Webdunia - Bharat's app for daily news and videos

Install App

అరుదైన రికార్డును నెలకొల్పిన హార్దిక్ పాండ్యా - ఎలైట్ జాబితాలో చోటు!

ఠాగూర్
సోమవారం, 24 ఫిబ్రవరి 2025 (16:53 IST)
భారత స్టార్ క్రికెటర్ హార్దిక్ పాండ్యా అరుదైన రికార్డును నెలకొల్పారు. అంతర్జాతీయ క్రికెట్‌లో నాలుగు వేలు అంతకంటే ఎక్కువ పరుగులు సాధించడంతో పాటు 200 లేదా అంతకంటే ఎక్కువ వికెట్లు తీసిన ఆరో భారత ఆటగాడిగా రికార్డు నెలకొల్పారు. ఈ జాబితాలో సచిన్ టెండూల్కర్, కపిల్ దేవ్, రవిశాస్త్రి, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్ వంటివారు ఈ ఎలైట్ జాబితాలో ఉన్నారు. ఇపుడు ఈ ఆల్‌రౌండర్ కూడా చేరాడు. 
 
కాగా, ఈ జాబితాలో ఉన్న ఆటగాళ్లలో సచిన్ టెండూల్కర్ 34357 పరుగులు, 201 వికెట్లు తీయగా, కపిల్ దేవ్ 9031 పరుగులు 687 వికెట్లు, రవిశాస్త్రి 6938 పరుగులు, 280 వికెట్లు, రవీంద్ర జడేడా 6664 పరుగులు, 604 వికెట్లు, రవిచంద్రన్ అశ్విన్ 4394 పరుగులు, 765 వికెట్లు, హార్దిక్ పాండ్యా 4149 పరుగులు, 200 వికెట్లు చొప్పున తీశాడు. 
 
ఇదిలావుంటే ఆదివారం దుబాయ్ వేదికగా భారత్, పాకిస్థాన్ జట్ల మధ్య కీలక మ్యాచ్ జరిగింది. ఇందులో హార్దిక్ పాండ్యా కొత్త ప్రియురాలు సందడి చేశారు. ఆమె పేరు జాస్మిన్ వాలియా. ఈమె కారణంగానే హార్దిక్ పాండ్యా - నటాషా దంపతులు విడిపోయినట్టు ప్రచారం సాగుతుంది. ఈ క్రమంలో ఈ బ్రిటిష్ సింగర్‌తో ఆయన రిలేషన్‌‍లో ఉన్నట్టు సమాచారం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఎలక్ట్రానిక్ వార్ఫేర్‌ను మొహరించిన భారత్ : అష్టదిగ్బంధనం చేస్తోందంటూ పాక్ గగ్గోలు...

భారత్ అంటే అంత భయం అందుకే - పాక్ సైనికులే కాదు ఉగ్రవాదులు ఉ... పోసుకుంటున్నారు...

Cobra: బెంగళూరు-బాత్రూమ్‌లో ఆరడుగుల నాగుపాము.. ఎలా పట్టుకున్నారంటే? (video)

Mohan Babu: నటుడు మోహన్ బాబుకు ఎదురుదెబ్బ- ఆ పిటిషన్‌ను తోసిపుచ్చిన సుప్రీం

May Day: మే డేను ఎందుకు జరుపుకుంటారు?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

HIT 3 Movie Review: క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ HIT మూవీ రివ్యూ రిపోర్ట్

కింగ్‌డమ్ నుండి విజయ్ దేవరకొండ, భాగ్యశ్రీ బొర్సె ముద్దులతో హృదయం పాట ప్రోమో

కింగ్ జాకీ - క్వీన్ యూనిక్ యాక్షన్ మూవీ: దీక్షిత్ శెట్టి

త్రీ రోజెస్ సీజన్ 2 నుంచి కుషిత కల్లపు గ్లింప్స్ రిలీజ్

జ్యోతి పూర్వజ్ సై-ఫై యాక్షన్ థ్రిల్లర్ మూవీ కిల్లర్ గ్లింప్స్ రిలీజ్

తర్వాతి కథనం
Show comments