Webdunia - Bharat's app for daily news and videos

Install App

గిల్ వీరబాదుడు.. ఉప్పల్ స్టేడియంలో పరుగుల వరద

Webdunia
బుధవారం, 18 జనవరి 2023 (17:32 IST)
ఉప్పల్ స్టేడియాలో భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య తొలి వన్డే మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో భారత ఆటగాడు శుభమన్ గిల్ వీరబాదుడు బాదాడు. ఏకంగా డబుల్ సెంచరీ చేశాడు. కేవలం 87 బంతుల్లో సెంచరీ బాదిన గిల్.. ఆతర్వాత మరింత దూకుడుగా ఆడి డబుల్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 145 బంతుల్లోనే అత‌ను రెండొంద‌లు సాధించాడు. ఫెర్గూస‌న్ బౌలింగ్‌లో వ‌రుస‌గా హ్యాట్రిక్ సిక్స్‌లు బాదాడు. త‌న క‌ళాత్మ‌క షాట్ల‌తో ఉప్ప‌ల్ స్టేడియాన్ని హోరెత్తించాడు. అత‌ని ఇన్నింగ్స్‌లో 19 ఫోర్లు 8 సిక్స‌ర్లు ఉన్నాయి. దాంతో భార‌త్ నిర్ణీత ఓవ‌ర్ల‌లో భారీ స్కోర్ చేసింది. ఫలితంగా నిర్ణీత 50 ఓవర్లలో 349 పరుగులు చేసింది. 
 
ఇటీవల శ్రీలంకతో మూడో వన్డేలోనూ గిల్ సెంచరీ బాదడం తెలిసిందే. సూపర్ ఫామ్‌లో ఉన్న గిల్ బుధవారం హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలోనూ పరుగుల వెల్లువ సృష్టించాడు. అంతకుముందు రోహిత్ శర్మ 34, సూర్యకుమార్ యాదవ్ 31, హార్దిక్ పాండ్యా 28 పరుగులు చేశారు. కోహ్లీ (8), ఇషాన్ కిషన్ (5) విఫలమయ్యారు. కివీస్ బౌలర్లలో డారిల్ మిచెల్ 2, లాకీ ఫెర్గుసన్ 1, బ్లెయిర్ టిక్నర్ 1, మిచెల్ శాంట్నర్ ఒక వికెట్ తీశారు.
 
 

సంబంధిత వార్తలు

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

తర్వాతి కథనం
Show comments