app for daily news and videos

Install App

క్లాసెన్ దంచుడు .. మళ్లీ ఓడిన టీమిండియా

Webdunia
సోమవారం, 13 జూన్ 2022 (10:02 IST)
సౌతాఫ్రికా ఆటగాడు క్లాసెన్ వీరబాదుడు భారత బౌలర్లు చేతులెత్తలేసారు. ఫలితంగా కటక్ వేదికగా ఆదివారం రాత్రి జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో భారత్ వరుసగా రెండో ఓటమిని చవిచూసింది. అన్ని విభాగాల్లో అద్భుతంగా రాణించిన సఫారీలు నాలుగు వికెట్ల తేడాతో విజయభేరీ మోగించారు. 
 
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 148 పరుగులకు ఆలౌట్ అయింది. శ్రేయాస్ అయ్యర్ 40, ఇషాన్ కిషన్ 34, దినేష్ కార్తీక్ 30 (నాటౌట్)లు మాత్రమే రాణించారు. మిగిలిన ఆటగాళ్లు మరోమారు విఫలయ్యారు. దీంతో భారత్ తక్కువ స్కోరుకే పరిమితమైంది. 
 
ఆ తర్వాత 149 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన సఫారీల 18.2 ఓవర్లలో విజయభేరీ మోగించారు. సఫారీ జట్టు కెప్టెన్ బవుమా 35, చివర్లో డేవిడ్ మిల్లర్ 20 (నాటౌట్)గా నిలిచారు. కానీ, రెగ్యులర్ కీవర్ క్వింటన్ డికాక్ గాయపడటంతో జట్టులోకి వచ్చిన కీపర్ హెన్రిచ్ క్లాసెన్ కేవలం 46 బంతుల్లో 81 పరుగులు చేసి జట్టును విజయతీరాలకు చేర్చాడు. 
 
క్లాసెన్ స్కోరులో ఏడు ఫోర్లు, ఐదు భారీ సిక్సర్లు ఉండటం గమనార్హం. క్లాసెన్ బ్యాటింగ్ ధాటికి భారత బౌలర్లు చేతులెత్తేశారు. నిజానికి తొలి టీ20లో భారత పాలిట డేవిడ్ మిల్లర్, వాన్ డర్ డుసెన్‌లు విలన్లుగా మారారు. ఫలితంగా 211 పరుగుల భారీ లక్ష్యాన్ని మరికొన్ని బంతులు మిగిలివుండగానే ఛేదించారు. 
 
కానీ, రెండో ట్వంటీ20లో మాత్రం క్లాసెన్ భారత బౌలర్లకు చుక్కలు చూపించాడు. భాలత బౌలర్లలో భువనేశ్వర్ 4 వికెట్లు తీయగా, చహల్, హర్షల్ పటేల్‌లు ఒక్కో వికెట్ చొప్పున తీశారు. ఈ విజయంతో ఐదు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌లో దక్షిణాఫ్రికా జట్టు 2-0 ఆధిక్యాన్ని కూడబెట్టుకుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Andhra Pradesh: దుర్గమ్మ ఆలయంలో దసరా ఉత్సవాలు.. ఏఐ సాయంతో డ్రోన్స్.. ఏర్పాట్లు ముమ్మరం

కారును గోడౌన్‌లో ఉంచినందుకు రోజుకు రూ.2400 అపరాధం చెల్లించిన బిల్ గేట్స్

డబ్బు కోసం బాయ్‌ఫ్రెండ్‌ను కిడ్నాప్ చేసిన ప్రియురాలు

ఏపీ మద్యం కేసు : అట్టపెట్టెల్లో దాచిన కరెన్సీ కట్టలు స్వాధీనం

రష్యా తీరంలో భారీ భూకంపం... సునామీ హెచ్చరికలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'ఆర్ఎక్స్-100' హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్‌కు పితృవియోగం

రాజాసాబ్ నుంచి సంజూ బాబాకు శుభాకాంక్షలు తెలుపుతూ సంజయ్ దత్ లుక్

Gopichand: గోపీచంద్ రెండు సినిమాలపై శ్రద్ధ పెడుతున్నాడు

సంగీత దర్శకుడు అనిరుధ్‌ను కిడ్నాప్ చేస్తానంటున్న విజయ్ దేవరకొండ

హెబ్బా పటేల్, రేఖ నిరోషా నటించిన థాంక్యూ డియర్ విడుదలకు సిద్ధమైంది

తర్వాతి కథనం
Show comments