Webdunia - Bharat's app for daily news and videos

Install App

క్రికెట్ వరల్డ్ కప్‌ను గెలిచే సత్తా కోహ్లీ సేనకు లేదా? కుంబ్లే కామెంట్స్

Webdunia
శనివారం, 18 మే 2019 (11:41 IST)
ఈ నెల 30వ తేదీ నుంచి ఇంగ్లండ్ అండ్ వేల్స్ వేదికగా ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ టోర్నీ ప్రారంభంకానుంది. ఈ టోర్నీ కోసం క్రికెట్ ప్రపంచం యావత్తూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోంది. ఈ టోర్నీలో పాల్గొనే దేశాల్లో ఎవరు టైటిల్ విజేతగా నిలుస్తారోనన్న ఆసక్తి సర్వత్రా నెలకొనివుంది. 
 
ఈ నేపథ్యంలో భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ అనిల్ కుంబ్లే కీలక వ్యాఖ్యలు చేశారు. ఇంగ్లండ్ వేదికగా జరిగే ఈ టోర్నీలో టైటిల్ విజేతగా నిలిచే అర్హత ఆస్ట్రేలియాకు ఉందని వ్యాఖ్యానించారు. ఇప్పటివరకూ జరిగిన అన్ని ఐసీసీ ఈవెంట్‌లలోనూ ఆస్ట్రేలియాకు అద్భుతంగా రాణించిందని గుర్తుచేశారు. 
 
"వాళ్లు ప్రతీ ప్రపంచకప్‌లోనూ అద్భుతమైన ప్రదర్శన చేశారు. ఈసారి వాళ్ల జట్టు చాలా పటిష్టంగా ఉంది. ఇంగ్లండ్ పరిస్థితులు కూడా వాళ్లకి బాగా తెలుసు. కాబట్టి వాళ్లు విజయవంతంగా టోర్నమెంట్‌ను ముగిస్తారని అనుకుంటున్నారు. 
 
ఆస్ట్రేలియాకు విజయం ఎలా సాధించాలో తెలుసు. ప్రపంచకప్‌లో అది చాలా ముఖ్యం. వాళ్లు ఖచ్చితంగా సెమీఫైనల్స్‌కు చేరుతారు' అని కుంబ్లే స్పష్టం చేసారు. ఆరోన్ ఫించ్ సారథ్యంలో ప్రపంచకప్‌ బరిలోకి దిగుతున్న ఆస్ట్రేలియా శ్రీలంకతో వార్మప్ మ్యాచ్ ఆడి.. తొలి మ్యాచ్ పసికూన ఆప్ఘనిస్థాన్‌తో తలపడనుంది.

అయితే, క్రికెట్ పండితులంతా కోహ్లీ సేనను వరల్డ్ కప్ టైటిల్ ఫేవరేట్‌గా భావిస్తున్నారు. భారత జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ అద్భుతమైన ఫామ్‌లో ఉండటంతో పాటు.. మాజీ ఆటగాడు మహేంద్ర సింగ్ ధోనీ, ఎలాంటి క్లిష్టపరిస్థితుల్లోనైనా రాణించే మెరికల్లాంటి యువ క్రికెటర్లు ఉండటంతో ఖచ్చితంగా భారత్ వరల్డ్ కప్ టైటిల్ ఫేవరేట్ జట్లలో ఒకటిగా ఉందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. కానీ, అనిల్ కుంబ్లే మాత్రం భారత జట్టు ప్రస్తావనే తీసుకునిరాకుండా, కేవలం ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ జట్ల గురించే ప్రస్తావించడం ఇపుడు చర్చనీయాంశంగా మారింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆస్పత్రి ఎగ్జిక్యూటివ్ వేధింపులు.. మహిళా ఫార్మసిస్ట్ ఆత్మహత్య.. మృతి

ప్రైవేట్ బస్సులో మహిళపై సామూహిక అత్యాచారం.. ఇద్దరు కుమారుల ముందే..?

పచ్చడి కొనలేనోడివి పెళ్లానికేం కొనిస్తావ్ రా: అలేఖ్య చిట్టి పికిల్స్ రచ్చ (Video)

తిరుపతి-పళనిల మధ్య ఆర్టీసీ సేవలను ప్రారంభించిన పవన్ కల్యాణ్

కొండపై గెస్ట్ హౌస్ సీజ్.. కేతిరెడ్డికి అలా షాకిచ్చిన రెవెన్యూ అధికారులు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sampoornesh: రాజమౌళి గారి పలకరింపే నాకు ధైర్యం : సంపూర్ణేష్ బాబు

Urvashi Rautela : దబిడి దిబిడి తర్వాత ఊర్వశి రౌతేలా సన్నీ డియోల్ జాట్ లో అలరిస్తోంది

Devara 2 : ఎన్.టి.ఆర్. దేవర సీక్వెల్ వుండదా?

విశ్వంభర లో కొత్తతరం హాస్యనటులతో మెగాస్టార్ చిరంజీవి

శ్రీ విష్ణు, కేతిక శర్మ, ఇవానా నటించిన #సింగిల్ ఫస్ట్ సాంగ్

తర్వాతి కథనం
Show comments