Webdunia - Bharat's app for daily news and videos

Install App

బుమ్రా రికార్డుకు చెక్ పెట్టిన రిషబ్ పంత్.. అలా దూరమైంది..?

Webdunia
శుక్రవారం, 5 ఫిబ్రవరి 2021 (15:39 IST)
Bumrah
టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ బుమ్రాకు లభించాల్సిన ఓ గొప్ప రికార్డుడు దూరం చేశాడు. అంతేకాదు టెస్టు మ్యాచ్‌ను కూడా ఓ డ్రాప్ క్యాచ్‌తో మొదలుపెట్టాడు. దీంతో పంత్‌పై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శుక్రవారం నుంచి ప్రారంభమైన ఇంగ్లండ్-ఇండియా టెస్టుతో బుమ్రాకు తొలిసారిగా స్వదేశంలో టెస్టు ఆడుతున్నాడు. దీంతో ఈ మ్యాచ్ బూమ్రాకు చాలా ముఖ్యమైనది. 
 
అంతేకాదు అతడిపై భారీ అంచనాలే ఉన్నాయి. ఈ క్రమంలోనే అతడు తన తొలి బంతి విసిరాడు. అద్భుతమైన ఆ బంతి ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్ బ్యాటును తాకుతూ కీపర్ పంత్ వద్దకు వెళ్లింది. కానీ పంత్ దానిని అందుకోలేకపోయాడు. దీంతో స్వదేశంలో తొలి బంతికే వికెట్ తీసిన రికార్డుకు బుమ్రా దూరమయ్యడు.
 
అయితే దీనిపై నెటిజన్లు మాత్రం పంత్‌పై ట్రోలింగ్ మొదలుపెట్టారు. పంత్ తన డ్రాప్ క్యాచుల రికార్డును తానే అధిగమిస్తున్నాడంటూ ఎగతాళి చేయగా.. మరొకరేమో.. ఎంతో ముఖ్యమైన ఈ సిరీస్‌ను భారత్ డ్రాప్ క్యాచ్‌తో ప్రారంభించింది' అంటూ కామెంట్ చేశాడు.
 
ఇదిలా ఉంటే ఇదే మ్యాచ్‌లో బుమ్రా బౌలింగ్‌లోనే స్లిప్స్‌లో ఉన్న రోహిత్ కూడా మరో క్యాచ్ వదిలేశాడు. దీనిపై కూడా నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. మరికొంతమంది మాత్రం బుమ్రా బౌలింగ్‌ను మెచ్చుకుంటూ.. అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నావంటూ ప్రశంసిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

స్పేస్ వాక్ కోసం ఐఎస్ఎస్ నుంచి బయటకు వచ్చిన సునీత విలియమ్స్

26 నుంచి తెలంగాణాలో కొత్త రేషన్ కార్డుల పంపిణీ

అన్న కుమార్తెను వేధిస్తున్నాడని యువకుడి తల్లిదండ్రులపై పెట్రోల్ పోసి...

ఈ యేడాది నీట్ పరీక్షను ఎలా నిర్వహిస్తారు: ఎన్టీఏ వివరణ

ఇంజనీరింగ్ విద్యార్థినిపై అత్యాచారం... ఎక్కడ?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'సంక్రాంతికి వస్తున్నాం' - 3 రోజుల్లోనే రూ.106 కోట్లు వసూళ్లు!!

సైఫ్ అలీఖాన్‌కు కత్తిపోట్లు: ప్రధాన నిందితుడు అరెస్ట్?

బక్కోడికి రజిని బండోడికి బాలయ్య - తమన్ డైలాగ్ వైరల్

గేమ్ చేంజర్ పైరసీ - ఏపీ లోక‌ల్ టీవీ అప్పల్రాజు అరెస్ట్

ఆకట్టుకున్న హరి హర వీరమల్లు పార్ట్-1 మాట వినాలి పాట విజువల్స్

తర్వాతి కథనం
Show comments